పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘ఓజీ’ (OG). ప్రభాస్‌తో సాహో తీసిన డైరెక్టర్ సుజిత్.. ఎపిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో పవన్ సరసన ప్రియాంక మోహన్ (Priyanka Mohan) హీరోయిన్గా నటిస్తోంది. అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రీయారెడ్డి, హరిశ్ ఉత్తమన్, అభిమన్యు సింగ్ కీరోల్స్ చేస్తున్నారు. థమన్ ఈ మూవీకి సంగీతం అందిస్తుండగా.. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ మూవీని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా స్టోరీ లీకైనట్లు తెలుస్తోంది. ‘ఓజీ’ (OG Movie Story) కథ ఇదేనంటూ ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
ఓజీ కథ ఇదేనా! (Is this the story of OG)?
ఓజీ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రీసెంట్గా రిలీజ్ డేట్ అప్డేట్ కూడా రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ క్రమంలో సినిమా స్టోరీలైన్ అంటూ ఓ కథ నెట్టింట హల్చల్ చేస్తోంది. ‘ముంబయిలో పదేళ్ల క్రితం గ్యాంగ్‌స్టర్ గ్రూప్స్ అందరికీ బాస్ అయినటువంటి ఓజాస్ గంభీర సడెన్‌గా మాయం అవుతాడు. తన శత్రు మూకలపై రివేంజ్ తీర్చుకోవడానికి మళ్లీ తిరిగి వస్తాడు’ అన్నది కథ సారాంశం. దీంతో ఈ మూలకథ సినీ వర్గాల్లో వైరల్‌గా మారింది. అయితే ఈ ఓజీ ఫస్ట్ గ్లింప్స్‌తోనే డైరెక్టర్ సుజీత్ కథ బ్యాక్‌డ్రాప్‌ను రివీల్ చేశాడు. ‘పవన్ ఒక గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తాడని అజ్ఞాతంలో ఉన్న అతడు మళ్ళీ వచ్చాడు’ అన్నట్టు చూపించారు.
సుజీత్ ‘డీపీ’ వైరల్
ఓజీ సినిమా దర్శకుడు సుజీత్ ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో డీపీని మార్చారు. ముఖాలు కనిపించని ఇద్దరు వ్యక్తులు ఆ డీపీలో ఉన్నారు. ఆ ఇద్దరిలో ఒకరు ‘ఓజీ’ (పవన్ కల్యాణ్) కాగా, మరొకరు డైరెక్టర్ సుజీత్. పోస్టు చేసిన కొద్దిసేపటికే ఈ చిత్రం వైరల్‌గా మారింది. ఈ ఫొటోను చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ‘తన ఓజీతో సుజీత్’ (Sujeeth) అని కామెంట్స్ చేస్తున్నారు. ‘వైరల్ అవ్వడానికి ఫేసే కనిపించాలా ఏంటి? కటౌట్ ఉంటే చాలు’ అని అంటున్నారు. కంటెంట్ ఉన్నోడికి కటౌట్ సరిపోతుందని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.
విలన్‌గా బాలీవుడ్ స్టార్
బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) ‘ఓజీ’ సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు. సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’లో విలన్‌గా మెప్పించిన ఇమ్రాన్.. ఓజీలోనూ నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో ఇమ్రాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓజీలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని.. బాలీవుడ్‌తో పోలిస్తే దక్షిణాది దర్శక నిర్మాతలు చాలా ముందున్నారని వ్యాఖ్యానించారు. చాలా క్రమ శిక్షణతో పనిచేస్తారన్నాడు. అందుకే సౌత్ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయని చెప్పాడు.
ఓజీపై శ్రియారెడ్డి హైప్
సలార్ సినిమాలో కీలక పాత్ర పోషించిన నటి శ్రియా రెడ్డి (Shriya Reddy) ఓజీ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇటీవల ఓ ఇంటర్యూలో మాట్లాడిన ఆమె.. సలార్ కంటే ఓజీ ప్రపంచం చాలా పెద్దదని వ్యాఖ్యానించింది. ఓజీలో తానది నెగిటివ్ పాత్ర కాదని.. సినిమాలో తాను పోషిస్తున్న పాత్ర చాలా పెద్దదని చెప్పింది. ఓజీలో తన పాత్ర చూసిన తర్వాత సలార్‌లో తన రోల్ చాలా చిన్నదిగా అనిపిస్తుందని తెలిపింది. ఓజీ మూవీలోని క్యారెక్టర్ లైఫ్ లాంగ్ తనకు గుర్తింపు తీసుకొచ్చి పెడుతుందని చెప్పుకొచ్చింది.
Celebrities Featured Articles Telugu Movies
Game Changer: ‘మేము మూలాలు మర్చిపోలే’.. బన్నీకి పవన్ చురకలు?