• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • నాగశౌర్యకి కట్నం ఎంతో తెలుసా ?

  హీరో నాగశౌర్య నిన్ననే ఓ ఇంటివాడయ్యాడు. బెంగళూరుకు చెందిన అనూష శెట్టిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో నాగశౌర్య్ ఎంత కట్నం తీసుకున్నాడనే విషయంపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చే జరుగుతోంది. సుమారు రూ. 40 నుంచి 50 కోట్లు కట్నం కింద ఇచ్చారని టాక్ నడుస్తోంది. శౌర్య మామగారు ఆస్తులు కూడా బాగానే రాశారని టాక్. రెండు మూడు సినిమాలు తీస్తే వచ్చే ఆదాయాన్ని కట్నంగా తీసుకున్నారంటే నమ్మలేమని కొందరు..ప్రేమ పెళ్లి కాబట్టి అసలు తీసుకోలేదని మరికొందరు వాదిస్తున్నారు.

  వివాహ బంధంలోకి నాగశౌర్య

  నటుడు నాగశౌర్య ఇవాళ వివాహబంధంలోకి అడుగుపెడుతున్నాడు. బెంగళూరుకు చెందిన ఇంటీరియర్‌ డిజైనర్‌ అనూష శెట్టితో అతడు ఏడడుగులు నడవనున్నాడు. బెంగళూరులోని ఓ ఫైవ్‌స్టార్ హోటళ్లో వీరి వివాహం జరగబోతోంది. నిన్న జరిగిన హల్దీ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. హల్దీ అనంతరం కాక్‌టైల్‌ పార్టీ కూడా నిర్వహించారు. సన్నిహితుల సమక్షంలో కాబోయే సతీమణి వేలికి నాగశౌర్య ఉంగరం తొడిగాడు. Courtesy Twitter:Nagashourya Courtesy Twitter:Nagashourya Courtesy Twitter:Nagashourya

  హీరో నాగశౌర్యకు అస్వస్థత

  యంగ్ హీరో నాగశౌర్య అస్వస్థతకు గురయ్యారు. షూటింగ్‌లో ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే స్పందించిన చిత్ర బృందం ఆయన్ను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించింది. షూటింగ్‌లో భాగంగా నాగశౌర్య కొన్ని గంటల పాటు ఆహారంతో పాటు నీళ్లు తీసుకోకుండా ఉన్నారట. దీంతో ఆయన నీరసానికి గురై స్పృతప్పి పడిపోయారని తెలిసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. తాజాగా నాగశౌర్య తన 24 చిత్రాన్ని ప్రారంభించారు. SS అరుణాచలం దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది.

  నాగశౌర్య 24వ చిత్రం

  యంగ్‌ హీరో నాగశౌర్య తన 24వ చిత్రాన్ని ప్రకటించారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనున్న ఈ సినిమాకు ఎస్‌ఎస్‌ అరుణాచలం దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నాగశౌర్య వైవిధ్యమైన పాత్రలో కనిపించనున్నారు. వైష్ణవి ఫిలింస్‌ బ్యానర్‌పై శ్రీనివాస రావు, విజయ్‌ కుమార్‌, అశోక్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. త్వరలోనే చిత్రాన్ని ప్రారంభించి సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు మేకర్స్‌ పనులు పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతానికి సినిమాకు టైటిల్‌ను ఖరారు చేయలేదు.

  Krishna Vrinda Vihari Review

  నేడు( సెప్టెబంర్ 23) ప్రపంచ వ్యాప్తంగా కృష్ణవ్రింద విహారి మూవీ థియేటర్లలో విడుదలైంది. లక్ష్యతో ఫ్లాప్ అందుకున్న నాగశౌర్య హిట్ కొట్టాడా? కొత్త హీరోయిన్ షెర్లీ నటన ఎలా ఉంది? డైరెక్టర్ అనీష్ కృష్ణ తన కథనంతో ప్రేక్షకులను మెప్పించాడో లేదో ఓసారి సమీక్షిద్దాం. సమీక్ష: కృష్ణవ్రింద విహారి మూవీ దాదాపు హీరో నాని నటించిన అంటే సుందరానికీ సినిమా మాదిరిగానే ఉంది. కానీ సినిమా కథనాన్ని నిర్వహించిన తీరు బాగుంది. ఫస్టాఫ్‌లో కామెడీతో సినిమా నడిస్తే.. సెకండాఫ్‌లో ఫ్యామిలీ సన్నివేశాలతో కొనసాగింది. సత్య … Read more

  కృష్ణ వ్రింద విహారి ట్విట్టర్ రివ్యూ

  నాగశౌర్య హీరోగా నటించిన కృష్ణవ్రింద విహారి మూవీపై ట్విట్టర్‌లో ప్రేక్షకులు రివ్యూస్ పెడుతున్నారు. నాగశౌర్య మరో హిట్ ఖాతాలో వేసుకున్నాడని కామెంట్ చేస్తున్నారు. డైరెక్టర్ అనీష్ కృష్ణ కొత్త కథతో వచ్చాడని పోస్టులు పెడుతున్నారు. ఫస్టాఫ్ పర్వాలేదట.. సెకాండాఫ్ క్లైమాక్స్ రోటిన్‌గా ఉందంట. అయితే ఫ్యామిలీ ఆడియన్స్, యువతకు బాగా కనెక్ట్‌ అవుతుందట. కొత్త హీరోయిన్ షెర్లీ నటన బాగుందట. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, రాహుల్ రామకృష్ణ కామెడీ చిత్రానికి హైలెట్‌గా నిలిచాయని కామెంట్ చేస్తున్నారు. పూర్తి రివ్యూ మరికొద్ది సేపట్లో రానుంది.

  రేపు సాయంత్రం 6 గంటలకు KVV ప్రీ రిలీజ్ ఈవెంట్

  ఈనెల 23వ తేదీన విడుదల కానున్న ‘కృష్ణ వృింద విహారి’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు(సెప్టెంబర్ 20న) సాయంత్రం ఆరు గంటలకు నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని JRC కన్వెన్షన్ హాలులో ఈ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ మేరకు చిత్రబృందం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ మూవీలో హీరోగా నాగశౌర్య నటిస్తుండగా, హీరోయిన్‌గా షిర్లీ సెటియా నటిస్తోంది. అనీష్ కృష్ణ డైరెక్టర్.

  ‘కృష్ణ విృంద విహారి’ టీం పాదయాత్ర షెడ్యూల్ ఇదే !

  నాగశౌర్య, షిర్లీ సెటియా జంటగా నటించిన చిత్రం ‘కృష్ణ విృంద విహారి’. ఈనెల 23న ఈ మూవీ విడుదల కానుండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ మొదలుపెట్టేసింది. అందులో భాగంగానే మూవీ యూనిట్ పాదయాత్ర చేయనుంది. మొదటగా ఈనెల 14వ తేదీన తిరుపతి నుంచి ఈ ప్రమోషనల్ పాదయాత్ర మొదలుపెట్టనుంది. 15న నెల్లూరు, ఒంగోలు, 16న గుంటూరు, విజయవాడ, ఏలూరు, 17న భీమవరం, రాజమండ్రి, 18న వైజాగ్, కాకినాడలో చిత్రబృందం ప్రమోషన్స్ నిర్వహించనుంది.

  SUPER: ట్రైలర్ అదిరిపోయింది

  నాగ శౌర్య హీరోగా షిర్లీ సెటియా హీరోయిన్‌గా అనీష్ తెరకెక్కించిన చిత్రం ‘కృష్ణ విృంద విహారి’. ఈనెల 23వ తేదీన విడుదల కానున్న ఈ మూవీ ట్రైలర్ నేడు విడుదలైంది. వినోదభరితంగా సాగిన ఈ ట్రైలర్‌లో రాహుల్ రామకృష్ణ, సత్య, వెన్నల కిషోర్ కామెడీ ఆకట్టుకుంటుంది. హీరో, హీరోయిన్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ బాగున్నాయి. ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తుండగా.. ఉషా మల్పూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు.

  రేపు KVV నుంచి ‘తార నా తార’ లిరికల్ సాంగ్

  నాగశౌర్య, శేతియా షెర్లీ జంటగా నటిస్తున్న చిత్రం ‘కృష్ణ విృంద విహారి’. అనీష్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి ‘తార నా తార’ అనే లిరికల్ సాంగ్ రేపు సాయంత్రం 4.02గంటలకు విడుదల కానుంది. ఈ మేరకు చిత్రబృందం ఓ ప్రకటన విడుదల చేసింది. రాధికా శరత్ కుమార్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ నటిస్తున్న ఈ చిత్రం ఈనెల 23వ తేదీన విడుదల కానుంది.