అనుకున్నదేదీ వెంటనే జరిగిపోదు: రోహిత్ శర్మ
భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ ఓ ఆంగ్ల వెబ్‌సైట్ ఇంటర్య్వూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు కెప్టెన్ అవకాశం 26 లేదా 27 ఏళ్ల వయసులో వచ్చి ఉంటే బాగుండేదన్నారు. ‘జీవితంలో అనుకున్నదేది వెంటనే జరిగిపోదు. జట్టులో చాలా మంది విన్నర్లుగా ఉన్నా వారి కెప్టెన్సీ అవకాశం అందలేదు. గతంలో గౌతమ్ గంభీర్, సెహ్వాగ్, యువరాజ్ సింగ్ లాంటి స్టార్లు ఆడారు. కానీ వారు ఎప్పుడూ కెప్టెన్సీ చేపట్టలేదు. ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది. అదెంతో ఆనందంగా ఉంది’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు.