గుజరాత్లో ఘోరం.. ప్రశ్నించిన జవాన్ హత్య
గుజరాత్లో ఓ బీఎస్ఎఫ్ జవాన్ని అన్యాయంగా కడతేర్చారు. కుమార్తె అసభ్యకర వీడియోలను నెట్టింట ఓ యువకుడు పోస్ట్ చేశాడు. వీటిని డిలీట్ చేయించడానికని సదరు యువకుడి ఇంటికి భార్య, మేనల్లుడు, కుమారులను వెంటబెట్టుకుని జవాన్ వెళ్లాడు. అక్కడ వాగ్వాదం జరగడంతో యువకుడి వర్గం జవాన్పై దాడికి దిగింది. అది తీవ్రం కావడంతో సైనికుడు మృతి చెందాడు. అయితే, సదరు యువకుడు, జవాన్ కుమార్తె రిలేషన్షిప్లో ఉన్నారని తెలిసింది. వీరిద్దరూ ఒకే పాఠశాలలో చదువుకుంటున్నారట. జవాన్ మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.