గతవారం బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాలు సందడి చేశాయి. అయితే నవంబర్ మూడో వారంలో రెండు బిగ్ ఫిల్మ్స్ మాత్రమే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఒకదానితో ఒకటి ఢీ కొడుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచనున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ ఆసక్తికర చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఆ విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు
కంగువా (Kanguva)
తమిళ నటుడు సూర్య (Suriya) హీరోగా నటించిన మోస్ట్ వాంటెడ్ చిత్రం ‘కంగువా‘. శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తమిళం తెలుగుతో పాటు పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతోంది. బాలీవుడ్ నటి దిశా పటానీ, బాబీ దేవోల్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. కె. ఈ. జ్ఞానవేల్ రాజా, వంశీ ప్రమోద్ నిర్మాతలుగా వ్యవహరించారు. నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా 10వేల స్క్రీన్స్‌లో కంగువాను రిలీజ్ చేస్తున్నారు. త్రీడీలోనూ ఈ సినిమాను వీక్షించవచ్చు.
మట్కా (Matka)
మెగా హీరో వరుణ్‌తేజ్ నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మట్కా’ (Matka). కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా చేసింది. విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. నవంబర్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వరణ్‌లోని నటుడ్ని మరోస్థాయికి తీసుకెళ్లే చిత్రం మట్కా అవుతుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్, టీజర్, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు
ఉషా పరిణయం (Usha Parinayam)
కుమారుడు శ్రీకమల్‌ను హీరోగా పెట్టి స్టార్ డైరెక్టర్ కె. విజయ్‌భాస్కర్ తెరకెక్కించిన చిత్రం ‘ఉషా పరిణయం’. తాన్వీ ఆకాంక్ష కథానాయిక. ఈ ఏడాది ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ యువతను మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో నవంబరు 14 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.
ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ (Freedom At Midnight)
‘ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్’ పుస్తకం ఆధారంగా అదే పేరుతో ఈ వెబ్‌సిరీస్ రూపొందింది. నిఖిల్ అద్వాణీ దర్శకత్వం వహించారు. 1947 స్వాతంత్రం అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలు, గాంధీ పాత్ర నేపథ్యంలో ఈ సిరీస్ సాగనుంది. హిందీతో పాటు, తెలుగులోనూ ఈ సిరీస్ నవంబరు 15వ తేదీ నుంచి ఓటీటీ వేదిక సోనీలివ్‌లో (SonyLiv) స్ట్రీమింగ్ కానుంది.
Title | Category | Language | Platform | Release Date |
Telisinavallu | Movie | Telugu | Aha | Nov 8 |
Vettaiyan | Movie | Telugu | Amazon | Nov 8 |
Viswam | Movie | Telugu | Amazon | Nov 1 |
Return Of The King | Documentary Movie | English | Netflix | Nov 13 |
Hot Frasty | Series | English | Netflix | Nov 13 |
Emilia Pérez | Series | English | Netflix | Nov 13 |
Cobra Kai | Series | English | Netflix | Nov 15 |
Jake Paul vs. Mike Tyson | Movie | English | Netflix | Nov 15 |
In Cold Water | Series | English | Amazon | Nov 12 |
Cross | Series | English | Amazon | Nov 14 |
Last World War | Movie | English | Amazon | Nov 8 |
Deadpool & Wolverine | Series | English | Hotstar | Nov 12 |
On Almost Christmas Story | Animation | Telugu | Hotstar | Nov 15 |
Saint Denis Medical | Series | English | Jio Cinema | Nov 13 |
The Day of the Jackal | Series | English | Jio Cinema | Nov 13 |
Unstoppable S4 (Allu arjun) | Talk Show | Telugu | Aha | Nov 15 |
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!