ఈ వారం భారీ చిత్రాలు థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి. ఈ క్రిస్మస్ వారాన్ని మరింత సందడిగా మార్చబోతున్నాయి. డిసెంబర్ 18 నుంచి 24వ తేదీల మధ్య థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఉర్రూతలూగించనున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. మరి ఆ సినిమాలు/సిరీస్‌లు ఏవి? వాటి విశేషాల ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం.
థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు
సలార్
సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూసిన చిత్రాల్లో ‘సలార్’ (Salaar) ఒకటి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఈ వారం విడుదల కానుంది. డిసెంబరు 22న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, ఈశ్వరీరావు, శ్రియారెడ్డి తదితరులు కీలకపాత్రలు పోషించారు. రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో హోంబలే ఫిల్మ్స్ ‘సలార్’ను నిర్మించింది.
డంకీ
బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ఖాన్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘డంకీ’ (Dunki). రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో షారుక్‌కు జోడీగా తాప్సీ నటించింది. క్రిస్మస్ కానుకగా డిసెంబరు 21న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ‘ఇచ్చిన మాట కోసం ఓ సైనికుడు చేసే ప్రయాణం’ ఈ సినిమా అంటూ చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. ఈ ఏడాది షారుక్ ఖాన్ ‘పఠాన్’, ‘జవాన్’ చిత్రాలతో బాక్సాఫీస్ ఘన విజయాలను నమోదు చేశాడు. ‘డంకీ’తో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు.
ఆక్వామెన్ అండ్ ద లాస్ట్ కింగ్‌డమ్
జాసన్ మోమోవా కథానాయకుడిగా జేమ్స్ వాన్ దర్శకత్వంలో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రం ‘ఆక్వామెన్’. 2018లో విడుదలై బాక్సాఫీస్ ముందు సంచలన విజయాన్ని అందుకుంది. ఇప్పుడీ చిత్రానికి కొనసాగింపుగా ‘ఆక్వామెన్ అండ్ ద లాస్ట్ కింగ్‌డమ్’ (Aquaman and the Lost Kingdom) ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 22న భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/ సిరీస్‌లు
ఆదికేశవ
మెగా హీరో వైష్ణవ్ తేజ్(Vaishnav Tej) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ఆదికేశవ(Aadikeshava). యంగ్ బ్యూటీ శ్రీలీల(Sreeleela) హీరోయిన్‌గా నటించిన ఈ మూవీని కొత్త దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి తెరకెక్కించాడు. ఈ చిత్రం డిసెంబర్ 22న ఓటీటీలోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
Title | Category | Language | Platform | Release Date |
The Rope Curse 3 | Web Series | English | Netflix | Dec 18 |
Maestro | Movie | English | Netflix | Dec 20 |
Top Gun: Maverick | Movie | English | Netflix | Dec 22 |
Curry & Cyanide | Documentary | English | Netflix | Dec 22 |
Rebel Moon | Movie | English | Netflix | Dec 22 |
Dry Day | Movie | Hindi | Amazon Prime | Dec 22 |
Sapta Saagaradaache Ello – Side B | Movie | Telugu/Kannada | Amazon Prime | Dec 22 |
The Souvenir | Movie | English | Jio Cinema | Dec 18 |
Hey Kameeni | Movie | Hindi | Jio Cinema | Dec 22 |
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్