దేశంలోని నిరుద్యోగులకు భారత తపాల శాఖ (Indian Post Office) శుభవార్త చెప్పింది. దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 30,041 గ్రామీణ డాక్ సేవక్ (GDS), బ్రాంచ్‌పోస్టు మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ABPM) పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే పోస్టులకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి? తెలుగు రాష్ట్రాలకి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి? అభ్యర్థుల వయసు, విద్యార్హతల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
తెలుగు రాష్ట్రాల పోస్టులు
దేశ వ్యాప్తంగా ఉన్న 30,041 పోస్టుల్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో 1058 , తెలంగాణలో 961 వరకు ఖాళీలు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 23 లోపు అభ్యర్థులు ఆన్లైన్ లో indiapostgdsonline.gov.in వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆగస్ట్ 24 నుంచి ఆగస్ట్ 26 వరకు తమ అప్లికేషన్ లో తప్పొప్పులను సరి చేసుకునే అవకాశం ఉంటుంది.
విద్యార్హత
ఈ ఉద్యోగాలకు అప్లై చేసేకొనే వాళ్ళు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి పాసై ఉండాలి. అప్పుడు మాత్రమే వారు ఈ ఉద్యోగాలకు అర్హులు అవుతారు. అయితే వారు 10వ తరగతిలో గణితం, ఇంగ్లీష్, స్థానిక భాష కచ్చితంగా చదివి ఉండాలి. ఈ పోస్ట్‌లకు అప్లై చేయడానికి అభ్యర్థుల వయస్సు 18 – 40 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులు రూ.100 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ట్రాన్స్ వుమన్, దివ్యాంగులకు దరఖాస్తు రుసుం మినహాయింపు ఉంటుంది. ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
జీత భత్యాలు
ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి పోస్టుల వారీగా జీతభత్యాలను అందిస్తారు. BPM పోస్టులకు నెలకు రూ.12,000ల నుంచి రూ.29,380ల జీతంగా చెల్లిస్తారు. ABPM పోస్టులకు రూ.10,000ల నుంచి రూ.24,470ల జీతంగా అందజేస్తారు. ల్యాప్‌టాప్/ కంప్యూటర్/ స్మార్ట్ ఫోన్ లాంటివి తపాలా శాఖ సమకూరుస్తుంది. ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకుకు సంబంధించిన సేవలకు గానూ ప్రత్యేకంగా ఇన్సెంటివ్ అందజేస్తారు.
Celebrities Featured Articles Telugu Movies
Game Changer: ‘మేము మూలాలు మర్చిపోలే’.. బన్నీకి పవన్ చురకలు?