రెండేళ్లు తగ్గనున్న కొరియన్ల వయసు!
సౌత్ కొరియా ప్రజల వయసు రెండేళ్లు తగ్గనుంది. ఇందుకు అక్కడి ప్రభుత్వం కొత్త చట్టం అమల్లోకి తెచ్చింది. కొరియాలో వయసును మూడు విధాలుగా లెక్కిస్తారు. చట్టపరమైన, అధికారిక విషయాల్లో అంతర్జాతీయ వయసును, మద్య, ధూమపానం, సైనిక శిక్షణ విషయాల్లో క్యాలెండర్ వయసును, రోజువారీ జీవితంలో కొరియన్ వయసును పరిగణనలోకి తీసుకుంటారు. ఈ ప్రక్రియ గందరగోళంగా ఉండడంతో అంతర్జాతీయ వయసును ప్రామాణికంగా తీసుకోనున్నారు. దీంతో కొరియన్ల వయసు రెండేళ్లు తగ్గనుంది.