• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తెలుగమ్మాయిలా ఆదరించారు: మృణాల్

    తనను తెలుగింటి ఆడపడుచులా ఆదరించారని బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అన్నారు. ‘సీతారామం’ విడుదలై ఏడాది పూర్తికావడంతో మృణాల్ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘‘నా తొలి సినిమా సీతారామంను ఆదరించినందుకు ధన్యవాదాలు.నన్ను తెలుగమ్మాయిలా అంగీకరించారు. భవిష్యత్‌లో మిమ్మల్ని అలరించే పాత్రలు పోషిస్తా. అందుకు మీరు సిద్ధంగా ఉండండి. డైరెక్టర్ హను రాఘవపూడి, హీరో దుల్కర్ సల్మాన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు.’’ అంటూ రాసుకొచ్చింది.

    ’సీతారామం‘ నుంచి డిలీటెడ్ సీన్

    క్లాసికల్ హిట్ మూవీ ‘సీతారామం’ నుంచి డిలీటెడ్ సీన్‌ను యూట్యూబ్‌లో విడుదల చేసింది చిత్ర బృందం. పాకిస్తాన్ జైలులో రామ్-విష్ణుశర్మ మధ్య జరిగే సన్నివేశాన్నిరిలీజ్ చేశారు. ఇద్దరి మధ్య జరిగే ఎమోషనల్ డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ సీన్ సినిమాలో ఉంచి ఉంటే ఇంకా బాగుండేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా సీతారామం మూవీ ఇటీవల విడుదలై సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

    50 రోజులు పూర్తి చేసుకున్న ‘సీతారామం’

    దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి తెరకెక్కించిన చిత్రం ‘సీతారామం’. ఆగష్టు 5వ తేదీన విడుదలైన నేటితో 50 రోజులు పూర్తి చేసుకుంది. దీంతో చిత్ర బృందం ‘మా సీతారామం.. మీ సీతారామం.. మన సీతారామం’ అంటూ ఓ పోస్టర్ విడుదల చేసింది బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని నమోదు చేసుకున్న ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది.

    అలా చేస్తే ‘సీతారామం’ మరోలా ఉండేది

    సీతారామం సినిమా తెలుగు, హిందీ భాషల్లో మంచి విజయాన్ని సాధించింది. క్లాస్ ప్రేక్షకులను మురిపించింది. ఈ సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ వ్యాఖ్యానం చేశారు. పరుచూరి పాఠాల ద్వారా ఆయన ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. అన్ని అంశాల్లో సినిమా చాలా బాగుందన్నారు. అయితే, విషాదంతంతో కాకుండా సగటు ప్రేక్షకుడు ఆశించే సుఖాంతంతో ముగిస్తే మరోలా ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. మరి దీనిపై మీరేమంటారు? కామెంట్ చేయండి. వీడియో కోసం Watch On క్లిక్ చేయండి.

    10 మిలియ‌న్ వ్యూస్‌ క్రాస్ చేసిన ‘సీతా రామం’ ట్రైల‌ర్‌

    దుల్క‌ర్ స‌ల్మాన్, మృణాల్ ఠాకూర జంట‌గా న‌టించి సీతా రామం ట్రైల‌ర్‌కు మంచి స్పంద‌న ల‌భిస్తుంది. 10 మిలియ‌న్‌కి పైగా వ్యూస్‌తో యూట్యూబ్ ట్రెండింగ్‌లో దూసుకుపోతుంది. స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌క‌థ‌గా వ‌స్తున్న ఈ సినిమాపై ప్రేక్ష‌కుల‌కు భారీ అంచ‌నాలు ఏర్పడ్డాయి. సెన్సార్ బోర్డు నుంచి కూడా మూవీకి U స‌ర్టిఫికెట్ రావ‌డం విశేషం. ర‌ష్మిక‌, త‌రుణ్ భాస్క‌ర్, సుమంత్ ఇందులో కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. హ‌ను రాఘ‌వ‌పుడి ద‌ర్శ‌క‌త్వం వహించాడు. సీతా రామం ఆగ‌స్ట్ 5న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

    ఆకట్టుకుంటున్న ‘కానున్న కళ్యాణం’ లిరికల్ సాంగ్

    దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న మూవీ ‘సీతారామం’. నేషనల్ క్రష్ రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలన్నీ మంచి హిట్ సాధించాయి. తాజాగా ఈ మూవీ నుంచి మరో సాంగ్ విడుదల చేశారు మేకర్స్. ‘కానున్న కళ్యాణం’ అనే లిరికల్‌ వీడియోను చిత్ర యూనిట్ సోమవారం విడుదల చేసింది. ప్రోమోతో మంచి మార్కులు కొట్టేసిన ఈ సాంగ్.. ఇప్పుడు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుంది.