• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బుడ్డోడి పర్ఫార్మెన్స్‌కి బన్నీ ఫిదా

    ‘ఊర్వశివో రాక్షసివో’ విజయోత్సవ వేడుకలకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ హాలులో ఈ వేడుక జరుగుతోంది. అయితే, ఈ వేడుకలో తన పర్ఫార్మెన్స్‌తో ఓ బాలుడు అందరినీ మెస్మరైజ్ చేశాడు. డయాస్‌పై డ్రమ్స్ వాయిస్తూ చెర్రీ స్వరూప్ అలరించాడు. దీంతో ఈ బుడ్డోడి ప్రదర్శనకు అల్లు అర్జున్ ఫిదా అయ్యాడు. చప్పట్లు కొడుతూ బాలుడిని ఎంకరేజ్ చేశాడు. తన ప్రదర్శన ముగిసిన అనంతరం చెర్రీ ‘తగ్గేదెలే’ అంటూ డైలాగ్ చెప్పడంతో ఈ [వీడియో](url) చక్కర్లు కొడుతోంది. … Read more

    రాయల్‌గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

    ‘ఊర్వశివో రాక్షసివో’ విజయోత్సవ వేడుకలు వైభవంగా జరగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సూట్‌లో పుష్ప హీరో రాయల్‌గా కనిపిస్తున్నాడు. నవ్వుతూ ఎలిగెంట్‌గా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగుతో బిజీబిజీగా ఉన్నాడు. ఇక, ఊర్వశివో రాక్షసివో చిత్రం విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌ని సొంతం చేసుకుంది. Courtesy Twitter:ShreyasMedia Courtesy Twitter: Courtesy Twitter: Courtesy Twitter:

    చీఫ్ గెస్ట్‌గా అల్లు అర్జున్

    అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన ‘ఊర్వశివో రాక్షసివో’ చిత్రం విడుదలై మంచి టాక్‌ని సొంతం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం సక్సెస్ మీట్‌ని నిర్వహించనుంది. హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ హాలులో ఈ వేడుకను నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాలో శిరీష్, ఇమ్మాన్యుయేల్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. రొమాంటిక్ సన్నివేశాలు అలరించడంతో యువతను ఆకట్టుటకుంటోంది.

    LIVE: ప్రీ రిలీజ్ ఈవెంట్

    అల్లు శిరీశ్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. నందమూరి బాలకృష్ణ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాకేశ్ శశి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా నవంబరు 4న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు మంచి ఆదరణ పొందుతున్నాయి. కాగా, ఈ సినిమాకు అనూప్ రూబెన్స్, అచ్చు ఇద్దరు సంగీతం అందించారు.

    రిపోర్టర్‌కు హీరోయిన్ ఘాటు రిప్లై

    ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ‘ఊర్వశివో.. రాక్షసివో’ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ ఫైర్ అయింది. సినిమా ప్రమోషన్లలో భాగంగా ‘మీరు బన్నీతో చేశారు. అల్లు శిరీష్‌తో పనిచేశారు. వీరిద్దరిలో ఎవరు క్యూటీ. ఎవరు నాటీ’ అని రిపోర్టర్ ప్రశ్న వేయగా.. ‘మీకు ఇలాంటి ప్రశ్నలు తప్ప వేరేవి ఏం దొరకవా?’ అని నవ్వుతూ ఘాటుగానే బదులిచ్చింది. దానికి రిపోర్టర్ స్పందిస్తూ ‘మీకు నచ్చిన సీన్ ఏంటి?’ అని అడగ్గా.. ‘సినిమా విడుదల కాకముందు అదెలా చెప్తాం’ అని చెప్పింది. అయితే, శిరీష్, అను లవ్‌లో … Read more

    17న ‘మాయారే’ సాంగ్ రిలీజ్

    అల్లు శిరీశ్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఊర్వశివో.. రాక్షసివో’. ఈ మూవీకి సంబంధించిన రెండో పాటని ఈనెల 17న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘మాయారే’ పేరుతో ఉన్న ఈ సాంగ్‌ని రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. శ్యాం లిరిక్స్ అందించగా.. అనూప్ రూబెన్స్ స్వరాలు సమకూర్చారు. ఇప్పటికే విడుదలైన మొదటి పాట ‘దీంతనాన’ సంగీత అభిమానులను ఆకట్టుకుంటోంది. సిద్ శ్రీరాం పాడిన ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. వచ్చే నెల 4న సినిమా విడుదలవుతోంది.

    ‘దీంతనానా’ ప్రోమో విడుదల

    అల్లు శిరీశ్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మొదటి పాట ప్రోమో విడుదలైంది. ‘దీంతనానా’ అంటూ సాగే పాటను సిద్ శ్రీరాం ఆలపించారు. ఈ పాటను అక్టోబరు 10న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. కలర్‌ఫుల్‌గా ఉన్న ఈ ప్రోమో ఆకట్టుకుంటోంది. అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అచు సంగీతం అందిస్తున్నారు.

    పవర్ స్టార్ సెంటిమెంట్ పనికొచ్చేనా..?

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి బయటే కాదు ఇండస్ట్రీలోనూ అభిమానులున్నారు. ఆయన సినిమాల్లోని పాటల లిరిక్స్‌ని సినిమా టైటిల్‌గా పెట్టుకున్నారు. నితిన్ ‘గుండెజారి గల్లంతయ్యిందే’, సాయిధరమ్ తేజ్ ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. ప్రస్తుతం ‘ఊర్వశివో రాక్షసివో’తో అల్లు శిరీష్ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఇలాంటి టైటిల్ ఉంటే.. పవర్ స్టార్ అభిమానులు సినిమాను ఆదరిస్తారని వారి నమ్మకం. మరి ఈ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా? కామెంట్ చేయండి.