ప్రముఖ నటి సదా ఎమోషనల్ పోస్ట్ చేసింది. తను నిర్వహిస్తున్న ఎర్త్లింగ్స్ కెఫెను మూసేయాల్సిన పరిస్థితి వచ్చిందంటూ భావోద్వాగానికి లోనయ్యింది. “ 2019 ఏప్రిల్ 23న కెఫె ప్రారంభించాను. ఇది నా ఫస్ట్ బిజినెస్. నా కన్న బిడ్డలా చూసుకున్నాను. 2023 ఏప్రిల్ 23 నాకు బాధ మిగిల్చిన రోజు. కెఫె స్థలం యజమాని ఫోన్ చేసి ఖాళీ చేయమన్నాడు. నెల రోజులు గడువు ఇచ్చాడు. నాకు పెద్ద షాక్ తగిలింది. ఎంత ప్రయత్నించినా కన్నీళ్లు ఆగడం లేదు” అని పేర్కొంది.