అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2’ చిత్రం థియేటర్లను షేక్ చేస్తోంది. విడుదలైన అన్ని చోట్ల బ్లాక్ బాస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. సినిమా చూసిన వారంతా అల్లు అర్జున్ నటనకు ఫిదా అవుతున్నారు. దీంతో నార్త్, సౌత్, ఓవర్సీస్ అన్న తేడా లేకుండా అన్ని చోట్ల కాసుల వర్షం కురుస్తోంది. తొలి రోజే ఇండియన్ సినిమా చరిత్రను తిరిగరాసిన పుష్ప రాజ్ వీకెండ్ పూర్తయ్యేసరికి మరిన్ని రికార్డులను కొల్లగొట్టాడు. బాక్సాఫీస్ (Pushpa 2 Day5 Box Office Collections) వద్ద ఊచకోత సృష్టించాడు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
రూ.800 కోట్ల క్లబ్లో
అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన ‘పుష్ప 2’ చిత్రం డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా 12,500 పైగా థియేటర్లలో విడుదలైంది. తొలి రోజు నుంచి రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది. వీకెండ్ పూర్తయ్యే సరికి తొలి నాలుగు రోజుల్లో (Pushpa 2 Box Office Collections) ఈ చిత్రం రూ. వరల్డ్ వైడ్‌గా రూ.829 కోట్ల గ్రాస్ సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అత్యంత వేగంగా రూ.800 కోట్ల క్లబ్లో చేరిన ఫస్ట్ ఇండియన్ సినిమాగా చరిత్ర సృష్టించిందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి స్పెషల్ పోస్టర్‌ను సైతం విడుదల చేశారు. కాగా, ఈ చిత్రం తొలి రోజు రూ. 282.91 కోట్లు, రెండో రోజు రూ.134.63 కోట్లు, మూడో రోజు రూ.159.25 కోట్లు, నాల్గో రోజు రూ.204.52 కోట్లు తన ఖాతాలో వేసుకుందని ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. థియేటర్లలో పుష్పరాజ్ దూకుడు చూస్తుంటే కలెక్షన్స్ పరంగా మరిన్ని రికార్డులు బద్దలు కావడం ఖాయమని పేర్కొన్నాయి.
హిందీలో రికార్డుల పరంపర
బాలీవుడ్ ప్రేక్షకులు ‘పుష్ప 2’ (Pushpa 2 day 5 Box Office Collections) చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. నార్త్‌లో తొలి రోజు నుంచి కాసుల వర్షం కుపిరిస్తున్నారు. అక్కడ ఫస్ట్ డే రోజున రూ.72 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టి ‘పుష్ప 2’ ఈ ఘనత సాధించిన తొలి చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ క్రమంలో నాల్గో రోజైన ఆదివారం (డిసెంబర్ 8) ఏకంగా రూ.86 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించి అక్కడ ఒక రోజులో అత్యధిక వసూళ్లు సాధించిన ఫస్ట్ ఇండియన్ మూవీగా కొత్త చరిత్ర సృష్టించింది. ఓవరాల్‌గా హిందీలో వీకెండ్ పూర్తయ్యే సరికి రూ. 291 కోట్ల నెట్ కలెక్షన్స్‌ను ‘పుష్ప 2’ తన ఖాతాలో వేసుకుంది. తొలి రోజు రూ.72 కోట్లు, రెండో రోజు రూ.59 కోట్లు, మూడో రోజు రూ.74 కోట్ల నెట్ వసూళ్లను పుష్ప 2 రాబట్టినట్లు మేకర్స్ అఫిషియల్‌గా ప్రకటించారు. ఇది ఆల్ టైమ్ రికార్డు అంటూ స్పష్టం చేశారు.
రేపే రూ.1000 కోట్ల క్లబ్‌లోకి?
‘పుష్ప 2’ రూ.1000 కోట్ల క్లబ్ (Pushpa 2 Box Office Collections)లో చేరేందుకు రూ.171 కోట్లు మాత్రమే మిగిలి ఉంది. బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ దూకుడు చూస్తుంటే రేపే రూ.1000 కోట్ల క్లబ్లో చేరే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. వీకెండ్ అయిపోయిన నేపథ్యంలో ఒక వేళ కలెక్షన్స్ తగ్గినా ఎల్లుండి మాత్రం కచ్చితంగా రూ.1000 కోట్ల క్లబ్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే ఫాస్టెస్ట్ థౌజండ్ క్రోర్స్ (Fastest Rs.1000 Movie) సాధించిన చిత్రంగా ‘పుష్ప 2’ కొత్త చరిత్ర సృష్టించనుంది. ఒక సారి ఆ ఫీట్ సాధించాక ‘పుష్ప 2’ టార్గెట్ రూ.1500 కోట్ల మైలురాయిపై పడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఈ సినిమాలో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ విలన్‌గా చేశాడు. జగపతిబాబు, సునీల్, రావు రమేష్, అనసూయ ముఖ్య పాత్రల్లో మెరిశారు. ఈ సినిమాకు పార్ట్ 3 కూడా రానుంది.
కథేంటి
ఎర్రచందనం కూలీగా ప్రయాణం మెుదలుపెట్టిన పుష్పరాజ్ (అల్లు అర్జున్) స్మగ్లింగ్ సిండికేట్‌ను శాసించే నాయకుడిగా ఎదుగుతాడు. తన సిండికేట్ వ్యాపారాన్ని విదేశాలకు విస్తరిస్తాడు. అధికార పార్టీకి ఫండ్ ఇచ్చి రాజకీయాలను శాసించే స్థాయికి ఎదుగుతాడు. ఈ క్రమంలో ఎస్పీ భన్వర్‌సింగ్ షెకావత్ (ఫహాద్ ఫాజిల్)తో శత్రుత్వం కూడా పెరిగి పెద్దదవుతుంది. బయట ఎంత దూకుడుగా ఉన్నప్పటికీ పెళ్లాం శ్రీవల్లి (రష్మిక) మాట మాత్రం పుష్పరాజ్ జవదాటడు. ఓ రోజు ఎంపీ సిద్ధప్ప (రావు రామేష్)తో కలిసి సీఎంను కలవడానికి పుష్పరాజ్ బయలుదేరగా సీఎంతో ‘ఓ ఫొటో తీసుకొని రా’ అంటూ శ్రీవల్లి ఆశగా అడుగుతుంది. దీంతో సీఎంను ఫొటో అడిగ్గా అతడు పుష్పను హేళన చేస్తాడు. దీంతో ఎంపీ సిద్ధప్పను సీఎంని చేస్తానని సవాలు విసురుతాడు. అందుకోసం పుష్ప ఏం చేశాడు? కేంద్రమంత్రి వీర ప్రతాప్ రెడ్డి (జగపతిబాబు)తో వైరం ఏంటి? పుష్పను అడ్డుకునేందుకు ఎస్పీ షెకావత్ ఎలాంటి ప్లాన్స్ వేశాడు? శ్రీవల్లికి ఇచ్చిన మాటను పుష్ప నిలబెట్టుకున్నాడా? లేదా? అన్నది స్టోరీ.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!