• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • బాలీవుడ్ స్టార్లపై కరణ్ జోహార్ ఆగ్రహం

  భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసే స్టార్లపై బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాని హిట్ చేయడంలో విఫలమయ్యే నటీనటులు.. పారితోషికం విషయంలో మాత్రం పక్కాగా వ్యవహరిస్తారని కరణ్ వ్యాఖ్యానించారు. ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ సినిమాతో నాకు జరిగిన అనుభవం ఇది. అలియా భట్, వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రాలను పరిచయం చేశా. హిట్టయ్యింది. కానీ, డబ్బులు రాలేదు. బిజినెస్‌మ్యాన్‌గా ఆలోచిస్తే తెలుగు సినిమాల్లోనే లాభం ఉంటుంది. కానీ, నాకు సినిమా అనేది ఒక ఎమోషన్’ అంటూ కామెంట్లు చేశారు. … Read more

  పారితోషికం డిమాండ్ చేయాలి: మృణాల్

  సీతారామంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ మృణాల్ ఠాకూర్. పారితోషికంపై ఈ హాట్ బ్యూటీ కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఇండస్ట్రీలో రెమ్యునరేషన్‌పై ఒక సంప్రదాయం ఉంది. హిట్లు, ఫ్యాన్ ఫాలోయింగ్, గ్లామర్‌ని బట్టి రెమ్యునరేషన్‌ని ఫిక్స్ చేస్తారు. కానీ, మాకింత కావాలి అని ఏ హీరోయినూ డిమాండ్ చేయదు. వాళ్లు అడిగినంత ఇస్తారా అని సందేహపడుతుంటారు. నేనైతే కచ్చితంగా డిమాండ్ చేస్తా. నాకింత కావాలి అని ముందే చెప్తా. ఇవ్వడం, ఇవ్వకపోవడం అనేది పక్కనపెడితే హీరోయిన్లు పారితోషికంపై మొహమాటం ప్రదర్శించకూడదు’ అని ఓ ఇంటర్వ్యూలో … Read more

  రెమ్యునరేషన్ తగ్గించిన లైగర్ బ్యూటీ

  లైగర్ సినిమా విజయంపై భారీ అంచనాలు పెట్టుకుంది నటి అనన్య పాండే. కానీ, ఈ సినిమా ప్రేక్షకులను నిరుత్సాహ పరచడంతో అంచనాలు తలకిందులయ్యాయి. పైగా ఈ మూవీలో అనన్య పాండే నటనపై చాలా ట్రోలింగ్స్ వచ్చాయి. ఫలితంగా సినిమా అవకాశాలు కరువయ్యాయి. దీంతో ఈ భామ తన రెమ్యునరేషన్‌ని తగ్గించుకుందట. ఇంతకుముందు సినిమాకు రూ.80లక్షల వరకు తీసుకునే ఈ నటి.. ఇప్పుడు రూ.50లక్షలకే పరిమితమైందని ఇండస్ట్రీ టాక్. మరి, ఇకనైనా ఈ బాలీవుడ్ బ్యూటీకి సినిమా అవకాశాలు వస్తాయేమో వేచి చూడాలి.

  ప్రభాస్‌ కన్నా విజయ్‌కే ఎక్కువ?

  దళపతి విజయ్ హీరోగా సంక్రాంతికి వస్తున్న చిత్రం ‘వరిసు’. అయితే ఈ చిత్రానికి విజయ్ రూ.130 కోట్ల రెమ్యునరేషన్‌ని తీసుకున్నట్లుగా నెట్టింట ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ప్రభాస్ తీసుకుంటున్న పారితోషికం(రూ.120కోట్లని అంచనా) కన్నా ఇది ఎక్కువగా ఉండటంతో అవాక్కవుతున్నారు. అయితే, ఇది గాలి వార్తే నంటూ మరికొందరు కొట్టి పడేస్తున్నారు. విజయ్ కేవలం రూ.30కోట్లు మాత్రమే తీసుకుంటున్నారని చెబుతున్నారు. ఈ రెండింట్లో ఏది నిజమో అనే అంశంపై ఎవరికీ స్పష్టత లేదు. దీనిపై, నిర్మాత దిల్ రాజు లేదా హీరో విజయ్ స్పందిస్తేనే ఓ … Read more

  ఇన్‌స్టాలో కోట్లు సంపాదిస్తున్న కత్రినా

  కత్రినా కైఫ్ విక్కీ కౌశల్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. కత్రినా ఇన్‌స్టాలో ఒక్క ప్రమోషన్ పోస్టుకు దాదాపు రూ.97 లక్షల వరకు వసూలు చేస్తుంది. కత్రినా కేవలం బ్లాండ్లను ప్రమోట్ చేస్తూ.. ఈజీగా కోట్లు సంపాదిస్తోంది. ప్రస్తుతం లాక్మీ, స్లైస్, నక్షత్ర, పానాసోనిక్, వంటి ప్రముఖ బ్లాండ్లను ప్రమోట్ చేస్తుంది. మరోవైపు దేశవ్యాప్తంగా హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలోనూ కత్రినా టాప్‌లో ఉంది. ఒక్క సినిమాకు రూ.12 కోట్లు వసూలు చేస్తోంది. ఐశ్వర్యరాయ్ రూ.10కోట్లతో తర్వాత ప్లేస్‌లో … Read more

  రెమ్యూనరేషన్ పెంచేసిన కమల్ ?

  యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తన రెమ్యూనరేషన్‌ను భారీగా పెంచేశారట. ఇటీవల ఆయన నటించి విక్రమ్ మూవీ భారీ విజయం సాధించడంతో అదే క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలని అనుకుంటున్నారట. అందులో భాగంగానే ఇండియన్-2 మూవీకి ఏకంగా రూ.150 కోట్ల పారితోషికం అందుకోనున్నారట. కాగా పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కుతున్న ఇండియన్-2పై భారీ అంచనాలు ఉన్నాయి.

  ‘లైగ‌ర్’ కోసం టైస‌న్‌కు అంత రెమ్యున‌రేష‌న్ ఇచ్చారా?

  ప్ర‌పంచ నంబ‌ర్ వ‌న్ బాక్సింగ్ చాంపియ‌న్ మైక్ టైస‌న్‌ను మూవీలో న‌టించేందుకు ఒప్పించ‌డం చాలా క‌ష్టం. కానీ లైగ‌ర్ చిత్ర‌బృందం చాలా క‌ష్ట‌ప‌డి ఈ ప‌ని చేసింది. అయితే ఫ‌లితం మాత్రం శూన్యం. మైక్ టైస‌న్ సినిమాకు ఏమాత్రం ప్ల‌స్ కాలేదు. ఎందుకంటే అత‌డికి ఇచ్చిన పాత్ర అటువంటిది. కానీ ఈ సినిమా కోసం టైస‌న్‌కు రూ.23 కోట్లు చెల్లించార‌ట‌. ఆ డ‌బ్బు మొత్తం వృథా అని ఇప్పుడు ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. దీంతో పాటు డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు, ఎగ్జిబిట‌ర్ల‌కు న‌ష్టాన్ని పూడ్చే ప‌నిలో ఉన్నార‌ట … Read more

  ‘లాల్ సింగ్ చ‌డ్డా’ న‌ష్టాన్ని భ‌రించ‌నున్న అమీర్‌ఖాన్

  అమీర్‌ఖాన్ న‌టించిన లాల్‌సింగ్ చ‌డ్డా మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తాప‌డింది. ఈ సినిమాకు ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం రూ.70 కోట్లు మాత్ర‌మే వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. లాల్‌సింగ్ చ‌డ్డాకు అమీర్‌తో పాటు ఆయ‌న మాజీ భార్య కిర‌ణ్‌రావ్ స‌హ‌నిర్మాత‌లుగా వ్య‌వ‌హరించారు. అయితే నిర్మాత‌గానూ న‌ష్ట‌పోయిన అమీర్ ఇప్పుడు మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాడు. దీనికోసం ఒప్ప‌కున్న రూ.50 కోట్లు రెమ్యున‌రేష‌న్ వ‌దిలేసుకున్నాడ‌ట‌. దీంతో నిర్మాత‌ల‌పై కాస్త భారం త‌గ్గుతుంద‌ని ఆశిస్తున్నాడు. ఎంతో న‌మ్మ‌కంతో తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద భారీగా విఫ‌లం కావ‌డంతో అమీర్‌ఖాన్‌తో పాటు … Read more

  రెమ్యున‌రేష‌న్ త‌గ్గించిన అక్ష‌య్ కుమార్

  గ‌త కొన్నిరోజులుగా బాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొడుతున్నాయి. త‌న వ‌రుస సినిమాలు ఫ్లాప్ కావ‌డంతో అక్ష‌య్‌కుమార్ రెమ్యున‌రేష‌న్ త‌గ్గించుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. ప్ర‌స్తుతం ఒక సినిమా కోసం రూ.80 కోట్లు తీసుకుంటుండ‌గా ఇక‌పై రూ.10 కోట్లు తీసుకోనున్నాడు. అయితే సినిమా స‌క్సెస్ అయితే మాత్రం ప్రాఫిట్‌లో 50 శాతం షేర్ కావాల‌ని ష‌ర‌తు విధించ‌నున్నాడ‌ట‌. గ‌త కొన్నేళ్లుగా అమీర్‌ఖాన్ ఇదే పంథాలో కొన‌సాగుతున్నాడు. ఇప్పుడు అక్ష‌య్ కూడా ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డంతో నిర్మాత‌ల‌కు కొంత భారం త‌గ్గుతుంద‌ని ఆశిస్తున్నారు.

  బిగ్‌బాస్ 6..భారీగా పెరిగిన నాగార్జున పారితోషికం

  బిగ్‌బాస్ సీజ‌న్ 6 సెప్టెంబ‌ర్ 4 నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. ఇప్ప‌టికే దీనికి సంబంధించిన ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌న్నీ ప్రారంభ‌మ‌య్యాయి. కంటెస్టెంట్స్ ఎంపిక పూర్తయింది. ఆగ‌స్ట్ 26 నుంచి వారిని క్వారెంటైన్ చేయ‌నున్నారు. అయితే ఈ సీజ‌న్‌లో నాగార్జున రెమ్యున‌రేష‌న్ గురించి వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఈసారి ఆయ‌న రెమ్యున‌రేష‌న్ భారీగా పెంచిన‌ట్లు తెలుస్తుంది. గ‌త సీజ‌న్‌లో ఎపిసోడ్‌కు రూ.15 ల‌క్ష‌లు అంటే మొత్తం రూ.12 కోట్లు తీసుకున్నాడు. ఆరో సీజ‌న్ కోసం రూ.15 కోట్లు తీసుకుంటున్న‌ట్లు తెలుస్తుంది. మ‌రోవైపు హిందీ బిగ్‌బాస్ కోసం స‌ల్మాన్ ఏకంగా … Read more