• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • చెన్నై చేరుకున్న విజయ్ ఆంటోనీ

  తమిళ్ హీరో విజయ్ ఆంటోనీ ‘పిచ్ఛైకారన్ 2’ షూటింగ్‌లో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మలేషియాలోని ఓ దీవిలో జరుగుతోంది. ఈ క్రమంలో ఆయన ప్రయాణిస్తున్న బోట్ కెమెరాలు ఉన్న పడవను ఢీకొట్టడంతో ఆయనకు గాయాలయ్యాయి. దీంతో విజయ్ కోమాలోకి వెళ్లాడు అంటూ పుకార్లు పుట్టాయి. దీనిపై విజయ్ సన్నిహితులు స్పందించారు. అతడి నడుముకు గాయాలయ్యాయని.. కోలుకుంటున్నాడని తెలిపారు. ప్రస్తుతం విజయ్ చెన్నై వచ్చేశాడు.

  కాల్పుల్లో 17ఏళ్ల బాలింత మృతి

  కాలిఫోర్నియాలో ఓ కుటుంబంపై దుండగులు కాల్పులకు ఎగబడ్డారు. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు. మృతుల్లో ఆరు నెలల పసికందు, 17ఏళ్ల బాలింత ఉండటం విస్మయానికి గురిచేస్తోంది. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 3.30గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. ఇది అనుకోకుండా జరిగిన ఘటన కాదని, పక్కా ప్రణాళిక ప్రకారమే కాల్పులు జరిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇద్దరు నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. కాలిఫోర్నియాలోని గోషెన్‌లో ఈ ఘటన జరిగింది.

  చిరంజీవిపై వశీకరణ ప్రయోగం!

  తనపై జరిగిన విష ప్రయోగంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ‘వాల్తేరు వీరయ్య’ ప్రమోషన్లలో భాగంగా చిరు మీడియాతో ముచ్చటించారు. ‘‘మరణ మృదంగం సినిమా షూటింగ్‌లో ఉండగా కొంత మంది అభిమా నులు తెచ్చిన కేక్ కట్ చేశా. అప్పుడు ఓ అభిమాని కేక్‌ను బలవంతంగా నా నోట్లో పెట్టాడు. చేదుగా అనిపించి పరీక్షిస్తే అందులో ఏదో ఫౌడర్ ఉంది. అతడిని చితక్కొట్టి అడగగా వశీకరణ మందు కలిపినట్లు అంగీకరించాడు. అతడిని పట్టించుకుంటానని అలా చేసి ఉండొచ్చు.’’ అంటూ చెప్పారు

  అప్పుడే చనిపోతాననుకున్నా; హృతిక్ రోషన్

  ‘వార్’ సినిమా షూటింగ్ సమయంలో తాను చనిపోతానని అనుకున్నానని బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘‘ ‘వార్’ మూవీ కోసం బాడీ పర్ఫెక్షన్ కోసం తీవ్రంగా కష్టపడ్డా. సినిమా షూటింగ్ పూర్తయ్యేసరికి తీవ్రంగా అలసిపోయా. డిప్రెషన్ అంచులను తాకి వచ్చా. ఖచ్చితంగా చనిపోతానని అనుకున్నా.’’ అంటూ గుర్తు చేసుకున్నారు. కాగా ‘వార్’ సినిమా 2019లో విడుదలైంది. ఈ మూవీలో హృతిక్‌తో పాటు టైగర్ ష్రాఫ్, వాణీకపూర్‌లు నటించారు.

  సమంత ఈజ్ బ్యాక్; త్వరలో షూటింగ్ సెట్లోకి!

  స్టార్ హీరోయిన్ సమంత ఫుల్ జోష్‌తో కెమెరా ముందుకు రానుందని సమాచారం. ఆమె సంతకం చేసిన అన్ని సినిమాల షూటింగ్‌ను త్వరలో కంప్లీట్ చేయనున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండతో కలసి నటిస్తున్న ‘ఖుషి’ షూటింగ్ మిగతా బ్యాలెన్స్ కూడా పూర్తి చేయాలని సామ్ భావిస్తోందని టాక్. కాగా సమంత ‘మయోసైటిస్’ అనే వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. దీంతో కొన్ని నెలలుగా ఆమె సినిమాల షూటింగ్‌లకు బ్రేకులు పడ్డాయి. ప్రస్తుతం మయోసైటిస్ నుంచి సామ్ పూర్తిగా కోలుకుంది.

  షూటింగ్‌లో విషాదం; స్టంట్ చేస్తూ ఫైట్ మాస్టర్ మృతి

  కోలీవుడ్‌లో విషాదం నెలకొంది. యాక్షన్ సీన్స్ తీస్తూ ఫైట్ మాస్టర్ సురేష్ మృతి చెందాడు. హీరో సూరి, డైరెక్టర్ వెట్రిమారన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘విడుదలై’ సినిమా చెన్నైలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీలో తమిళ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతి గెస్ట్ రోల్ చేస్తున్నాడు. షూటింగ్‌లో భాగంగా భారీ క్రేన్‌కు తాళ్లు బిగించి ఫైట్ సీన్స్ తీస్తున్నారు. సురేష్‌కు కట్టిన తాడు తెగిపోవడంతో 20 అడుగుల పైనుంచి కిందపడిపోయాడు. తీవ్రగాయాల పాలై ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు.

  వాల్‌మార్ట్‌లో కాల్పులు; 14 మంది మృతి

  అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. వర్జీనియాలోని వాల్‌మార్ట్ స్టోర్‌లో జరిగిన ఈ కాల్పుల్లో దాదాపు 14 మంది మృతి చెందినట్లు సమాచారం. స్టోర్ మేనేజరే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. వాల్‌మార్ట్ స్టోర్ మేనేజర్ బ్రేక్ రూంలోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. దాదాపు అర్ధగంట సేపు కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలుపుతున్నారు. అనంతరం తనను తాను కాల్చుకుని మేనేజర్ కూడా చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

  మెగా 154 కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం

  బాబీ ద‌ర్శ‌క‌త్వంలో మెగాస్టార్ న‌టిస్తున్న 154 మూవీ చిత్రీక‌ర‌ణ‌ నేడు తిరిగి ప్రారంభ‌మైంది. హైద‌రాబాద్‌లో జ‌రుగుతున్న ఈ షూటింగ్‌లో చిరంజీవితో పాటు ర‌వితేజ‌, శృతిహాస‌న్ ఇత‌రులు పాల్గొన్నారు. మ‌రోవైపు మెగాస్టార్ గాడ్‌ఫాద‌ర్ సినిమా అక్టోబ‌ర్ 5న రిలీజ్ కానుంది. ఇక భోళా శంక‌ర్ వ‌చ్చే ఏడాది సంక్రాంతి స‌మ‌యానికి రిలీజ్ చేస్తామ‌ని ఇటీవ‌ల ప్ర‌క‌టించారు. మెగా 154 కూడా 2023 స‌మ్మ‌ర్‌లో విడుద‌ల చేసేందుకు సిద్ద‌మవుతున్నారు.

  ప్ర‌భాస్‌-మారుతి మూవీ షూటింగ్ నేడు ప్రారంభం

  ప్ర‌భాస్ మారుతితో చేస్తున్న సినిమా నేడు పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. ప్ర‌భాస్ ఓవైపు స‌లార్‌, ప్రాజెక్ట్ కే సినిమాలు చేస్తూనే ఈ సినిమాలో న‌టించ‌నున్నాడు. వాటి నుంచి ఖాళీ దొరికిన గ్యాప్‌లో మారుతి ఈ సినిమాను తెర‌కెక్కించనున్నాడ‌ట‌. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ దీన్ని నిర్మించ‌నుంది. అయితే ప్ర‌భాస్‌తో మారుతి సినిమా చేయ‌డం ఫ్యాన్స్‌కు అస‌లు ఇష్టం లేదు. అందుకే నిన్నటినుంచి సోష‌ల్‌మీడియాలో టాలీవుడ్ నుంచి మారుతిని బాయ‌కాట్ చేయాలంటూ ట్రెండ్ చేస్తున్నారు. ఓవైపు పాన్ ఇండియా సినిమాలు చూస్తూ మ‌ధ్య‌లో ఈ చిన్న మూవీ … Read more

  ‘చంద్ర‌ముఖి 2’ మొద‌టి షెడ్యూల్ షూటింగ్ పూర్తి

  ప్ర‌మ‌ఖ డ్యాన్స్ కొరియోగ్ర‌ఫ‌ర్‌, డైరెక్ట‌ర్ రాఘ‌వ లారెన్స్ హీరోగా న‌టిస్తున్న మూవీ ‘చంద్ర‌ముఖి 2’. దీనికి పి.వాసు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. హాస్య‌న‌టుడు వ‌డివేలు, రాదికా శ‌ర‌త్‌కుమార్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. మైసూరులో ఈ మూవీ ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్త‌యింది. ఎం.ఎం కీర‌వాణి ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు. త్వ‌ర‌లో రెండో షెడ్యూల్ షూటింగ్ ప్రారంభించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.