టాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన అగ్రకథానాయకులు ఎన్టీఆర్ (NTR), హృతిక్ రోషన్ (Hrithik Roshan) కలిసి నటిస్తోన్న చిత్రం ‘వార్ 2’ (War 2). అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని యశ్‌రాజ్ స్పై యూనివర్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రంపై దేశంలోని సగటు అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్న ఈ సినిమా అప్‌డేట్ కోసం సినీప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమా కథ ఇదేనంటూ ఓ ప్లాట్ (War 2 Movie Story Leak) నెట్టింట చక్కర్లు కొడుతోంది. మరోవైపు తారక్ షూటింగ్‌కు సంబంధించి కూడా ఓ అప్‌డేట్ బయటకొచ్చింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
‘వార్ 2’ కథ అదేనా?
2019లో వచ్చిన బాలీవుడ్ చిత్రం ‘వార్’ (War)కు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. గతంలో హృతిక్‌కు కోస్టార్‌గా యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) నటించగా.. పార్ట్ 2లో తారక్ కనిపించబోతున్నాడు. లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ సినిమా కథ ఇదేనంటూ నెట్టింట ఓ ప్లాట్ వైరల్ అవుతోంది. దాని ప్రకారం ‘వార్ 2’ అనేది ఇద్దరు స్నేహితుల కథ. అర్జునుడు – కృష్ణుడిలా కలిసి మెలిసి ఉండే ఇద్దరు స్నేహితులు.. చివరికీ శత్రువులుగా మారితే ఎలా ఉంటుంది? అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా రానుందట. అయితే దీనిపై చిత్ర యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇదిలా ఉంటే ఇందులో తారక్, హృతిక్ మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్ నెవర్ బీఫోర్‌గా ఉంటాయని బాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
తారక్ షూట్ హైదరాబాద్‌లోనే!
‘వార్ 2’లో హృతిక్ రోషన్ పాత్రకు సంబంధించి కొన్ని యాక్షన్స్ సీక్వెన్స్‌ను ఇటీవల తెరకెక్కించారు. సినిమాకు సంబంధించిన గత షెడ్యూల్‌లో వీటిని ఫినిష్ చేశారు. ప్రస్తుతం తారక్ రోల్‌కు సంబంధించిన యాక్షన్ సీన్స్‌ను తెరకెక్కించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ఈసారి షెడ్యూల్‌లో ఎన్టీఆర్ కూడా పాల్గొంటారని బాలీవుడ్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచే తారక్‌కు సంబంధించిన షూటింగ్ మెుదలయ్యే అవకాశముందని సమాచారం. అది కూడా హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ షెడ్యూల్ జరగనుందని తెలుస్తోంది. మరి ఈ షూటింగ్‌లో ఎన్టీఆర్ ఏ రేంజ్ నటనతో ఆకట్టుకుంటాడో చూడాలి.
మ్యూజిక్ డైరెక్టర్ అతడే?
‘వార్ 2’ చిత్రానికి సంబంధించి (War 2 Movie Story Leak) మరో వార్త కూడా తెరపైకి వచ్చింది. ఈ మూవీకి బాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్ స్వరాలు అందించనున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందట. సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చే సంగీత దర్శకుడిగా ప్రీతమ్‌కు బాలీవుడ్‌లో పేరుంది. ఆయన కూడా ఈ చిత్రంలో భాగమైతే సినిమాపై అంచనాలు మరింత పెరగనున్నాయి. ఇకపోతే ఈ మూవీలో హృతిక్ రోషన్ పోషించబోయే పాత్ర పేరు కబీర్ అని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల ‘వార్ 2’ను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
‘వార్ 2’లో మరో స్టార్ హీరో!
ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం (John Abraham) నటించనున్నారు. ఇతడిది కూడా ప్రతినాయకుడి పాత్రేనని అంటున్నారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. హృతిక్ రోషన్‌కు జోడీగా కియారా అద్వానీ (Kiara Advani) కనిపించనుంది. కానీ, ఎన్టీఆర్‌కి జోడీగా చేయబోయే హీరోయిన్ గురించి ఇంకా క్లారిటీ రాలేదు. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం