ICC టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా సూర్య కుమార్ యాదవ్
టీ20 క్రికెట్లో తిరుగులేని బ్యాటర్‌గా 2022లో అత్యద్భుత ప్రదర్శన కనబర్చిన సూర్యకుమార్ యాదవ్‌ను ICC టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రకటించింది. 2022లో 31 ఇన్నింగ్స్ ఆడిన సూర్య కుమార్ యాదవ్ 1164 పరుగులు సాధించాడు. అందులో 2 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 360 డిగ్రీల్లో ఆడగల అతడి ప్రతిభకు ఇప్పటికే దిగ్గజాలు సైతం ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.