• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • సుందర్ ఆటతీరు అద్భుతం: రవిశాస్త్రి

  న్యూజిలాండ్ పర్యటన ద్వారా యువ ఆటగాళ్ల ప్రతిభ వెలుగులోకి వచ్చిందని టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నారు. వన్డే మ్యాచ్ ల కారణంగా మంచే జరిగిందన్నారు. శ్రేయస్ అయ్యర్ రెండు మ్యాచుల్లో అదరగొట్టాడని, ఉమ్రాన్ మాలిక్ బౌలిగ్ తో కట్టి పడేశారని పేర్కొన్నారు. మాలిక్ ఇలాగే బౌలింగ్ వేస్తే అద్భుతంగా రాణిస్తాడని వెల్లడించారు. గాయం కారణంగా కొంతకాలం జట్టుకు దూరమైన వాషింగ్టన్ సుందర్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడని.. అతడి ప్రదర్శన తనను ఆకట్టుకుందని వ్యాఖ్యానించారు.

  ధావన్‌కు గుర్తింపు దక్కట్లేదు: రవిశాస్త్రి

  టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్‌కు తగిన గుర్తింపు లభించట్లేదని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. విరాట్, రోహిత్ శర్మలపైనే అందరి దృష్టి ఉందని చెప్పాడు. ‘శిఖర్ ధావన్ సహజంగానే దూకుడైన ఆటగాడు. వన్డేల్లో అతడికి మెరుగైన ట్రాక్ రికార్డు ఉంది. టీమిండియాకు ముఖ్యమైన మ్యాచుల్లోనూ రాణించాడు. అతడి ఆటతీరుకు తగిన గుర్తింపు రావట్లేదు. ప్రస్తుతం అతడి చుట్టూ ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లున్నారు. కానీ, అనుభవం రీత్యా ధావన్‌కు తగిన గౌరవం లభిస్తుందని ఆశిస్తున్నా’ అని రవిశాస్త్రి చెప్పాడు.

  కేెఎల్‌ రాహుల్‌ ఆడాల్సిందే: రవిశాస్త్రి

  కేఎల్‌ రాహుల్‌ ఎట్టి పరిస్థితుల్లో రాణించాల్సిన అవసరం ఉందని మాజీ కోచ్‌ రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. రాహుల్‌ వైఫల్యం కారణంగా మిడిలార్డర్‌పై ఒత్తిడి పెరుగుతోందన్నారు. టాప్‌ ఆర్డర్‌ మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాహుల్‌ పరుగులు సాధిస్తే జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఇక సూర్యకుమార్‌ యాదవ్‌ ప్రపంచకప్‌లో వెలిగిపోతున్నాడని…10 ఏళ్ల క్రితం ఎవరూ ఊహించలేని షాట్స్‌ ఆడుతున్నాడని రవిశాస్త్రి కొనియాడారు.

  ఆ LBW గుర్తిస్తే ఇండియా గెలిచేది: రవిశాస్త్రి

  ఆస్ట్రేలియాతో తొలి టీ20లో ఇండియా పరాజయానికి ప్రధాన కారణం ఓ LBW గుర్తించకపోవడమేనని భారత మాజీ కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నారు. అది గుర్తించి ఉంటే ఇండియానే గెలిచే అవకాశం ఉండేదన్నారు. మరోవైపు LBWను గుర్తించడంలో ధోని బెస్ట్ అంటూ ప్రశంసించారు. చాహల్ బౌలింగ్‌లో కామరూన్ 5వ ఓవర్లోనే ఔట్ అయ్యేవాడని, బాల్ అతని ప్యాడ్‌కు తాకినా కూడా ఎవ్వరూ అప్పీల్ చేయలేదన్నారు. అంతేకాదు భారత్ బౌలింగ్, ఫీల్డింగ్ కూడా సరిగా చేయలేదని పేర్కొన్నారు.

  భారత్‌ను వెంటాడుతున్న బౌలింగ్ సమస్య.. ఆస్ట్రేలియా గడ్డపై పరిస్థితేంటి?

  ఆసియా కప్ లో భారత బౌలింగ్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. సూపర్ 4 మ్యాచుల్లో బౌలింగ్ దళం తన స్కోరును కాపాడుకోలేకపోయింది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో టీమిండియా బౌలర్లు చేతులెత్తేశారు. అయితే, ఇప్పుడు కళ్లన్నీ రానున్న టీ20 ప్రపంచకప్ మీదే. ఆస్ట్రేలియా గడ్డపై జరగనున్న ఈ టోర్నీకి అత్యుత్తమ బౌలింగ్ దళం కావాలి. మరి టీమిండియా ప్రస్తుత పరిస్థితి ఏంటి? కంగారూల పిచ్ లపై మన బౌన్స్ ప్రభావమెలా ఉండబోతోందనేది చర్చనీయాంశం.  జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, భువనేశ్వర్ కుమార్ త్రయం టీమిండియా బౌలింగ్ … Read more

  ‘షమీ ఇంట్లో కూర్చొవడం నన్ను కలవరపెట్టింది’

  శ్రీలంకపై భారత్ ఓటమిని విశ్లేషిస్తూ భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా జట్టులో మంచి పేసర్ ఒక్కరు కూడా లేరని అన్నారు. గాయం కారణంగా బుమ్రా ఆసియా కప్‌లో పాల్గొనకపోగా, మహ్మద్ షమీని ఎంపిక చేయలేదన్నారు. షమీ లాంటి వ్యక్తి ఇంట్లో కూర్చోవడం తనను కలవరపెట్టిందని పేర్కొన్నారు. ఎంపిక మరింత మెరుగ్గా ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భువనేశ్వర్ 19వ ఓవర్‌లో 19 పరుగులు, శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 19వ ఓవర్‌లో … Read more

  వ‌న్డేల‌ను 40 ఓవ‌ర్ల‌కు త‌గ్గించాలి: ర‌విశాస్త్రి

  వ‌న్‌డే మ్యాచ్‌ల‌ను 50 నుంచి 40 ఓవ‌ర్ల‌కు కుదించాల‌ని టీమిండియా మాజీ కోచ్ ర‌విశాస్త్రి అభిప్రాయ‌ప‌డ్డాడు. 1983లో మేము ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన‌ప్పుడు వ‌న్డే క్రికెట్‌లో 60 ఓవ‌ర్లు ఉండేవి. ఆ త‌ర్వాత వాటిని 50కి త‌గ్గించారు. ఇప్పుడు మారుతున్న ప‌రిస్థితుల‌కు అనుగుణంగా ఓవ‌ర్ల‌ను త‌గ్గించ‌క‌పోతే మ‌నుగ‌డ క‌ష్ట‌మ‌ని ర‌విశాస్త్రి చెప్పారు. టీ20 ఫార్మాట్‌కు ఆద‌ర‌ణ పెరుగుతుంది. అందుకే 50 ఓవ‌ర్ల మ్యాచ్ ఆడాల‌ని ఎవ‌రు అనుకోవ‌డం లేదు. అందుకే ఓవ‌ర్ల‌ను క్ర‌మంగా త‌గ్గించాల‌ని ప‌లువురు మాజీలు చెప్తున్నారు. ఇంగ్లాండ్ ప్లేయ‌ర్ బెన్‌స్టోక్ వ‌న్డేల‌కు వీడ్కోలు … Read more

  ‘ప్రపంచకప్ టీ20 వరకు హార్దిక్ పాండ్యా వన్డేలు ఆడొద్దు’

  ఈ ఏడాది చివర్లో జరిగే టీ20 ప్రపంచకప్ వరకు హార్దిక్ పాండ్యాను వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడించకూడదని ఇండియన్ మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయం వ్యక్తం చేశాడు. అతను ప్రపంచ కప్‌లో పోటీపడే కీలక ఆటగాడని పేర్కొన్నాడు. అతడిని వన్డే క్రికెట్ ఆడమని బలవంతం చేసి రిస్క్ చేయకూడదన్నారు. ఇక IPL 2022లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన హార్దిక్, దక్షిణాఫ్రికాతో జరగబోయే T20I సిరీస్‌లో భారత జట్టులోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ మీడియా సమావేశంలో భాగంగా రవిశాస్త్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

  ‘అతడే చెన్నై తదుపరి కెప్టెన్ అవుతాడు’

  IPLలో వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్‌ఫుల్ జట్టుగా పేరు తెచ్చుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ధోనీ తర్వాత కెప్టెన్ ఎవరుతారనే చర్చ ఇప్పటికే అభిమానుల్లో మొదలయింది. దీనిపై మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. ఆర్సీబీ లాగానే చెన్నై కూడా ఒక ఆటగాడిని కొనుగోలు చేసి అతడికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే చాన్స్ ఉందని అతడు అభిప్రాయం వ్యక్తం చేశాడు. జడేజాను కెప్టెన్ గా చేసేసరికి నీటిలోంచి భూమిమీద పడ్డ చేపలా అతడి పరిస్థితి తయారయిందని పేర్కొన్నాడు. ఇప్పటి వరకు జడేజాకు … Read more