మనిషి జీవితంలో సోషల్ మీడియా కూడా ఒక భాగంగా మారిపోయింది. రోజులో కనీసం ఒకసారైన ఫేస్‌బుక్, వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్ తెరవని స్మార్ట్ ఫోన్ యూజర్ లేరని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుత రోజుల్లో సమాచారం చేరవేయడానికి సోషల్ మీడియా ప్రధాన వేదికగా మారింది. సోషల్ మీడియాకు ఆదరణ పెరగడంతో సినీ హీరోలు సైతం తమను తాము ప్రమోట్ చేసుకునేందుకు దీనిని వేదికగా చేసుకున్నారు. టాలీవుడ్‌లో చాలా మంది హీరోలు సోషల్ మీడియాలో మరీ ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో సంచలనాలు సృష్టిస్తున్నారు. కోట్ల మంది ఫాలోయర్స్‌తో రికార్డులు సృష్టిస్తున్నారు. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్‌ను కలిగిన టాప్-10 తెలుగు హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
1. అల్లుఅర్జున్:
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ క్రేజ్ ‘పుష్ప’ చిత్రంతో అమాంతం పెరిగిపోయింది. పాన్ ఇండియా స్థాయిలో పుష్ప విజయం సాధించడంతో బాలీవుడ్ ప్రేక్షకులు సైతం బన్నీకి అభిమానులుగా మారిపోయారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతూ బన్నీ ఇచ్చే అప్‌డేట్స్ తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం తెలుగు హీరోల్లో అత్యధికమంది ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న నటుడిగా బన్నీ ఉన్నాడు. బన్నీ ఇన్‌స్టా ఖాతాను 20.3 మిలియన్స్ మంది ఫాలో అవుతున్నారు. అయితే బన్నీ మాత్రం తన భార్య స్నేహరెడ్డి ఖాతాను మాత్రమే ఫాలో అవుతుండటం గమనార్హం.
2. విజయ్ దేవరకొండ:
2017లో విడుదలైన అర్జున్ రెడ్డి మూవీతో విజయ్ దేవరకొండ ఓవర్‌నైట్ స్టార్‌గా ఎదిగాడు. తన విభిన్నమైన బాడీ లాంగ్వేజ్‌తో యూత్‌ను ఆకర్షించిన విజయ్.. తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఫలితంగా ఇన్‌స్టాలో రెండో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న తెలుగు హీరోగా విజయ్ నిలిచాడు. ప్రస్తుతం విజయ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 17.9 మిలియన్స్ మంది ఫాలో అవుతున్నారు. కానీ విజయ్ ఏ ఒక్కరినీ కూడా ఫాలో అవ్వడం లేదు.
3. రామ్‌చరణ్
RRR చిత్రంతో రామ్‌చరణ్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ సినిమాలో చెర్రీ నటన చూసి చాలా మంది ఆయనకు అభిమానులుగా మారిపోయారు. ప్రస్తుతం రామ్‌చరణ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 13.6 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. దీంతో టాప్ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న తెలుగు హీరోల జాబితాలో చరణ్ 3వ స్థానంలో నిలిచాడు.
4. మహేశ్ బాబు
టాలీవుడ్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో మహేశ్ ఒకరు. మహేశ్ కొత్త సినిమా రిలీజ్ అంటే ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పాలి. సామాజిక మాధ్యమాలకు మహేశ్ కాస్త దూరం పాటిస్తున్నప్పటికీ ఆయన ఫ్యాన్స్ మాత్రం మహేశ్‌ను విపరీతంగా ఫాలోఅవుతున్నారు. ప్రస్తుతం మహేశ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 10.1 మిలియన్స్ మంది ఫాలోవర్స్ ఉన్నారు.
5. ప్రభాస్:
బాహుబలి ముందు వరకు టాలీవుడ్‌కే పరిమితమైన ప్రభాస్ క్రేజ్ ఆ సినిమా తర్వాత విశ్వవ్యాప్తమైంది. ప్రభాస్ ఆహార్యం, నటన చూసి కోట్లాది మంది సినీ ప్రేక్షకులు ప్రభాస్‌కు అభిమానులుగా మారిపోయారు. అంతేగాక ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను తెగ ఫాలో అవుతున్నారు.
ప్రస్తుతం 9.3 మిలియన్ ఫాలోవర్స్‌ను సంపాదించిన ప్రభాస్ టాప్-3 తెలుగు హీరోగా నిలిచాడు.
6. జూ.ఎన్టీఆర్
RRR చిత్రం రామ్‌చరణ్‌తో పాటు తారక్‌కు సైతం మంచి గుర్తింపు తీసుకొచ్చింది. NTR తన మిస్మరైజింగ్ నటనతో మరింత మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఇన్‌స్టాలో 5.9 మిలియన్ల మంది ఎన్టీఆర్‌ను ఫాలో అవుతున్నారు.
7. నాని
నేచురల్ స్టార్ నాని తన సహజ సిద్దమైన నటనతో టాలీవుడ్‌లో మంచి హీరోగా ఎదిగాడు. ఆయన లేటెస్ట్ మూవీ దసరా మంచి హిట్ టాక్ తెచ్చుకోవడంతో నాని ఇమేజ్ మరింత పెరగనుంది. ప్రస్తుతం నాని ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 5.9 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు.
8. రామ్ పోతినేని
యంగ్ హీరో రామ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ద సంఖ్యలోనే అభిమానులు ఫాలో అవుతున్నారు. మెుత్తం 3.6 మిలియన్ల మంది రామ్‌ను అనుసరిస్తున్నారు.
9. వరుణ్ తేజ్
మెగా హీరోల్లో అల్లుఅర్జున్ తర్వాత వరణ్‌తేజ్‌కే అత్యధిక ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు. ప్రస్తుతం వరుణ్ ఖాతాను కూడా 3 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
10. అఖిల్ అక్కినేని
నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని నుంచి మూడు సినిమాలు విడుదలైనప్పటికీ అందులో ఒక్కటి కూడా ఆశించిన మేర విజయం సాధించలేకపోయింది. అయితే విజయాలతో సంబంధం లేకుండా అఖిల్ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. అఖిల్‌ను సైతం 3 మిలియన్ల మంది ఇన్‌స్టాలో ఫాలో అవుతున్నారు.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్