• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • లక్కీ డ్రాలో రూ. 10,973 కోట్ల జాక్‌పాట్‌

    అమెరికాలో మైన్‌ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. మెగా మిలియన్స్‌ జాక్‌పాట్‌లో అతడు రూ. 10,973 కోట్లు గెలుచుకున్నాడు. జనవరి 13న తీసిన డ్రాలో విన్నింగ్‌ టికెట్‌ సంఖ్యతో అతడి దగ్గరున్న 30,43,45,46,51 నంబర్లు సరిపోలాయి. దీంతో మెగా మిలియన్స్‌ జాక్‌పాట్‌ అతడిని విజేతగా ప్రకటించింది. ఇందులో గెలుచుకున్న సొమ్మును 29 ఏళ్ల పాటు విడతల వారీగా చెల్లిస్తారు. ఒకేసారి కావాలంటే మాత్రం రూ. 7 వేల కోట్లు మాత్రమే ఇస్తారు. చాలామంది 29 ఏళ్లు ఆగలేక 7 వేల కోట్లు … Read more

    రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా 165 మంది

    ఓ గ్రామానికి చెందిన 165 మంది రైతులు రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారారు. బెల్జియంలోని ఓల్మెన్ గ్రామానికి చెందిన రైతులు చందాలు వేసుకుని లాటరీ టికెట్ కొన్నారు. అదృష్టం వరించి ఆ గ్రామస్తులకే లాటరీ తగిలింది. దీంతో రూ.1,200 కోట్ల విలువైన లాటరీ గెలుచుకున్నారు. ఒక్కొక్కరికి రూ.7.50 కోట్లు పంచుకున్నారు. ఈ గ్రామస్తులు గత కొన్నేళ్లుగా లాటరీ కొంటున్నా ఎప్పుడూ వరించలేదు. రైతులు తలో రూ.1,300 పెట్టి లాటరీ టికెట్ కొనడం విశేషం.

    లాటరీలో కోట్ల డబ్బు.. వధువు కోసం వెతుకులాట

    ఓ వ్యక్తి లాటరీలో భారీ మొత్తంలో డబ్బు గెలుచుకుని.. మంచి వధువు కోసం వెతుకుతున్నాడు. జర్మనీకి చెందిన కుర్షిత్ ఇల్దిరిమ్ గత నెలలో రూ.82 కోట్లు లాటరీలో గెలిచాడు. ఇతను ఓ ఉక్కు ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఆ ఉద్యోగాన్ని వదిలేసి ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్నాడు. లాటరీ డబ్బులతో లగ్జరీ కార్లు, వాచీలు కొంటున్నాడు. 41ఏళ్ల కుర్షిత్‌కు ఇప్పటికీ పెళ్లి కాలేదు. ప్రస్తుతం వధువు వెతుకులాటలో ఉన్నాడు. తనను గుడ్డిగా నమ్మే యువతి కావాలంటూ.. అమ్మాయి కోసం వెతుకులాటలో పడ్డాడు.

    రూ. 248 కోట్ల లాటరీ వస్తే ఏం చేశాడో తెలుసా ?

    చైనాలో ఓ వ్యక్తి లాటరీలో 248 కోట్లు గెలుచుకున్నారు. కానీ, అతడి సంతోషాన్ని కుటుంబ సభ్యులతో పంచుకోలేదు. డబ్బు వచ్చిందని తెలిస్తే తన భార్య, కుమారుడు కష్టపడి పనిచేయరనే ఆందోళనతో చెప్పట్లేదని వెల్లడించాడు. ధనం వారిని అహంకారులను చేయకూడదని పేర్కొన్నాడు. గ్వాంగ్‌జి జువాంగికి చెందిన అతడు పదేళ్లుగా లాటరీలు కొంటున్నాడు. ఎట్టకేలకు కోట్ల రూపాయలు తగలటంతో ఉబ్బితబ్బిపోయాడు. తన సంతోషం తెలియకుండా ఉండేందుకు కార్టూన్‌ గెటప్‌లో ఇంటికి వెళ్లినట్లు చెప్పాడు.

    లాట‌రీతో రాత్రికి రాత్రే కోటీశ్వ‌రుడిగా మారిన డాక్ట‌ర్

    క‌న్యాకుమారికి చెందిన ఒక డాక్ట‌ర్‌కు బంప‌ర్ ఆఫ‌ర్ త‌గిలింది. లాట‌రీతో రాత్రికి రాత్రే కోటీశ్వ‌రుడిగా మారాడు. కేర‌ళ‌లో విషు ఫెస్టివ‌ల్ సంద‌ర్భంగా డాక్ట‌ర్ ప్ర‌దీప్ కుమార్ తిరువ‌నంత‌పురంలో ఒక లాట‌రీని కొనుగోలు చేశాడు. ఆ లాట‌రీతో అత‌డు రూ.10 కోట్లు గెలుచుకున్న‌ట్లు గుర్తించిన నిర్వాహ‌కులు ఫోన్‌ చేసి స‌మాచారం అందిచారు. త్వ‌ర‌లో డాక్ట‌ర్ ఖాతాలో ఈ డ‌బ్బు డిపాజిట్ చేస్తామ‌ని వెల్ల‌డించారు.