• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Vijay Deverakonda: విజయ్‌పై హైదరాబాద్‌ మెట్రో ప్రశంసలు.. ఎందుకో తెలుసా?

    దేశంలో భారీ స్థాయిలో మెట్రో సేవలు అందిస్తున్న నగరాల్లో హైదరాబాద్‌ (Hyderabad Metro) ఒకటి. రోజుకు వేలాది మంది నగర వాసులు మెట్రో ద్వారా ప్రయాణం చేస్తుంటారు. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ను తప్పించుకొని మెట్రో ద్వారా వేగంగా తమ గమ్యస్థానాలకు చేరుతుంటారు. ఇదిలా ఉంటే రీసెంట్‌గా హైదరాబాద్‌ మెట్రో తన ఎక్స్‌ (ట్విటర్‌) ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. అది స్టార్‌ హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda)కు సంబంధించిన డ్యాన్స్‌ వీడియో కావడంతో ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ హైదరాబాద్‌ మెట్రో విజయ్‌ వీడియోను ఎందుకు షేర్ చేసింది? ఆ వీడియో కింద ఇచ్చిన క్యాప్షన్ ఎందుకు వైరల్‌ అవుతోంది? ఇప్పుడు చూద్దాం. 

    విజయ్‌ల ఎవరూ చేయలేదు: మెట్రో

    విజయ్‌ దేవరకొండ లేటెస్ట్‌ చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star) టీజర్‌ తాజాగా విడుదలై మంచి ఆదరణ పొందింది. ఇందులో విజయ్‌.. హైదరాబాద్‌ మెట్రోలో ప్రయాణిస్తూ స్టెప్పులేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఎక్స్‌లో షేర్‌ చేసిన హైదరాబాద్‌ మెట్రో.. విజయ్‌పై ప్రశంసలు కురిపించింది. ఈ వీడియోకు క్యాప్షన్‌ ఇస్తూ.. ‘మేము ఈ వీడియోను మీతో పంచుకోకుండా ఉండలేకపోతున్నాం. విజయ్‌ దేవరకొండతో పాటు ఫ్యామిలీ స్టార్‌ చిత్ర యూనిట్‌కు మా ధన్యవాదాలు. ఇంతకన్నా బెటర్‌గా మేము ఏం చెప్పగలము’ అంటూ రాసుకొచ్చింది. అటు వీడియోలోనూ టెక్ట్స్‌ రూపంలో విజయ్‌ను ప్రశంసించింది. విజయ్‌లా ఇప్పటివరకూ మెట్రోను ఎవరూ ప్రమోట్‌ చేయలేదని పేర్కొంది. 

    మిడ్‌క్లాస్‌ను టచ్‌ చేసిన టీజర్‌!

    విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ నుంచి సోమవారం టీజర్ రిలీజైంది. ఇందులో మీడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీస్‌ను టచ్‌ చేసే సీన్స్‌ను అలా ఒక ఫ్లాష్‌లో చూపించేశారు. ఒక మిడిల్‌ క్లాస్‌ కుర్రాడిలో కనిపించే ఫ్యామిలీ బాధ్యతలతో పాటు హీరోయిజంను డైరెక్టర్‌ పరుశురాం ఈ చిన్న టీజర్‌లో చూపించాడు. టీజర్ చివర్లో ‘హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కాలేజీ వద్ద బైకుపై దింపుతావా? అని అడిగితే.. లీటర్ పెట్రోల్ కొట్టిస్తే దింపేస్తా’ అని విజయ్ దేవరకొండ చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గీతా గోవిందం తర్వాత విజయ్‌ – పరుశురామ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంతో ‘ఫ్యామిలీ స్టార్‌’ భారీగా అంచనాలు ఉన్నాయి. 

    మృణాల్‌ – విజయ్‌ కెమెస్ట్రీ మాముల్గా లేదుగా!

    విజయ్ దేవరకొండ, పరుశురాం కాంబోలో వచ్చిన ‘గీత గోవిందం’లో హీరో విజయ్.. హీరోయిన్‌ రష్మికను ‘మేడం మేడం’ అంటూ వెంట తిరుగుతాడు. ఆ మేడం అనే పిలుపు అప్పట్లో ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. ఈసారి ఫ్యామిలీ స్టార్‌లో ‘ఏవండీ’ అనే పిలుపు కూడా ఆ స్థాయిలోనే హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది. ఈ మూవీ గ్లింప్స్ వచ్చినప్పటి నుంచీ ఈ ‘ఏవండీ’ అనే పిలుపు నెట్టింట్లో బాగానే ట్రెండ్ అయింది. ఇక టీజర్‌లోనూ మళ్లీ అదే పిలుపు మృణాల్‌ నోట వినిపించింది. తాజాగా విజయ్‌ ఎక్స్‌లో షేర్‌ చేసిన వీడియోలోను మృణాల్‌ విజయ్‌ను ఏవండి అంటూ ప్రేమగా పిలుస్తూ కనిపిస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. వీరి కెమెస్ట్రీ తెరపై కనువిందు చేస్తుందని ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు. 

    సరిగ్గా 30 రోజుల్లో రిలీజ్

    ది ఫ్యామిలీ స్టార్ సినిమాలో తొలిసారి విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జోడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాలో వాసుకి, రోహిణితో పాటు మరికొందరు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ స్టార్ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే సరిగ్గా 30 రోజుల్లో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ పోస్టర్‌ను సైతం చిత్ర యూనిట్‌ కొద్దిసేపటి క్రితమే రిలీజ్‌ చేసింది.

    విజయ్‌ తర్వాతి సినిమా

    ఫ్యామిలీ స్టార్‌ సినిమా పూర్తిగానే విజయ్ తన పన్నెండో చిత్రాన్ని ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే విడుదలైంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ కలిసి నిర్మిస్తున్నాయి. త్వరలోనే చిత్ర యూనిట్‌ షూట్‌కు కూడా వెళ్లనుంది. ఇక చిత్ర ప్రకటన సందర్భంగా మేకర్స్ కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. కాగా, ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించనున్నారు. ఇందులో విజయ్‌కు జోడీగా శ్రీలీల నటించనుంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv