• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విన్న‌ర్ బిందు మాధ‌వి.. వైర‌ల్ ఫోటోస్‌

  బిందు మాధ‌వి తెలుగు అమ్మాయి అయిన‌ప్ప‌టికీ త‌మిళంలో ఫేమ‌స్ అయింది. తెలుగు సినిమాల్లో అప్పుడ‌ప్పుడు క‌నిపించి అల‌రించేది. కానీ బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో అడుగుపెట్టిన త‌ర్వాత రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌ను త‌న‌వైపు తిప్పుకుంది. బిగ్‌బాస్‌ హౌస్‌లో అంత‌మందితో పోరాడి తెలుగులో ఇన్ని సీజ‌న్స్‌లో బిగ్‌బాస్ విన్న‌ర్‌గా గెలిచిన‌ మొద‌టి అమ్మాయిగా నిలిచింది. ఆమె ధైర్యానికి ఫిధా అయిపోయిన‌వారు ఆడ‌పులి అనే ట్యాగ్ ఇచ్చారు. ఆడపులి బిందు మాధ‌వికి సంబంధించిన కొన్ని వైర‌ల్ ఫోటోల‌పై ఓ లుక్కేద్దాం. Courtesy Instagram: Bindu Madhavi Courtesy Instagram: … Read more

  ముగిసిన బిగ్‌బాస్‌ ఓటింగ్.. విన్న‌ర్ ఎవ‌రో తెలిసిపోయింది

  బిగ్‌బాస్‌లో ఈవారం మొత్తం ఫైన‌లిస్టుల జ‌ర్నీని చూపిస్తున్నారు. ఈరోజు మిత్రా శ‌ర్మ జ‌ర్నీని చూపించ‌నున్నారు. మిత్రా శ‌ర్మ చివ‌రి వారం వ‌ర‌కు వ‌స్తుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. వ‌చ్చిన‌ప్ప‌టినుంచి ఆమెపై ప్రేక్ష‌కుల‌కు నెగెటివ్ ఇంప్రెష‌న్ ఏర్ప‌డింది. కానీ ఇన్ని వారాలుగా సేవ్ అవుతూ ఫైన‌లిస్ట్‌గా నిలిచింది. ఇక ఫైన‌ల్ ఓటింగ్ నిన్న‌టితో ముగిసింది. ఈ ఓటింగ్‌లో కూడా మిత్రా టాప్ 3లో నిలిచిన‌ట్లుగా తెలుస్తుంది. బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విన్న‌ర్‌గా బిందు మాద‌వి, ర‌న్న‌ర్‌గా అఖిల్ ఉన్న‌ట్లు టాక్. నాలుగో ప్లేస్‌లో శివ‌, ఐదో స్థానంలో అరియానా … Read more

  Biggboss OTT: బిగ్‌బాస్ చరిత్ర‌ను తిర‌గ‌రాసే స‌త్తా నీలో ఉంది

  బిగ్‌బాస్‌ చివ‌రివారంలో కంటెస్టెంట్స్‌కు సంబంధించిన బిగ్‌బాస్ జ‌ర్నీని చూపిస్తున్నారు. నిన్న శివ‌, అరియానా ఏవీ చూపించ‌గా ఇద్ద‌రూ ఎమోష‌న‌ల్‌గా ఫీల‌య్యారు. ఈరోజు బాబా మాస్ట‌ర్ జ‌ర్నీ చూపిస్తున్నారు. వైల్డ్‌కార్డ్‌లో వ‌చ్చి వెంట‌నే కెప్టెన్సీ గెలుచుకొని, ఆ త‌ర్వాత ఎవిక్ష‌న్- ఫ్రీ పాస్ గెలుచుకొని చివ‌రి మ‌జిలీకి చేరుకున్నావు. హౌస్‌టోకి ఎంట్రీ ఇచ్చి ఆట తీరును మార్చేశావు. అంద‌ర్నీ న‌వ్విస్తూ ఎంట‌ర్‌టైన‌ర్‌గా మారావు అని బిగ్‌బాస్ బాబా మాస్ట‌ర్‌ను ప్ర‌శంసిస్తున్నాడు. ఇంకా ఈరోజు ఎవ‌రెవ‌రి జ‌ర్నీ చూపిస్తారో ఎపిసోడ్ చూసి తెలుసుకోవాల్సిందే.

  Biggboss OTT: అఖిల్-న‌ట‌రాజ్ మ‌ధ్య భ‌గ్గుమంటున్న గొడ‌వ‌లు

  బిగ్‌బాస్ గేమ్ ఫైన‌ల్స్‌కు ద‌గ్గ‌ర‌ప‌డే కొద్ది పోటీ మ‌రింత పెరుగుతుంది. మొన్న‌టివ‌ర‌కు క్లోజ్‌గా ఉన్న అఖిల్-న‌ట‌రాజ్ మాస్ట‌ర్ మ‌ధ్య విభేదాలు వ‌చ్చాయి. గేమ్‌లో అఖిల్ త‌న‌కు కాకుండా అనీల్‌కు హెల్ప్‌ చేయ‌డంతో న‌ట‌రాజ్‌కు కోపం క‌ట్ట‌లు తెంచుకుంది. గ‌ట్టిగా అరుస్తూ దేవుడా ఇంకెంత ఆడాలి నాకు ఎవ‌రూ సాయం చేయ‌రు అంటూ మొర పెట్టుకున్నాడు. ఇక ఈరోజు ఇచ్చిన టాస్క్‌లోనూ అఖిల్‌తో గొడ‌వ ప‌డుతున్నాడు. న‌ట‌రాజ్‌తో ప‌డ‌లేక‌ అఖిల్ ఆట నుంచి త‌ప్పుకున్నాడు. ఈ గొడ‌వ‌తో నేటి ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్‌గా మార‌బోతుంద‌ని తెలుస్తుంది.

  బిగ్‌బాస్‌ హౌస్‌లోకి విశ్వ‌క్ సేన్‌

  బిగ్‌బాస్ హౌస్‌లో ఈరోజు ‘అశోక‌వ‌నంలో అర్జున క‌ళ్యాణం’ చిత్ర‌బృందం సంద‌డి చేసింది. సినిమా హిట్ కొట్టిన త‌ర్వాతే వ‌చ్చాన‌ని విశ్వ‌క్ సేన్ సంతోషంగా చెప్తున్నాడు. ఇక పెళ్లి గురించి హౌస్‌మేట్స్‌ను కొన్ని స‌ర‌దా ప్ర‌శ్న‌లు అడుగుతున్నారు. రెండు రోజులు జ‌రిగిన నామినేష‌న్స్‌తో గొడ‌వ‌లు, వాద‌న‌ల‌తో అల‌సిపోయిన‌ కంటెస్టెంట్స్‌ ఈ ఎపిసోడ్‌తో కూల్ అయిన‌ట్లుగా క‌నిపిస్తున్నారు.

  Biggboss OTT: బిందు మాధ‌విని సూర్ప‌న‌కతో పోల్చిన‌ న‌ట‌రాజ్ మాస్ట‌ర్‌

  బిగ్‌బాస్‌లో ఈవారం నామినేష‌న్స్ ర‌చ్చ మూమూలుగా లేదు. టాప్ 5 వెళ్లేందుకు ఎవ‌రికి అర్హ‌త లేదో చెప్పాలంటూ నిన్న బిగ్‌బాస్ ఆదేశించాడు. ఇక మొద‌ట బిందుమాద‌వి న‌ట‌రాజ్‌ను నామినేట్ చేయ‌డంతో చాలా సేపు గొడ‌వ జ‌రిగింది. న‌ట‌రాజ్ బిందును ప‌ర్స‌న‌ల్‌గా అటాక్ చేస్తూ మీ తండ్రి నీ విష‌యంలో ఫెయిల్ అయ్యాడంటూ, సూర్ప‌న‌క‌ అంటూ ఆమెపై విరుచుకుప‌డ్డాడు. ఇక ఈరోజు నామినేష‌న్ ప్రాసెస్ తిరిగి కంటిన్యూ అవుతుంది. న‌ట‌రాజ్ బిందును నామినేట్ చేస్తూ సూర్ప‌న‌క నీ టైమ్ స్టార్ట్ అయింది. ప్రేక్ష‌కులు నీ ముక్కు … Read more

  బిగ్‌బాస్ హౌస్‌లోకి ష‌న్ను ఎంట్రీ

  బిగ్‌బాస్ హౌజ్‌లోకి పాత కంటెస్టెంట్స్ వ‌చ్చి గేమ్స్ ఆడించి రోజూ ఒక‌రికి ఎవిక్ష‌న్-ఫ్రీ పాస్ గెలుచుకునే అవ‌కాశం క‌ల్పిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే సిరి, మాన‌స్, ర‌వి హౌస్‌లోకి వ‌చ్చారు. బిందు, అనీల్, బాబా మాస్ట‌ర్ రేసులో నిలిచారు. ఈరోజు హౌస్‌లోకి గ‌త సీజ‌న్ ర‌న్న‌ర‌ప్ షణ్ముఖ్ వ‌స్తున్నాడు. బెస్ట్‌, వ‌ర‌స్ట్ కెప్టెన్ ఎవ‌రో చెప్పాల‌ని కోరాడు. ఆ త‌ర్వాత మీరు పశ్ఛాత్తాప ప‌డ్డ సంఘ‌ట‌న‌లు ఏమైనా ఉన్నాయా అని కంటెస్టెంట్స్‌ను అడిగాడు. ఇలా స‌రదాగా సాగిపోతున్న ఈ గేమ్‌లో నేడు ఎవ‌రు రేసులో … Read more

  Biggboss OTT: బిగ్‌బాస్‌లోకి రీఎంట్రీ ఇస్తున్న మాన‌స్‌

  బిగ్‌బాస్ హౌజ్‌లో ఈ వారం ‘టిక్కెట్ టు ఫినాలే’ రేస్ జ‌రుగుతుంది. ఇందులో భాగంగా గ‌త సీజ‌న్‌లో టాప్ 5 కంటెస్టెంట్స్ వ‌చ్చి గేమ్ ఆడిస్తున్నారు. నిన్న సిరి హౌజ్‌లోకి వ‌చ్చి సంచాల‌క్‌గా ఫోక‌స్ గేమ్ నిర్వ‌హించింది. ఇందులో బాబా మాస్ట‌ర్ టిక్కెట్ టు ఫినాలే రేస్‌లో మొద‌టి కంటెస్టెంట్‌గా నిలిచాడు. ఈరోజు మాన‌స్ బిగ్‌బాస్‌లోకి వ‌స్తున్నాడు. మాన‌స్‌ను మ‌ళ్లీ బిగ్‌బాస్‌లో చూసేందుకు ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో ఈరోజు ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్‌గా ఉండ‌బోతుంది.

  Biggboss OTT: అనీల్ త‌ల్లి అద‌రగొట్టింది

  బిగ్‌బాస్‌లోకి ఈవారం కంటెస్టెంట్స్ కుటుంబ స‌భ్యులు వ‌స్తున్నారు. ఈరోజు అనీల్ వాళ్ల అమ్మ వ‌చ్చి హౌజ్‌మేట్స్‌తో స‌ర‌దాగా గ‌డిపింది. ఉత్సాహంగా డ్యాన్సులు వేస్తూ ఎంట‌ర్‌టైన్ చేసింది. ఇక ఈ వారం న‌ట‌రాజ్ మాస్ట‌ర్ ఓటింగ్‌లో వెన‌క‌బ‌డి ఉన్నాడు. ఈ వారం ఆయ‌న ఎలిమినేట్ కాబోతున్నాడ‌ని టాక్ న‌డుస్తుంది. మ‌రోవైపు డ‌బుల్ ఎలిమినేష‌న్ జ‌ర‌గ‌బోతుందని అంటున్నారు. దీంతో న‌ట‌రాజ్‌తో పాటు అనీల్ కూడా వెళ్లిపోయే అవ‌కాశాలు ఉన్నాయి.

  కుటుంబ స‌భ్యుల ఎంట్రీతో ఎమోష‌న్స్‌తో నిండిపోయిన బిగ్‌బాస్ హౌజ్‌

  బిగ్‌బాస్ హౌజ్‌లో ఫ్యామిలీ వీక్ కొన‌సాగుతుంది. నిన్న అషురెడ్డి, శివ‌, న‌ట‌రాజ్ కుటుంబ స‌భ్యులు హౌజ్‌లోకి వ‌చ్చారు. నేడు అఖిల్ త‌ల్లి, అరియానా ఫ్రెండ్, మిత్రా శ‌ర్మ కుటుంబ స‌భ్యులు హౌజ్‌లోకి వ‌స్తున్నారు. వీకెండ్‌లో కూడా కంటెస్టెంట్స్‌కి స‌పోర్ట్ చేసే ఫ్రెండ్స్‌, ఫ్యామిలీస్‌ని నాగార్జున స్టేజ్‌పైకి తీసుకురానున్న‌ట్లు తెలుస్తుంది. గ‌త సీజ‌న్ కంటెస్టెంట్స్‌, సోహెల్, ష‌ణ్ముఖ్, సిరి లాంటి వాళ్లు కూడా ఈ వీకెండ్‌లో వ‌స్తున్న‌ట్లు స‌మాచారం.