‘పుష్ప’ (Pushpa) సినిమాతో జాతీయ ఉత్తమ నటుడిగా ఐకాన్ స్టార్ ‘అల్లు అర్జున్’ (Allu Arjun) సత్తా చాటాడు. ఈ క్రమంలోనే తాజాగా మరో అరుదైన గౌరవాన్ని బన్నీ దక్కించుకున్నాడు.
ప్రతిష్ఠాత్మకంగా భావించే బెర్లిన్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో (74th Berlin International Film Festival) భారతీయ సినిమా తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశం బన్నీని వరించింది.
జర్మనీలోని బెర్లిన్‌లో గురువారం (ఫిబ్రవరి 15) నుంచి మొదలైన ఈ 74వ బెర్లిన్ చిత్రోత్సవాలు ఈ నెల 25వరకు జరగనున్నాయి. ఇందులో పాల్గొనేందుకు అల్లు అర్జున్ గురువారమే జర్మనీకి బయలుదేరారు.
ప్రస్తుతం జర్మనీలో ఉన్న బన్నీ (#AlluArjun).. అక్కడ బెర్లిన్ చిత్రోత్సవాల్లో పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
కాగా, ఈ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో అల్లు అర్జున్ నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ ‘పుప్ప: ది రైజ్’ (Pushpa: The Rise – Part 1)ని ప్రత్యేకంగా ప్రదర్శించారు.
ఈ పర్యటనలో భాగంగా ఇంటర్నేషనల్ దర్శకులు, చిత్ర నిర్మాతలు, పలువురు అంతర్జాతీయ సినీ దిగ్గజాలతో బన్నీ (#AlluArjun) మాట్లాడనున్నాడు.
పుష్ప సినిమాతో జాతీయ స్థాయిలో తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించిన బన్నీ (#AlluArjun).. బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ ద్వారా భారతీయ సినిమా గొప్పతనాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాడు.
మరోవైపు బెర్లిన్ ఎయిర్‌పోర్టు బయట బన్నీ ఎంతో స్టైలిష్‌గా కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సైతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ ఫొటోల్లో అల్లు అర్జున్ బ్లాక్ అండ్ బ్లాక్ లుక్‌తో హ్యాండ్సమ్గా కనిపించాడు. తలపైన టోపీతో లాంగ్ హెయిర్‌తో హాలీవుడ్ హీరోను తలపించాడు.
అంతర్జాతీయ ఫిల్మ్ వేడుకల్లో పాల్గొన్న బన్నీని చూసి ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. తొలి పార్ట్ కంటే రాబోయే ‘పుష్ప 2’ మరింత సక్సెస్ అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ‘పుష్ప’ చిత్రం ఇండియాలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో సినీ ప్రేక్షకుల్ని అలరించింది. రష్యా, అమెరికా, గల్ఫ్ దేశాలు, ఆస్ట్రేలియా, యూకేతో పాటు ఇతర దేశాల్లోనూ సూపర్ హిట్ అయ్యింది.
ఇక ఈ ఉత్సాహంతో ‘పుష్ప 2’ను అంతకు మించి తెరకెక్కిస్తున్నారు టీమ్. ఈసినిమా కోసం అల్లు అర్జున్ చాలా కష్టపడుతున్నాడు.
‘పుష్ప-2: ది రూల్’ (Pushpa 2: The Rule) మూవీ ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీస్’ ఈ మధ్యే అధికారికంగా ప్రకటించింది.
200 రోజుల్లో పుష్ప రాజ్ పాలన ఆరంభం అని ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ కూడా ఇటీవల మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. ఆ ఫొటో ఫ్యాన్స్ విపరీతంగా ఆకట్టుకుంది.
ఇక టాలీవుడ్ లెక్కల మాస్టారు.. జీనియస్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్‌తో పాటు రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Celebrities Featured Articles Telugu Movies
Game Changer: ‘మేము మూలాలు మర్చిపోలే’.. బన్నీకి పవన్ చురకలు?