• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • టీ20లకు రోహిత్ పూర్తిగా దూరం?

    గత ఏడాది నుంచి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20లకు దూరంగా ఉంటున్నాడు. అప్పట్నుంచి హార్దిక్‌ పాండ్య సారథ్యంలోనే జట్టు ఆడుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది T20 ప్రపంచకప్‌ ఉంది. ఈ క్రమంలో రోహిత్‌ ఈ దశలో తిరిగి టీ20 జట్టులోకి రావాలని, కుర్రాళ్ల అవకాశాలకు అడ్డంకిగా మారాలని అనుకోవట్లేదని బీసీసీఐ వర్గాల సమాచారం. చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌తో రోహిత్ చర్చించిన అనంతరం తాను టీ20లకు దూరంగా ఉండాలని రోహిత్‌ నిర్ణయించుకున్నాడని సమాచారం.

    ‘వీళ్లకంటే రోహిత్‌ ప్రత్యేకం’

    టీమిండియా సారథి రోహిత్‌ శర్మపై మాజీ క్రికెటర్లు సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. పాక్‌ దిగ్గజాలు వసీమ్‌ అక్రమ్‌, షోయబ్‌ మాలిక్‌ కూడా హిట్‌మ్యాన్‌ను పొగడ్తల్లో ముంచెత్తారు. ‘ప్రపంచ క్రికెట్‌లో ఎంతో మంది గొప్ప ఆటగాళ్లు ఉన్నారు. రోహిత్‌ శర్మ వారందరికంటే ప్రత్యేకం. ఏ బౌలర్నీ అతడు వదిలిపెట్టలేదు. ప్రత్యర్థి ఎవరైనా కానీ.. ఎలాంటి బౌలింగ్‌ దాడైనా కానీ.. వారిని దీటుగా ఎదుర్కొంటూ చాలా తేలికగా పరుగులు రాబడతాడు’. అని పాక్ క్రికెటర్లు కొనియాడారు.

    రోహిత్‌ వద్దన్నా కెప్టెన్సీ అప్పగించాం: గంగూలీ

    మాజీ బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. భారత జట్టు పగ్గాలు చేపట్టేందుకు రోహిత్‌శర్మ విముఖత ప్రదర్శించాడని తెలిపారు, ఎలాగైనా కెప్టెన్‌గా ఉండాల్సిందేనని అతడిని ఒప్పించామని చెప్పుకొచ్చారు. మూడు ఫార్మాట్లలో తీరికలేక భారత జట్టు నాయకత్వ పగ్గాలు చేపట్టేందుకు రోహిత్‌ మొదట ఒప్పుకోలేదన్నారు. కానీ కోహ్లి తర్వాత అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీకి రోహిత్‌ సరైనోడని భావించానని తెలిపారు. అందుకే అతడిని బలవంతంగా ఒప్పించానని గంగూలీ చెప్పుకొచ్చారు.

    గుడ్‌న్యూస్‌: విశాఖ వన్డేకు రోహిత్‌ వచ్చేస్తున్నాడు!

    బామ్మర్ది పెళ్లి వ‌ల్ల తొలి వ‌న్డేకు దూర‌మైన రోహిత్ శర్మ‌ రెండో వ‌న్డేలో మ‌ళ్లీ కెప్టెన్సీ బాధ్య‌త‌ల్ని చేప‌ట్ట‌నున్నాడు. తొలి వ‌న్డేకు రోహిత్ దూరం కావ‌డం వ‌ల్ల‌ ఆ బాధ్య‌త‌ల్ని హార్ధిక్ పాండ్యా అద్భుతంగా నిర్వహించాడు. రోహిత్ రాకతో అతని స్థానంలో ఆడిన ఇషాన్ కిష‌న్‌ తిరిగి బెంచ్‌కే పరిమతమయ్యే అవకాశముంది. అయితే రోహిత్ రాక‌తో టాప్ ఆర్డ‌ర్ బ‌లోపేతం కానున్న‌ది. రెండో వ‌న్డేలో నెగ్గి సిరీస్‌ను సొంతం చేసుకోవాల‌ని భార‌త్ ఉవ్విళ్లూరుతోంది. కాగా రెండో వన్డే విశాఖలో జరగనుంది.