తెలుగమ్మాయిలా ఆదరించారు: మృణాల్
తనను తెలుగింటి ఆడపడుచులా ఆదరించారని బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అన్నారు. ‘సీతారామం’ విడుదలై ఏడాది పూర్తికావడంతో మృణాల్ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘‘నా తొలి సినిమా సీతారామంను ఆదరించినందుకు ధన్యవాదాలు.నన్ను తెలుగమ్మాయిలా అంగీకరించారు. భవిష్యత్‌లో మిమ్మల్ని అలరించే పాత్రలు పోషిస్తా. అందుకు మీరు సిద్ధంగా ఉండండి. డైరెక్టర్ హను రాఘవపూడి, హీరో దుల్కర్ సల్మాన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు.’’ అంటూ రాసుకొచ్చింది.