• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  •  Umiya Mata Temple: భారత్‌లో మరో అద్భుతం.. ప్రపంచంలో అతి ఎత్తైన ఆలయానికి శంకుస్థాపన.. ఆలయం విశిష్టతలు మీకోసం

    ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన దేవాలయం గుజరాత్‌లోని అహ్మాదాబాద్‌లో నిర్మాణం అవుతోంది. ఆలయాన్ని 504 అడుగుల (World Tallest Temple) ఎత్తుతో జస్పూర్ గ్రామంలో నిర్మిస్తున్నారు. రాబోయే ఐదేళ్లలో ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసి భక్తులకు అందించాలని నిర్వాహకలులు సంకల్పించారు.  ఆలయ నిర్మాణంతో పాటు  ప్రపంచంలోనే రెండో పెద్ద ట్రీ మ్యూజియంను గుడి ఆవరణంలో ఏర్పాటు చేయనున్నట్లు ఆలయ అధికారులు చెప్పారు. విశ్వ ఉమియా ధామ్​ ఆధ్వర్యంలో ఈ దేవాలయ నిర్మాణం జరగనుంది.  మరి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఈ ఆలయం విశిష్టతలు ఓ సారి తెలుసుకుందాం.

    ఆలయం విశిష్టతలు

    ఈ ఆలయం గుజరాతీల ఆరాధ్య దైవం ఉమియా మాతకు అంకితం చేయబడింది.  ఈ గుడిని దాదాపు 504 అడుగుల ఎత్తుతో నిర్మిస్తున్నారు. సూమారు 62 ఎకరాల విస్తీర్ణంలో ఆలయ నిర్మాణం జరగుతోంది.  ఆలయ నిర్మాణంలో ఇండో-జర్మన్​  టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ప్రకృతి విపత్తులను తట్టుకునేలా ఆలయాన్ని డిజైన్ చేశారు.  భూకంపాలు, వరదలను సైతం తట్టుకుని నిలదొక్కుకుని ఉండేలా ఆలయ నిర్మాణం చేపడుతున్నారు.  504 అడుగుల ఎత్తున్న ఈ ఆలయంలో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వీలుగా మూడు గ్యాలరీలను ఏర్పాటు చేశారు. 82, 90, 110 మీటర్ల ఎత్తులో ఈ గ్యాలరీలను నిర్మించారు.  ఉమియా మాతాజీ సింహాసనాన్ని 51 అడుగుల ఎత్తులో ప్రతిష్ఠించనున్నారు.  

    ఉమియా మతాజి విగ్రహంతో పాటు ఆలయంలో శివలింగాన్ని సైతం ఏర్పాటు చేయనున్నారు. శివలింగాన్ని మెర్క్యూరీ లోహంతో తయారు చేయనున్నారు.  మొత్తం ఆలయాన్ని రూ.800 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నారు.  మాతాజి సందర్శన కోసం వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక సదుపాయాలు ఆలయ ఆవరణలో కల్పిస్తున్నారు.  వృద్ధులు సైతం ఈ ఆలయాన్ని దర్శించుకునేలా ఎస్కలేటర్​ను ఏర్పాటు చేస్తున్నారు. ఒకేసారి 3,500 వాహనాలు పార్క్ చేసేలా పార్కింగ్ స్థలాన్ని కేటాయించారు. దేవస్థానం ప్రాంగణంలో స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ, కెరీర్ డెవలప్‌మెంట్ సెంటర్, ఒక ఆస్పత్రి, క్రీడా వేదికలను నిర్మిస్తున్నారు.

    ప్రపంచంలో అతిపెద్ద ఆలయం మనదగ్గరే..!

    అటు బిహార్‌లోనూ ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయ నిర్మాణం జరుగుతోంది. ఈ గుడి నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైంది.  విరాట్ రామాయణ మందిరం(virat ramayan mandir) పేరుతో తూర్పు చంపారణ్ జిల్లా- కైథవలియా గ్రామంలో నిర్మిస్తున్నారు. 2025 నాటికి ఈ ఆలయాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 1080 అడుగుల పొడవు,  270 అడుగుల ఎత్తుతో దీనిని నిర్మిస్తున్నారు. ఈ ఆలయం నిర్మాణం పూర్తైతే.. ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయంగా విరాట్ రామమందిరం నిలవనుంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv