• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రోహిత్ శర్మ అరుదైన ఘనత

    టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 87(107) పరుగులు చేసిన రోహిత్ శర్మ.. 18వేల పరుగుల మార్కును క్రాస్ చేశాడు. ఈ ఘనత సాధించిన ఐదో టీమిండియా క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. రోహిత్ కంటే ముందు సచిన్(34,357), కోహ్లీ(26,421), ద్రవిడ్(24,208), గంగూలీ(18,575) ఈ ఘనత సాధించారు. మరోవైపు ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు అదరగొడుతున్నారు. 40 పరుగులకు 4 వికెట్లు తీశారు.

    సచిన్ రికార్డును బ్రేక్ చేసిన రోహిత్

    ఆఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్ హిట్‌ మ్యాన్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 63 బంతుల్లోనే రోహిత్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మొత్తం 84 బంతులు రోహిత్‌.. 16 ఫోర్లు, 5 సిక్స్‌లతో 131 పరుగులు చేశాడు. ఈ క్రమంలో వన్డే ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ ఘటత రో​హిత్‌ శర్మకు దక్కింది. రోహిత్‌ ఇప్పటివరకు వన్డే ప్రపంచకప్‌లో 7 సెంచరీలు చేశాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ (6) రికార్డును రోహిత్ బ్రేక్‌ చేశాడు.

    రేపటి నుంచే వరల్డ్ కప్ సమరం

    క్రికెట్ అభిమానులు ఎంతో అత్రుతగా ఎదురుచూస్తున్న ప్రపంచ కప్ క్రికెట్ సమరం రేపటి నుంచి ప్రారంభం కానుంది. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్, రన్నర్ న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈనెల 5 నుంచి నవంబర్ 19 వరకు టోర్నీ జరగనుంది. మొత్తం పది జట్లు రౌండ్ రాబిన్ విధానంలో ఆడుతాయి. అంటే ఒక్కో జట్టు మిగతా 9 జట్లతో తలపడతాయి. లీగ్ దశ తర్వాత మొదటి 4 స్థానాల్లో నిలిచిన టీమ్స్ సెమీస్‌కు అర్హత సాధిస్తాయి.