• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వాస్తవికతను అర్థం చేసుకోండి: నారాయణ మూర్తి

    ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో అవినీతి, చెత్త రహదారులు, కాలుష్యంతో పాటు చాలాసార్లు అధికారం లేకపోవటం వాస్తవికత అన్నారు. అదే సింగపూర్‌లో శుభ్రంగా కనిపించే రోడ్లు, కాలుష్యం లేకపోవటం, చేతిలో అధికారం అక్కడ వాస్తవిక పరిస్థితులని చెప్పారు. జీఎంఆర్‌ఐటీకి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. వాస్తవికతను సృష్టించుకోవటం మన అందరిపై ఉన్న బాధ్యతని పేర్కొన్నారు.

    దేశానికి యువతే కీలకం: నారాయణమూర్తి

    యువత నిజాయితీగా పనిచేస్తేనే దేశం ఉన్నత స్థితిలో ఉంటుందని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి అన్నారు. వాళ్లే మార్గదర్శకులు అవుతారని చెప్పారు. ఇలా శ్రమించిన వారే విదేశాల్లో మన దేశ రాయబారులుగా ఉన్నారని పేర్కొన్నారు.“ కెరీర్ ను ఎంచుకోవటం, దానిపై అమితంగా శ్రమించడం, అందులో ఉన్నతస్థితి సాధించడం వంటి లక్ష్యాలు నిర్దేశించుకోవాలి. దేశం గెలిస్తేనే మీరు గెలుస్తారని గుర్తు పెట్టుకోవాలి. నేను కలలు కన్న భారత్ ను యువత సాధిస్తారని నమ్ముతున్నా “ అన్నారు.

    భారత పరిశోధన రంగానికి మచ్చ : నారాయణమూర్తి

    జాంబియా దేశంలో 66 మంది చిన్నారుల మరణానికి భారత్ లో తయారైన దగ్గు మందు కారణమనే ఆరోపణలపై ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఘాటూగా స్పందించారు. ఇలాంటి ఆరోపణలు దేశానికే సిగ్గుచేటన్నారు. కరోనా టీకాలు తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేసినప్పటికీ దగ్గు మందు అపవాద మచ్చ తెచ్చేదంటూ వ్యాఖ్యానించారు. దేశంలో చాలావరకు గన్యా, డెంగీ సమస్యతో బాధపడుతున్నా… మందు కనుగోలేకపోవటం వైఫల్యమేనన్నారు.

    బ్రిటన్ కొత్త ప్రధానిగా భారత సంతతి వ్యక్తి?

    బ్రిటన్ కొత్త ప్రధానిగా పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. బోరిస్ జాన్సన్ రాజీనామాతో ప్రస్తుతం బ్రిటన్ లో ప్రధాని పదవి ఖాళీ అయింది. ప్రధాని పదవిని ఆ దేశ ఆర్థిక మంత్రి రిషి సునాక్ చేపట్టనున్నారని వార్తలు వస్తున్నాయి. రిషి సునాక్ భారత సంతతి వ్యక్తి. వీరి పూర్వికులది భారత్ లోని పంజాబ్. అంతేకాదు ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి కుమార్తే అక్షతా మూర్తినే ఆయన పెళ్లి చేసుకున్నారు. ఆయన ప్రధాని పదవి చేపడితే బ్రిటన్ లో అత్యున్నత పదవి చేపట్టిన తొలి భారత సంతతి … Read more

    వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం విధానంపై ఇన్ఫోసిస్ ఫౌండ‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

    దేశంలో కోవిడ్ మొద‌లైన‌ప్ప‌టి నుంచి వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం సంస్కృతి వ‌చ్చింది. చిన్న సంస్థ‌ల నుంచి పెద్ద పెద్ద ఐటీ సంస్థ‌లు ఈ విధానాన్నే అవ‌లంబించి త‌మ ఉద్యోగుల‌కు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం అవ‌కాశం క‌ల్పించారు. గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా ఈ విధానం అమ‌ల‌వుతోంది. అయితే, ప్ర‌స్తుతం క‌రోనా కేసులు త‌గ్గుతుండ‌డంతో సంస్థ‌లు ఉద్యోగుల‌ను ఆఫీసుల‌కు ఆహ్వానిస్తున్నాయి. కానీ, ఇన్నాళ్లు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం విధానానికి అల‌వాటు ప‌డ్డ ఉద్యోగులు ఆఫీసుల‌కు వెళ్ల‌డానికి అంత‌గా ఆస‌క్తి చూప‌డం లేదు. ఈ నేప‌థ్యంలో ఇన్ఫోసిస్ వ్య‌వ‌స్థాప‌కుడు … Read more