ఇంటివాడైన ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఓ ఇంటివాడయ్యాడు. భార్య మేహా పటేల్‌తో కలిసి ఏడడుగులు నడిచాడు. గుజరాత్‌లోని వడోదరలో ఈ దంపతుల వివాహం వైభవంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. టీమిండియా తరఫున ఆల్‌రౌండర్‌గా అక్షర్ పటేల్ ఇటీవల అదరగొడుతున్నాడు. పెళ్లి చేసుకోవడం కోసమే న్యూజిలాండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌కు అక్షర్ పటేల్ దూరమయ్యాడు. కాగా, ఈ నవ దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మరో క్రికెటర్ కేఎల్ రాహుల్ వివాహం కూడా అతియా శెట్టితో ఇదే … Read more