పరీక్షా హాల్లో విద్యార్థి.. చుట్టూ అమ్మాయిలే; ఏమైందంటే?
పరీక్షా హాల్లో అందరూ అమ్మాయిలే ఉండటంతో ఓ అబ్బాయి షాక్కు గురై స్పృహ తప్పి పడిపోయాడు. ఈ ఘటన బిహార్లోని నలందా జిల్లాలో ఉన్న ఓ కాలేజీలో చోటుచేసుకుంది. మనీశ్ కుమార్(17) అనే విద్యార్థి ఇంటర్ ఎగ్జామ్స్ రాయడానికి పరీక్షా కేంద్రానికి వెళ్లాడు. అక్కడ 500 మంది విద్యార్థినులు ఉన్నారు. దీంతో మనీశ్ షాక్కు గురయ్యాడు. వెంటనే స్పృహ తప్పి పడిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. అంతమంది అమ్మాయిల్ని చూసి కంగారు పడడంతోనే స్పృహ తప్పినట్లు విద్యార్థి బంధువులు తెలిపారు.