• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘శాకుంతలం’ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్

    [వీడియో: ](url)స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్ర పోషించిన ‘శాకుంతలం’ మూవీ ఈ నెల 14న 3Dలో రిలీజ్ కానుంది. కానీ రిలీజ్ డేట్ కన్నా ముందే హైదరాబాద్‌లో స్పెషల్ షోలు వేశారు. ఈ సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీలో గ్రాఫిక్స్ కూడా ఫరవాలేదని చెబుతున్నారు. సమంత నటన హైలెట్‌గా నిలిచిందని తెలిపారు. అల్లు అర్హ పాత్ర ఆకట్టుకుందని చెబుతున్నారు. సినిమాలో కొద్ది సేపే కనిపించినా అలవోకగా డైలాగ్స్ చెప్పిందనే మాట వినిపిస్తోంది. . @Samanthaprabhu2 's … Read more

    ‘శాకుంతలం’ ఫస్ట్ సింగిల్ రిలీజ్

    సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘శాకుంతలం’ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. మల్లికా.. మల్లికా అంటూ సాగే ప్రేమగీతం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ పాటలో సమంత అందాలు ఆరబోసింది. సమంత నడుము సొగసు చూపిస్తూ అందాల దేవతలా కనిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ విశేషంగా అలరిస్తోంది. సమంతకు జోడీగా దేవ్ మోహన్ నటించారు. ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

    మీ ప్రేమ చూడటానికే బయటకు వచ్చా; సమంత

    తనపై చూపించే అభిమానుల ప్రేమ కోసం తాను బయటకు వచ్చానని స్టార్ హీరోయిన్ సమంత అన్నారు. ‘శాకుంతలం’ సినిమాతో ఈ ప్రేమ మరింత పెరుగుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది. ‘శాకుంతలం’ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో సామ్ మాట్లాడుతూ..‘‘గుణశేఖర్‌కు సినిమానే జీవితం. ఈ సినిమా మేం ఊహించినదానికంటే బాగా వచ్చింది. మా మీద నమ్మకంతో ఈ సినిమాకు దిల్ రాజు అండగా నిలబడ్డారు. మోహన్ దేవ్ దుష్యంతుడి పాత్రకు పర్ఫెక్ట్.’’ అంటూ పేర్కొంది.