• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘అప్పుడు అభిమానిని.. ఇప్పుడు అతిథిని’

    ఒకప్పుడు శిల్పాకళావేదికలో జరిగే ఈవెంట్లకు ఫ్యాన్ పాసులు దొరక్క వెనక్కి వెళ్లిపోయానని, కానీ ఇప్పుడు అదే వేదికపైకి అతిథిగా వచ్చానని హీరో నవీన్ పొలిశెట్టి అన్నారు. దీనికి కారణం తెలుగు ప్రేక్షకులేనని చెప్పారు. ‘స్వాతిముత్యం’ ప్రి రిలీజ్ వేడుకకు నటుడు సిద్ధు జొన్నలగడ్డతో కలసి నవీన్ హాజరయ్యారు. నటీనటులపై ప్రేమాభిమానాలు కురిపించి సినిమాలను విజయవంతం చేసేది ప్రేక్షకులేనని పేర్కొన్నారు. మళ్లీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాని చెప్పారు. ఈ సందర్భంగా వర్ష బొల్లమ్మతో కలసి ‘చిట్టి నీ నవ్వంటే’ పాటకు డ్యాన్స్ వేసి అలరించారు.

    ఢిల్లీలో ‘పీఎస్-1’ టీమ్ సందడి

    మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ‘పొన్నియన్ సెల్వన్-1’ ప్రి రిలీజ్ వేడుక ఢిల్లీలో అట్టహాసంగా జరిగింది. ఈ ఈవెంట్‌లో చిత్ర నటీనటులు సందడి చేశారు. ముఖ్యంగా ఐశ్వర్యరాయ్, త్రిష ఫంక్షన్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. కాగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్నిసెప్టెంబర్ 30న దేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, ఐశ్వర్యరాయ్ కీలక పాత్రలు పోషించారు.

    అనంతకు వచ్చేస్తున్న ‘గాడ్ ఫాదర్’

    మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ ప్రి రిలీజ్ ఈవెంట్ ఏపీలోని అనంతపురంలో నిర్వహిస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. సెప్టెంబర్ 28న స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో సాయంత్రం 6 గంటలకు ఈవెంట్ జరుగుతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. కాగా ఈ చిత్రం మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమాలో సల్మాన్‌ఖాన్, సత్యదేవ్, నయనతార, సునీల్ కీలక పాత్రల్లో నటించారు. అక్టోబర్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

    భాగ్యనగరంలో మెరిసిన ఐశ్వర్య

    పొన్నియన్ సెల్వన్-1 ప్రిరిలీజ్ ఈవెంట్‌లో మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ బచ్చన్ తళుక్కన మెరిసింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఈవెంట్‌లో ఐశ్వర్యరాయ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. కాగా ఐశ్వర్య.. పొన్నియన్ సెల్వన్-1 చిత్రంలో నటించింది. ఈ సినిమా సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో చియాన్ విక్రమ్, కార్తీ, త్రిష, జయం రవి తదితరులు నటించారు. Courtesy Twitter: Courtesy Twitter: Courtesy Twitter: Courtesy Twitter:

    త్రివేండ్రంలో పీఎస్-1 ప్రి రిలీజ్

    మణిరత్నం కలల సినిమా పొన్నియన్ సెల్వం-1 ప్రి రిలీజ్ ఈవెంట్ వేడుక ఘనంగా జరిగింది. కేరళలోని త్రివేండ్రంలో ఈ ఈవెంట్‌ను నిర్వహించారు మూవీ మేకర్స్. ఈవెంట్‌కు మణిరత్నం, విక్రమ్, జయం రవి, కార్తీ, త్రిష, ఐశ్వర్యలక్ష్మి తదితరులు హాజరయ్యారు. కాగా ఈ చిత్రాన్నిసెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. Courtesy Twitter: Courtesy Twitter: Courtesy Twitter:

    ‘అల్లూరి’కి అతిథిగా అల్లు అర్జున్

    ‘అల్లూరి’ చిత్ర ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వస్తున్నాడు. సెప్టెంబర్ 18న మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్‌లో జరిగే ఈ కార్యక్రమానికి బన్నీ హాజరవుతున్నాడు. ఈ విషయాన్నిచిత్ర బృందం ట్విటర్‌లో తెలిపింది. కాగా శ్రీవిష్ణు, కయద్ లోహర్ జంటగా ప్రదీప్ వర్మ దర్శకత్వంలో అల్లూరి చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాను ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

    మార్చి 19న RRR ప్రీ రిలీజ్ ఈవెంట్

    సినీ ప్రేక్షకులకు RRR మూవీ యూనిట్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మార్చి 19న జరపనున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించింది. మార్చి 19 సాయంత్రం 6 గంటలకు కర్ణాటకలోని చిక్కబల్లాపురలో ఈ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ వేడుకకు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైతో పాటు పలువురు ప్రముఖులు కూడా రానున్నట్లు తెలుస్తోంది