లెజండరీ దర్శకుడు విశ్వనాథ్ బయోపిక్!
కళాతపస్వి, లెజండరీ డైరెక్టర్ కే విశ్వనాథ్ మృతి చెందిన సంగతి తెలిసిందే. శుక్రవారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి. కాగా ప్రస్తుతం విశ్వనాథ్ బయోపిక్ హాట్ టాపిక్‌గా మారింది. ఇదివరకే ‘విశ్వదర్శనం’ టైటిల్‌తో కళాతపస్వి బయోపిక్ మొదలైంది. ఈ చిత్రాన్ని జనార్థన మహర్షి తెరకెక్కించాలని ప్రయత్నించారు. కానీ ఏమైందో ఏమో ఆ బయోపిక్ అర్ధాంతరంగా ఆగిపోయింది. ప్రస్తుతం విశ్వనాథ్ మృతి నేపథ్యంలో ఆ బయోపిక్‌ను మళ్లీ మొదలు పెడతారని టాక్.