• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Maruthi Nagar Subramanyam Review: మధ్య వయస్కుడి నిరుద్యోగ  కష్టాలను కళ్లకు కట్టిన ‘మారుతీనగర్‌ సుబ్రమణ్యం’.. సినిమా ఎలా ఉందంటే?

    న‌టీన‌టులు: రావు రమేష్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్, అజయ్, అన్నపూర్ణమ్మ, ప్రవీణ్ త‌దిత‌రులు

    ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: లక్ష్మణ్ కార్య

    సంగీతం : కళ్యాణ్‌ నాయక్‌

    సినిమాటోగ్రఫీ : ఎం.ఎన్‌. బాల్‌రెడ్డి

    ఎడిటర్‌ : బొంతల నాగేశ్వర రెడ్డి

    సమర్పణ: తబితా సుకుమార్

    సహ నిర్మాతలు: రుషి మర్ల, శివప్రసాద్ మర్ల

    నిర్మాణం: బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య

    విడుదల తేదీ : 23-08-2024

    రావు రమేష్‌ (Rao Ramesh) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మారుతీనగర్‌ సుబ్రమణ్యం’ (Maruti Nagar Subramanyam Review). లక్ష్మణ్‌ కార్య దర్శకుడు. ఇంద్రజ, అంకిత్‌ కొయ్య, రమ్య పసుపులేటి ముఖ్య కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు సుకుమార్ భార్య తబిత సుకుమార్‌ సమర్పించారు. ప్రచార కార్యక్రమాల్లో అల్లు అర్జున్‌ హాజరు కావడంతో ప్రేక్షకుల దృష్టిని ఈ మూవీ ప్రముఖంగా ఆకర్షించింది. మరి ఈ సినిమా ఎలా ఉంది. ప్రేక్షకులకు వినోదాన్ని పంచిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. 

    కథేంటి

    మారుతీనగర్‌కి చెందిన సుబ్రమణ్యం (రావు రమేశ్) 1998లో టీచర్ ఉద్యోగానికి సెలెక్ట్ అవుతాడు. కానీ కోర్టు స్టే వల్ల అది అలా హోల్డ్‌లో ఉండి పోతుంది. చేస్తే గవర్నమెంట్ ఉద్యోగమే చేయాలని అప్పటినుంచి మరో పనిచేయకుండా ఖాళీగానే ఉంటాడు. భార్య కళారాణి (ఇంద్రజ) గవర్నమెంట్ ఆఫీసులో క్లర్క్‌గా చేస్తుంటుంది. వీళ్లకో కొడుకు అర్జున్ (అంకిత్ కొయ్య) ఉంటాడు. అర్జున్‌ తొలి చూపులోని కాంచన (రమ్య పసుపులేటి)తో ప్రేమలో పడతాడు. కష్టాల నడుమ జీవిస్తున్న సుబ్రమణ్యం జీవితంలోకి ఓ రోజు అనూహ్యంగా రూ.10 లక్షలు వచ్చి పడతాయి. ఇంతకీ వీటిని ఎవరు వేశారు? సుబ్రమణ్యంకు గవర్నమెంట్‌ జాబ్‌ వచ్చిందా? రాలేదా? కొడుకు ప్రేమను గెలిపించేందుకు అతడు ఏం చేశాడు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

    ఎవరెలా చేశారంటే

    రావు రమేశ్ నటన గురించి కొత్తగా చెప్పడానికేం లేదు. ఎప్పటిలానే సుబ్రమణ్యం పాత్రలో ఆయన చక్కగా ఒదిగిపోయాడు. తన అనుభవాన్నంతా రంగరించి ఆద్యంతం అలరించారు. అతడి కొడుకుగా చేసిన అంకిత్ బాగానే ఆకట్టుకున్నాడు. గతవారం ‘ఆయ్’తో ఇప్పుడు ఈ సినిమాతో మెప్పించాడు. అల్లు అరవింద్‌ కుమారుడినంటూ అతడు చేసే హంగామా నవ్వులు పూయిస్తుంది. ఇక కాంచన పాత్ర చేసిన రమ్య పసుపులేటికి నటన పరంగా పెద్దగా స్కోప్‌ లేదు. అయితే గ్లామర్‌ పరంగా ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇంద్రజ పాత్ర కూడా పరిమితంగానే ఉంది. స్టార్టింగ్‌లో ఎమోషనల్ అవ్వడం, చివర్లో డ్యాన్స్ చేయడం తప్పితే పెద్దగా స్కోప్ దొరకలేదు. మిగిలిన పాత్రల్లో ప్రవీణ్, హర్షవర్ధన్, అన్నపూర్ణమ్మ తదితరులు పర్వాలేదనిపించారు. 

    డైరెక్షన్ ఎలా ఉందంటే

    మధ్య తరగతికి చెందిన ఓ మధ్య వయస్కుడి నిరుద్యోగ కష్టాల చుట్టూ దర్శకుడు లక్ష్మణ్‌ కార్య కథను నడిపించారు. సహజత్వంతో కూడిన సన్నివేశాలకు హాస్యాన్ని జోడించి అతడు చేసిన ప్రయత్నం మెప్పిస్తుంది. అప్పటివరకూ భార్య సంపాదనపై ఆధారపడ్డ సుబ్రమణ్యం అకౌంట్‌లో డబ్బు పడంగానే ఒక్కసారిగా మారిపోయిన వైనం, ఆ తర్వాత చేసే హంగామా హైలెట్‌గా నిలుస్తుంది. ఇక డబ్బు ఖర్చు చేశాక వచ్చే కష్టాల చుట్టూ ద్వితీయ భాగాన్ని నడిపించాడు దర్శకుడు. కథనం ఊహకందేలా సాగినప్పటికీ రావు రమేష్‌ టైమింగ్‌, హాస్యం ఈ చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాయి. పతాక సన్నివేశాల్లో వచ్చే మలుపు మూవీని మరింత ఆసక్తికరంగా మార్చింది. అయితే అంకిత్‌ లవ్‌ ట్రాక్‌, లాజిక్‌కు అందని సన్నివేశాలు, అక్కడక్కడా పండని కామెడీ సీన్స్‌ మైనస్‌లుగా చెప్పుకోవచ్చు. 

    టెక్నికల్‌గా..

    సాంకేతిక అంశాల విషయానికి వస్తే ప్రతీ విభాగం మంచి పనితీరు కనబరిచింది. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ చాలా కలర్‌పుల్‌గా ఉంది. పాటలు కూడా వినడానికి బాగున్నాయి. నేపథ్య సంగీతం సన్నివేశాలను బాగా ఎలివేట్‌ చేసింది. ఎడిటింగ్‌ కూడా ఓకే. నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి. 

    ప్లస్ పాయింట్స్‌

    • రావు రమేష్‌ నటన
    • కామెడీ
    • క్లైమాక్స్‌

    మైనస్‌ పాయింట్‌

    • అంకిత్‌ లవ్‌ ట్రాక్‌
    • ఊహాకు అందేలా సాగే కథనం

    Telugu.yousay.tv Rating : 3/5  

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv