తైవాన్‌కు చెందిన ప్రముఖ హార్డ్‌వేర్, ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ఏసర్ (Acer) ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోకి అడుగు పెట్టింది. భారతీయ మార్కెట్లో తన మొదటి ఈ-స్కూటర్‌ను (Electric Scooter) విడుదల చేసింది. MUVI 125 4G పేరుతో ఈ నయా ఈవీని ఏసర్ పరిచయం చేసింది. ఈ స్కూటర్‌ను అడ్వాన్స్డ్ టెక్నాలజీతో రూపొందించినట్లు లాంచింగ్ సందర్భంగా కంపెనీ తెలిపింది. ద్విచక్ర వాహన ప్రియులను ఆకట్టుకునే ఫీచర్లు ఇందులో ఉన్నట్లు పేర్కొంది. మరి MUVI 125 4G బైక్ ప్రత్యేకతలు ఏంటీ? ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? ధర, బ్యాటరీ సామర్థ్యం వంటి విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
మేకిన్ ఇండియా బైక్
MUVI 125 4G స్కూటర్ తయారీ కోసం భారత్ అర్బన్ మొబిలిటీ స్టార్టప్ ‘థింక్ ఈబైక్‌గో’ (Think eBikeGo)తో ఏసర్ (Acer) జాయింట్ వెంచర్ ప్రారంభించింది. స్కూటర్ డిజైన్ రూపకల్పన, తయారీ బాధ్యతను థింక్ ఈబైక్‌గో (Think eBikeGo) చేపట్టింది.
గరిష్ఠ వేగం
ఏసర్ ఎంయూవీఐ 125 4జీ (Acer MUVI 125 4G) ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా గంటకు 75 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. రోజువారీగా ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, కళాశాల విద్యార్థులు, సిటీ లేదా నగరం పరిధిలో ప్రయాణం చేసే వారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.
బ్యాటరీ సామర్థ్యం
సింగిల్ చార్జింగ్‌తో ఈ బైక్‌పై 80 కి.మీ. దూరం ప్రయాణించవచ్చని కంపెనీ స్పెసిఫికేషన్స్‌లో తెలిపింది. స్వాపబుల్ బ్యాటరీ ఫెసిలిటీతో తేలిగ్గా చార్జింగ్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది.
అడ్వాన్స్డ్ ఫీచర్లు
ఈ స్కూటర్లో బ్లూటూత్ ఎనేబుల్ 4 అంగుళాల ఎల్సీడీ స్క్రీన్ విత్ త్రీ కాన్ఫిగరేషన్స్ ఫిక్స్ చేశారు. ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ బేస్డ్ స్మార్ట్ ఫోన్లతో ఎల్సీడీ స్క్రీన్‌ను కనెక్ట్ చేసుకోవచ్చు.
బైక్ డిజైన్
స్కూటర్ ముందు భాగంలో రౌండ్ షేప్డ్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, 16 అంగుళాల 7 స్పోక్ అల్లాయ్ వీల్స్, కంఫర్టబుల్ రైడింగ్ కోసం ఫ్రంట్‌లో టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక భాగంలో మోనోషాక్ అబ్జార్బర్‌ను బైక్‌కు అందించారు.
ఆకర్షణీయమైన కలర్స్
MUVI 125 4G స్కూటర్.. మెుత్తం మూడు రంగుల్లో అందుబాటులోకి రానుంది. పొలార్ వైట్, కార్బన్ బ్లాక్, గ్లాసియర్ సిల్వర్ కలర్స్‌లో మీకు నచ్చిన దానిని ఎంపిక చేసుకోవచ్చు.
ధర ఎంతంటే?
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరను రూ.99,999 (ఎక్స్ షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. త్వరలోనే ప్రీ-బుకింగ్స్ కూడా ప్రారంభం అవుతాయి. రూ.999 చెల్లించి ఎంయూవీఐ 125 4జీ (MUVI 125 4G) స్కూటర్ బుక్ చేసుకోవచ్చు.
Celebrities Featured Articles Telugu Movies
Game Changer: ‘మేము మూలాలు మర్చిపోలే’.. బన్నీకి పవన్ చురకలు?