• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘చంద్రముఖి2’పై స్పందించిన లారెస్స్

    లారెన్స్ ‘చంద్రముఖి2’ ఫలితంపై స్పందించారు. ”ఈ సినిమా ద్వారా నా డబ్బులు నాకు వచ్చాయి. లైఫ్‌లో అన్నీ మనం గెలవాలని లేదు. ఈ గ్లామర్‌ను పెట్టుకుని హీరో అవకాశాలు ఇవ్వడమే దేవుడిచ్చిన వరం. మళ్లీ దానిలో ఫ్లాప్‌, హిట్‌లు గురించి ఆలోచించకూడదు. కంటెంట్‌ బలంగా ఉండాలంటే దర్శకుడు కూడా అంతే బలంగా ఉండాలి’ లారెస్స్ చెప్పుకొచ్చారు.

    ఆ సినిమాకు నో చెప్పడం మంచిదైంది: లారెన్స్

    రాఘవ లారెస్స్ హీరోగా, ఎస్‌జే సూర్య విలన్‌గా కార్తీక్ దర్శకత్వంలో ‘జిగర్తండ డబుల్ ఎక్స్’ చిత్రం తెరకెక్కబోతుంది. ఇందులో నటి నిమిషా సజయన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ టీజర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చెన్నైలోని ఓ థియోటర్‌లో నిర్వహించారు. లారెన్స్ మాట్లాడుతూ.. గతంలో ‘జిగర్తండా’ చిత్రానికి వచ్చిన ఆఫర్‌ను తిరస్కరించానని చెప్పారు. అది వదులుకోవడం వల్లే ఇప్పుడు రూ.100 కోట్లతో రూపొందుతున్న ‘జిగర్తండా డబుల్ ఎక్స్’ చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని లారెన్స్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

    ‘చంద్రముఖి 2’ కోసం లారెన్స్ భారీ రెమ్యునరేషన్!

    హీరో రాఘవా లారెన్స్ నటించిన చంద్రముఖి 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సెప్టెంబర్ 28న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తుంది. అప్పట్లో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘చంద్రముఖి’కి ఇది సీక్వెల్ గా తెరకెక్కింది. అయితే ఈ చిత్రంపై ఇప్పుడు లారెన్స్ రెమ్యునరేష్ హాట్ టాపిగా మారింది. ఈ చిత్రం కోసం లారెన్స్‌కి లైకా నిర్మాణ సంస్థ దాదాపు రూ. 25 కోట్లను పారితోషికంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. లారెన్స్ ఇంత రెమ్యునరేషన్ తీసుకోవడం ఇదే మొదటిసారట?