• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 105 Minuttess Review: హన్సికా కెరీర్‌ బెస్ట్‌ నటన.. ‘105 మినిట్స్‌’ హిట్టా? ఫట్టా?

    న‌టీన‌టులు: హ‌న్సిక

    ద‌ర్శ‌క‌త్వం: రాజు దుస్సా 

    సంగీతం: సామ్ సిఎస్‌

    ఛాయాగ్రహ‌ణం: కిషోర్ బోయిడ‌పు

    నిర్మాత‌: బొమ్మక్ శివ

    ‘దేశ‌ముదురు’, ‘కందిరీగ’ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌తో నటి హన్సిక తెలుగు ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం ఆమె నాయికా ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే హన్సిక ‘105 మినట్స్‌’ (105 Minutes)తో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. ప్ర‌యోగాత్మ‌కంగా తెరకెక్కిన ఈ చిత్రంలో సినిమా మెుత్తం హన్సిక ఒక్కరే కనిపించడం విశేషం. మ‌రి ఈ సినిమా ప్రేక్ష‌కుల‌కు ఎలాంటి అనుభూతి పంచింది? హ‌న్సిక‌కు విజ‌యాన్ని అందించిందా? లేదా? ఇప్పుడు చూద్దాం.

    కథేంటి

    జాను (హ‌న్సిక‌) ఆఫీసు నుంచి కారులో ఇంటికి వెళ్తున్న క్రమంలో తననేదో అదృశ్యశక్తి వెంటాడుతున్నట్లు ఆమెకు అర్థమవుతుంది. ఇంటికి వెళ్లాక అనూహ్య ప‌రిణామాలు చోటుచేసుకుంటాయి. ఆ అదృశ్య శ‌క్తి జానును ఇనుప గొలుసుతో బంధించి చిత్రహింస‌ల‌కు గురి చేయ‌డం ప్రారంభిస్తుంది. తన మరణానికి జానునే కారణమని చెప్పి ఇబ్బందులు పెడుతుంది. ఇంతకీ ఆ అదృశ్య శక్తి ఎవరు? ఆ వ్య‌క్తి మ‌ర‌ణానికి జాను ఎలా కార‌ణ‌మైంది? దాని బారి నుంచి జాను ఎలా బ‌య‌ట‌ప‌డింది? అన్న‌ది మిగ‌తా క‌థ‌

    ఎవరెలా చేశారంటే

    జాను పాత్ర‌లో హ‌న్సిక  (105 Minutes Review) జీవించింది. తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. అయితే సినిమా ఆద్యంతం ఒకే ఎమోషన్‌ను మెయిన్‌టెన్‌ చేస్తూ ఆమె నటించడం వల్ల సినిమా భారంగా సాగినట్లు అనిపిస్తుంది. ఓవరాల్‌గా హన్సికా(Hansika) ఓ నటిగా మరోమారు సక్సెస్‌ అయ్యిందని చెప్పవచ్చు.

    డైరెక్షన్‌ ఎలా ఉందంటే

    ద‌ర్శ‌కుడు రాజు దుస్సా (Raju Dussa) కొత్త ప్ర‌య‌త్నం మంచిదైనా స‌రైన క‌థ‌, క‌థ‌నాలు లేకుండా రంగంలోకి దిగ‌డం వ‌ల్ల ఆశించిన ఫ‌లితం ద‌క్క‌లేదు. సినిమా (105 Minutes Review) ఆస‌క్తిక‌రంగానే మొదలైనా.. ఆ త‌ర్వాత నుంచి క‌థ ముందుకు సాగదు. హన్సిక పాత్రను ఆద్యంతం కేకలు వేస్తూనే, ఏడుస్తూనే చూపించడం ప్రేక్షకులకు భారంగా అనిపించింది. అస‌లు జానును ఆ ఆత్మ ఎందుకు వేధిస్తోంది? అది ఏమి చెప్పాల‌నుకుంటోంది? అన్న‌దానిపై కూడా దర్శకుడు సరైన స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు. ఇక సినిమాను ముగించిన తీరు కూడా ప్రేక్షకుల సహనానికి మరో పెద్ద పరీక్షగా అనిపిస్తుంది.

    టెక్నికల్‌గా..

    సాంకేతిక విషయాలకు వస్తే.. నేప‌థ్య సంగీతం సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. క‌థేమీ లేకున్నా ఆ సంగీత‌మే దీంట్లో ఏదో ఉందేమో అన్న అనుభూతిని అందిస్తుంది. ఛాయాగ్ర‌హ‌ణం బాగుంది. నిర్మాణ విలువ‌లు క‌థ‌కు త‌గ్గ‌ట్లుగా ఉన్నాయి.

    ప్లస్‌ పాయింట్స్‌

    • హన్సిక నటన
    • నేపథ్య సంగీతం

    మైనస్‌ పాయింట్స్‌

    • కథ, కథనం
    • సాగదీత సీన్లు
    • క్లైమాక్స్‌

    రేటింగ్‌: 2.5/5

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv