• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Valentines Day Gifts For Her: మీ లవర్‌ ఎగిరిగంతేసే గిఫ్ట్‌ కావాలా? వీటిని ట్రై చేయండి!

  ప్రేయసి.. శ్రీమతి లేదా మనసు దోచిన మధుమతి ఇలా ఎవరి వద్దనైనా మీరు మాటలతో ఎన్ని ప్రేమ కోటలు కట్టినా అవి ఎక్కువ కాలం నిలబడవు. మీ ప్రేమ వారికి గుర్తుండిపోయేలా ఉండాలంటే చక్కటి బహుమతి చాలా అవసరం. అది కూడా ప్రేమికుల కోసమే ఉన్న వాలైంటైన్స్‌ డే (Valentines Day) రోజున మరి ముఖ్యం. ఆ రోజున మీ ప్రేయసి లేదా జీవిత భాగస్వామికి మరుపురాని గిఫ్ట్‌ ఇస్తే ఆమె ఎప్పటికీ మర్చిపోదు. అయితే తమకు ఇష్టమైన వారికి ఎలాంటి గిఫ్ట్ ఇస్తే బాగుంటుందని చాలా ఆలోచిస్తుంటారు. వెబ్‌సైట్‌లో తెగ వెతికేస్తుంటారు. అటువంటి వారి కోసం YouSay ఈ ప్రత్యేక కథనాన్ని తీసుకొచ్చింది. మీ ప్రేయసి మనసుకు నచ్చే  బహుమతులను ఒక దగ్గరకు చేర్చింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. 

  వాలెంటైన్‌ వీక్‌ కాంబో

  వాలెంటైన్‌ వీక్ మెుత్తానికి కలిపి ఒక గిఫ్ట్‌ ఇవ్వాలని భావిస్తే దీనిని ట్రై చేయవచ్చు. ఇందులో రెండు టెడ్డీలు, మెసేజ్‌ బాటిల్‌ బాక్స్, కార్డ్‌, ఫవర్ బుకే, కపుల్ స్టాట్యూ, రింగ్‌, చాక్లెట్స్‌ ఒక సెట్‌గా వస్తాయి. ఇది కచ్చితంగా మీ ప్రేయసికే నచ్చే అవకాశముంది. 

  లైటింగ్‌ ప్లాంట్‌

  మీ ప్రేయసిపై ఉన్న ప్రేమను చాటుకునేందుకు ఈ ఆర్టిఫిషియల్‌ లైటింగ్‌ ప్లాంట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చి చూడండి. ఇది మిల మిల మెరుస్తూ మీ ప్రేయసికి మిమ్మల్నే గుర్తు చేస్తూ ఉంటుంది. 

  మ్యూజికల్‌ కపుల్‌

  మీ మనసుకు నచ్చిన వారికి మీ ప్రేమ గురించి తెలిపేందుకు ఈ బహుమతి కూడా ఉపయోగపడుతుంది. ఈ మ్యూజికల్‌ కపుల్‌ గిఫ్ట్‌.. వెలుగు విరజిమ్ముతూ మంచి సంగీతంతో మీ ప్రేమను వ్యక్తం చేస్తుంది. 

  మీ ప్రేయసి బ్యూటీ కోసం

  మీ ప్రేయసి అందాన్ని మరింత పెంచే గిఫ్ట్‌ను ఇవ్వాలని భావిస్తే దీన్ని ట్రై చేయవచ్చు. 7 రకాల బ్యూటీ ప్రొడక్ట్స్‌ సెటప్‌తో ఇది వస్తుంది. మీరు ప్రేమించిన వ్యక్తి నలుగురిలో అందంగా కనిపించేలా చేస్తుంది. అమ్మాయిలు కాదనలేని బహుమతిగా ఇది నిలుస్తుంది. 

  లవ్‌ బాక్స్‌

  ఈ వాలెంటైన్‌ డేను మరింత తియ్యగా మార్చేందుకు మీ ప్రేయసికి Love & Heart Boxను గిఫ్ట్‌గా ఇవ్వండి. ఇందులో 14 స్నాక్స్‌ ఉన్నాయి. పిజ్జా స్టిక్స్‌, రాగి చిప్స్‌, హాట్‌ చాక్‌లెట్ మిక్స్‌ ఇలా రుచికరమైన 14 పదార్థాల ప్యాకింగ్‌తో ఇది వస్తుంది. మీ ప్రేయసి ఫుడ్‌ లవర్‌ అయితే ఈ గిఫ్ట్ చూసి ఎగిరిగంతేయడం ఖాయం. 

  బ్యూటీఫుల్‌ వాచ్‌

  మీ ప్రేయసికి అందమైన వాచ్‌ను గిఫ్ట్‌ ఇస్తే ఆమె సంతోషాన్ని రెట్టింపు చేసినవారవుతారు. ఎందుకంటే ఈ గిఫ్ట్‌ ప్యాక్‌ వాచ్‌తో పాటు సువాసనలు వెదజల్లే పర్‌ఫ్యూమ్‌తో పాటు వాలెట్‌తో ఇది వస్తుంది. 

  చాక్లెట్‌

  అమ్మాయిలకు ఎంత వయసు పెరిగినా చాక్లెట్లపై ఉండే ప్రేమ ఏమాత్రం తగ్గదు. దానిని ఎప్పుడు ఇచ్చినా వారి ప్రేమను గెలుచుకోవచ్చు. వాలెంటైన్‌ డే సందర్భంగా ఈ డైరీమిల్క్‌ చాకొలెట్ గిఫ్ట్‌ బాక్స్‌ ఇచ్చి వారి సంతోషాన్ని రెట్టింపు చేయండి.

  అందుకే  నువ్వంటే నాకిష్టం

  చాలామంది అమ్మాయిలు అబ్బాయిలను అడుగుతుంటారు అసలు నేనంటే ఎందుకు అంత ఇష్టం అని! ఆ సమాధానం కొంచెం కష్టమేననుకోండి. అయితే సరిగ్గా మీ మనసులో ఉన్న భావనలే అందమైన గిఫ్ట్‌ రూపంలో లభిస్తే భలే ఉంటుంది కదూ. మీ ప్రేమను తెలియజేసే 20 అంశాలతో కూడిన ఈ బాక్స్‌ను మీకు ప్రేయసి/ శ్రీమతికి గిఫ్ట్‌గా ఇచ్చి చూడండి. ఆమె ఎప్పటికీ మర్చిపోదు. 

  లవ్‌ అగ్రీమెంట్‌

  సాధారణంగా మనీతో ముడిపడి ఉన్న ప్రతిదానికీ అగ్రీమెంట్‌ ఉంటుంది. మనసుతో ముడిపడిన ప్రేమకు మాత్రం నమ్మకమే అగ్రీమెంట్‌. కాకపోతే ఈ ఫన్నీ లవ్‌ అగ్రీమెంట్‌తో మీ ప్రియురాలి పెదాలపై చిరునవ్వును పూయించొచ్చు. ఒకసారి ట్రై చేయండి. 

  ఉంగరం

  ఉంగరం అంటే ప్రామిస్‌. అందుకే ఎంగేజ్‌మెంట్‌లో పెళ్లికి ప్రామిస్‌గా ఉంగరం తొడుగుతారు. జీవితకాల బంధానికి సూచనగా నిలిచే ఉంగరాన్ని ప్రేమికుల రోజున మీ ప్రేయసికి ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేయండి. 

  దిండు (Pillow)

  మీకు దూరంగా ఉన్న ప్రియురాలికి మీరు పక్కనే ఉన్నారన్న భావన కలిగించేందుకు ఈ పిల్లో గిఫ్ట్‌ ఉపయోగపడుతుంది. ఆ దిండును పట్టుకుని మీ ప్రేయసి మీతో ఉన్నట్లుగా ఫీల్‌ అయ్యేందుకు వీలవుతుంది. 

  టెడ్డీ బేర్‌

  టెడ్డీ బేర్ నచ్చని అమ్మాయిలు ఉండరంటారు. ముద్దుగా బొద్దుగా అమాయకమైన కళ్లతో ఉండే టెడ్డీ బేర్‌..ప్రశాంతమైన ప్రేమకు చిహ్నం. ఇది కూడా దిండులాగే మీరు పక్కన లేనపుడు మీరున్నారన్న భరోసా ఇస్తుంది.

  ప్రతీది కొంచెంగా

  పైన చెప్పిన వాటిలో దాదాపుగా అన్నీ ఇవ్వాలనుందా? అయితే వాటిలో ఉన్న ముఖ్యమైన బహుమతులను సెట్‌గా అందించేందుకు ప్రయత్నించండి. ఇందుకోసం కింద ఉన్న లింక్‌పై క్లిక్ చేయండి. 

  ఫోటో ఫ్రేమ్‌

  మన ఫోన్లో వందల ఫోటోలు ఉన్నా తనతో ఉన్న ఆ కొన్ని ఫోటోలు మాత్రం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది కదా. మరి ఆ ఫొటోలు మీకు ఎంత ప్రత్యేకమో మీ ప్రేయసికి చూపించండి. ఓ చక్కటి ఫోటో ఫ్రేమ్‌ కొని అందులో మీకు ఇష్టమైన ఫోటోలను పెట్టి ఇవ్వండి.

  లాకెట్‌

  ప్రేమికుల రోజు సందర్భంగా ఈ చక్కటి లాకెట్ మీ ప్రేయసికి గిఫ్ట్‌గా కొనివ్వండి. లవ్‌ సింబల్‌తో వచ్చే ఈ లాకెట్‌ మీ హృదయ భాగస్వామికి కచ్చితంగా నచ్చుతుంది.  అందులో మీ ఫోటోలు ఉండేలా ఉంటే మరీ బాగుటుంది. తన హృదయానికి దగ్గరగా ఉన్నట్టే ఉంటుంది మీకు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv