మహాభారతంపై స్టార్ దర్శకుడు సినిమా
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వివేక్ ఆగ్నిహోత్రి తన తర్వాతి సినిమాను ప్రకటించాడు. మహాభారతం ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాకు ‘పర్వ’ అనే పేరును ఖరారు చేసినట్లు పోస్టర్‌లో తెలిపాడు. ఈ చిత్రం మూడు భాగాలుగా రానున్నట్లు వెల్లడించాడు. ఇలాంటి సినిమాను తెరకెక్కిస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉందని చెప్పాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తానని ఆగ్రి హోత్రి పేర్కొన్నాడు.