• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Trisha: డేటింగ్‌లో విజయ్‌ – త్రిష? కీర్తి సురేష్‌ పెళ్లిలో రివీలైన బంధం!

    తమిళ స్టార్‌ హీరో దళపతి విజయ్ (Vijay), హీరోయిన్‌ త్రిష (Trisha) ప్రేమలో ఉన్నట్లు కోలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వీరు డేటింగ్‌ (Trisha Vijay Dating)లో ఉన్నట్లు కూడా నెట్టింట రూమర్లు వచ్చాయి. ఈ క్రమంలో వీరు గోవాలో జరిగిన కీర్తి సురేష్ – ఆంటోనీ తట్టిల్ వివాహ వేడుకకు కలిసి ప్రయాణించినట్లు ఫొటోలు, వీడియోలు ఒక్కసారిగా బయటకు వచ్చాయి. ఈ ఫొటోలతో వీరి సంబంధం గురించి సోషల్ మీడియాలో మరోమారు చర్చ మొదలైంది. వీరు నిజంగానే డేటింగ్‌లో ఉన్నారనేందుకు ఈ ఫొటోలు, వీడియోలే నిదర్శనమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

    చెకింగ్‌ దగ్గర దొరికేసిన జంట.. 

    స్టార్‌ హీరోయిన్‌ కీర్తి సురేష్‌ (Keerthi Suresh) తన చిరకాల మిత్రుడు ఆంటోని తట్టిల్‌ (Antony Thattil)ను గురువారం (డిసెంబర్‌ 12) గోవాలో పెళ్లి చేసుకుంది. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ పెళ్లికి అతి ముఖ్యులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. తమిళ ఇండస్ట్రీ నుంచి విజయ్‌, త్రిష జంటగా ఈ పెళ్లికి హాజరయ్యారంటూ గురువారమే వార్తలు వచ్చాయి. అయితే ఇవాళ వీడియోలు బయటకు రావడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతున్నారు. విజయ్‌, త్రిష స్పెషల్‌ ఫ్లైట్‌లో గోవాకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఎయిర్‌పోర్టు చెకింగ్‌ సందర్భంగా విజయ్‌, త్రిష జంటగా కెమెరాలకు చిక్కారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

    త్రిష-విజయ్‌ లుక్స్‌ అదరహో.. 

    ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో త్రిష సాధారణ వైట్ టీ-షర్ట్ ధరించగా, విజయ్ బ్లూ స్ట్రైప్ షర్ట్‌తో చక్కగా కనిపించాడు. సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది వారిద్దరిని చెక్‌ చేస్తుండగా అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన సెల్‌ఫోన్‌ కెమెరాలో వారిని బంధించారు. చెకింగ్ అనంతరం త్రిష, విజయ్‌ తమ కారుల్లో ఎక్కి హడావిడీగా వెళ్లిపోయారు. కాగా, స్పెషల్‌ ఫ్లైట్‌లో ప్రయాణం చేసిన వారి లిస్ట్‌ కూడా సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమైంది. అందులో త్రిష, విజయ్‌ పేర్లతో పాటు మరో నలుగురు వ్యక్తులు ప్రయాణించినట్లు వివరాలు ఉన్నాయి. 

    నెటిజన్ల రియాక్షన్‌ ఇదే

    విజయ్, త్రిష (Trisha Vijay Dating)కి సంబంధించిన వీడియో బయటకు వచ్చిన వెంటనే నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ చేయడం మొదలుపెట్టారు. ‘వెడ్డింగ్‌లో పాల్గొంటే తప్పేముంది?’ అని కొందరు విజయ్ జంటను సమర్థిస్తున్నారు. పెళ్లై పిల్లలను పెట్టుకొని విజయ్‌ ఇలా చెట్టాపట్టాలు వేసుకొని తిరగడం ఏమాత్రం అమోదయోగ్యం కాదని మరికొందరు విమర్శిస్తున్నారు. పైగా రాజకీయాల్లోకి ప్రవేశించిన నేపథ్యంలో వ్యక్తిగత జీవితంలోనూ విజయ్‌ హుందాగా ఉండాల్సిన అవసరముందని గుర్తుచేస్తున్నారు. ప్రస్తుతం త్రిష, విజయ్‌ వ్యవహారం కీర్తి సురేష్‌ పెళ్లి కంటే ఎక్కువగా చర్చ జరుగుతోంది. 

    విజయ్‌ జంటకు మంచి క్రేజ్‌

    విజయ్‌ – త్రిష (Trisha Vijay Dating) జంటకు తమిళంలో మంచి క్రేజ్ ఉంది. వారు ఇప్పటివరకూ 8 చిత్రాల్లో కలిసి నటించారు. గతేడాది వచ్చిన లియో సినిమాలో విజయ్‌కి జోడీగా త్రిష నటించింది. ఈ ఏడాది వచ్చిన ‘ది గ్రేటెస్ట్ ఆఫ్‌ ఆల్‌టైమ్‌’ సినిమాలోనూ త్రిష ఓ స్పెషల్‌ సాంగ్‌లో తళుక్కుముంది. అయితే ఎప్పుడు లేని విధంగా ఈ మధ్య కాలం నుంచే వీరు డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు మెుదలయ్యాయి. అయితే విజయ్‌ రాజకీయాల్లోకి ప్రవేశించిన నేపథ్యంలో అతడి పొలిటికల్‌ ప్రత్యర్థులు ఇలా దుష్ప్రచారం చేయిస్తున్నారన్న ప్రచారం కూడా తమిళనాడులో ఉంది. ఏది ఏమైనా తన రిలేషన్‌ గురించి విజయ్‌ – త్రిష క్లారిటీ ఇచ్చే వరకూ ఈ చర్చ ఇలాగే కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv