హైదరాబాద్లో పలుచోట్ల వర్షం
హైదరాబాద్లో పలుచోట్ల వర్షం కురుస్తోంది. తెల్లవారు జామునుంచి మబ్బులు కమ్ముకుని అక్కడక్కడా చిరజల్లులు కురుస్తున్నాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మలక్పేట్, అమీర్పేట్, పంజాగుట్ట, దిల్సుఖ్నగర్ తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. మరోవైపు ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. గత రెండు రోజులతో పోలిస్తే ఇవాళ చలి తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. చలి, తుంపర్ల వానతో హైదరాబాద్లో వర్షాకాలంలో ముసురేసినట్లుగా వాతావరణం ఉంది.