దేశీయ ఆటోమొబైల్ కంపెనీ బజాజ్ ఆటో (Bajaj auto), బ్రిటీష్ మోటార్ సైకిల్ బ్రాండ్ ట్రయంఫ్ (Triumph) కలిసి గత నెలలో స్పీడ్ 400 పేరిట ఓ బైక్‌ను లాంచ్ చేశాయి. ఆ సమయంలోనే స్క్రాంబ్లర్ 400X (Scrambler 400X) పేరిట మరో బైక్‌ను తీసుకురానున్నట్లు ప్రకటించాయి. తాజాగా ఆయా సంస్థలు స్క్రాంబ్లర్ 400X బైక్‌ను సంయుక్తంగా లాంచ్ చేశాయి. దేశవ్యాప్తంగా ఉన్న ట్రయంఫ్ డీలర్షిప్ కేంద్రాల్లో వీటిని విక్రయించనున్నారు. ఈ బైక్‌ను బజాజ్ చకన్ ప్లాంట్-2లో తయారుచేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇంతకీ ఈ బైక్ ప్రత్యేకతలు ఏంటి? ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? వంటి విశేషాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
పవర్ఫుల్ ఇంజిన్
ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400X బైక్.. 398 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్ ఇంజిన్‌తో వస్తోంది. ఇది 8000 ఆర్పీఎం వద్ద 40 హెచ్‌పీ పవర్‌ను, 6500 ఆర్పీఎం వద్ద 37.5ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ట్యాంక్ & మైలేజ్
ఈ బైక్.. 13 లీటర్ల సామర్థ్యమున్న ఫ్యుయల్ ట్యాంక్‌ను కలిగి ఉంది. లీటర్‌కు 28.3 కిలో మీటర్ల దూరం ఈ బైక్ ప్రయాణిస్తుందని తయారీ సంస్థ స్పెసిఫికేషన్స్‌లో పేర్కొంది.
LED లైట్స్
ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400X బైక్‌ను పూర్తి LED మయం చేశారు. హెడ్‌లైట్స్, ఇండికేటర్లు, టెయిల్ లైట్స్ అన్నీ ఎల్ఈడీతో వస్తున్నాయి. ఈ బైక్‌కు సిక్స్ గేర్ బాక్స్‌ను కలిగి ఉంది.
ఛార్జింగ్ పోర్ట్
ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400X బైక్‌లో సెమీ డిజిటల్ ఇన్సుస్ట్రుమెంటల్ క్లస్టర్ ఇచ్చారు. అలాగే ట్రాక్షన్ కంట్రోల్, డ్యూయల్ ఛానెల్ ఏబీఎస్, టార్క్ అసిస్ట్ క్లచ్, యూఎస్బీ టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
పవర్ఫుల్ టైర్స్
బైక్ ముందువైపు 19 అంగుళాల అల్లాయ్ వీల్ టైర్‌ను ఫిక్స్ చేశారు. వెనుక వైపు 17 అంగుళాల అల్లాయ్ వీల్ అమర్చారు. ఇవి రోడ్డుపై గ్రిప్ కలిగి ఉండటమే కాకుండా వేగంగా వెళ్లేందుకు సహాయపడతాయి. ఈ బైక్ బరువు 179 కిలోలు.
బైక్ కలర్
ఈ నయా బైక్ మూడు కలర్ ఆప్షన్స్‌లో మార్కెట్లోకి వచ్చింది. గ్రీన్/వైట్ (Green/Wight), రెడ్/బ్లాక్ (Red/Black), బ్లాక్/ సిల్వర్ (Black/Silver) రంగుల్లో మీకు నచ్చిన దానిని ఎంచుకోవచ్చు.
ధర ఎంతంటే?
ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400X బైక్ ధరను రూ.2.63 లక్షలు (ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించారు. ఈ బైక్‌కు సంబంధించిన ప్రీ బుకింగ్స్ దేశంలో ఇప్పటికే ప్రారంభమయ్యాయి. బుకింగ్స్ కోసం రూ.10 వేలు చెల్లించాల్సి ఉంటుంది.
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి