• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Google Most Searched Movies 2024: టాప్ 10 చిత్రాల్లో 3 తెలుగు సినిమాలే.. ప్రభాస్ డబుల్ ధమాకా!

    గూగుల్ ట్రెండ్స్ ఈ ఏడాది అత్యధికంగా సెర్చ్‌ చేసిన టాప్‌ 10 భారతీయ సినిమాల జాబితాను తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషలకు చెందిన చిత్రాలు చోటు దక్కించుకున్నాయి. 

    Stree 2

    అత్యధికంగా సెర్చ్‌ చేసిన భారతీయ సినిమాల్లో బాలీవుడ్ మూవీ ‘స్త్రీ 2 మొదటి స్థానంలో నిలిచింది. ఈ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ₹600 కోట్లకు పైగా వసూలు చేసి భారీ విజయం సాధించింది. శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ హారర్ కామెడీ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

    ఇక స్త్రీ 2 సినిమా స్టోరీ విషయానికొస్తే… చందేరీ గ్రామంలో ‘స్త్రీ’ సమస్య తొలగింది అని అందరూ ఊపిరి పీల్చుకునేలోపు ‘సర్కట’తో కొత్త సమస్య మొదలవుతుంది. ఈ సమస్యను విక్కీ (రాజ్ కుమార్ రావు), రుద్ర (పంకజ్ త్రిపాఠి), జన (అభిషేక్ బెనర్జీ), బిట్టు (ఆపర్ శక్తి ఖురానా)తో కలిసి ఓ భూతం (శ్రద్ధా కపూర్) ఎలా ఎదుర్కొంది? అన్నది స్టోరీ.

    Kalki 2898 AD

    రెండో స్థానంలో నిలిచిన కల్కి 2898 AD’ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సైన్స్ ఫిక్షన్ మూవీ. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దీపికా పదుకోణే, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ వంటి ప్రముఖులు ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ₹1200 కోట్లకు పైగా వసూళ్లు చేసి పాన్ ఇండియా స్థాయిలో పెద్ద హిట్‌గా నిలిచింది.

    ఇక కల్కి స్టోరీ విషయానికొస్తే…కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడి చేత శాపం పొందిన అశ్వత్థామ (అమితాబ్‌బచ్చన్‌).. కల్కి ఆగమనం కోసం ఎదురుచూస్తుంటాడు. సుమతి (దీపికా పదుకొణె) అనే మహిళ కడుపున కల్కి జన్మిస్తాడని తెలిసి ఆమెకు రక్షణగా మారతాడు. కాశీలో నివసించే భైరవ (ప్రభాస్‌) స్వర్గాన్ని తలపించే కాంప్లెక్స్‌లోకి వెళ్లడానికి ప్రయత్నిస్తుంటాడు. సుమతిని పట్టిస్తే కాంప్లెస్‌ వెళ్లొచ్చని తెలుసుకుంటాడు. మరి భైరవ, అశ్వత్థామను ఎదిరించి సుమతిని తీసుకొచ్చాడా? సుప్రీమ్‌ యష్కిన్‌ (కమల్‌ హాసన్‌) పాత్ర ఏంటి? కురుక్షేత్ర యుద్ధంతో కలియుగం అంతం ఎలా ముడిపడి ఉంది? అన్నది కథ.

    12th Fail

    మూడో స్థానంలో ‘12వ ఫెయిల్‌’ నిలవడం విశేషం. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాలను దోచుకుని మంచి వసూళ్లు సాధించింది. స్ఫూర్తివంతమైన కథనం ఈ సినిమాను సూపర్ హిట్ చేసింది. 

    ఇక స్టోరీ విషయానికొస్తే…మనోజ్‌ కుమార్‌ అనే వ్యక్తి జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఒక గ్రామంలో ఉండే నిరుపేద యువకుడు 12వ తరగతి ఫెయిల్‌ అవుతాడు. కానీ పట్టుదలతో చదివి, దృఢ సంకల్పంతో ఐపీఎస్‌ అధికారి అవుతాడు. ఆ యువకుడు తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడన్న ఆసక్తికర కథతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు.

    Laapataa Ladies

    ఆస్కార్ రేసులో భారత్ నుంచి అధికారికంగా ఎంపికైన ‘లపాటా లేడీస్‌’ నాలుగో స్థానంలో ఉంది, ఇది మహిళల సెంట్రిక్ కథతో సక్సెస్‌ సాధించింది.

    Hanu-Man

    తెలుగు సినీ ప్రియులకు గర్వకారణంగా, హనుమాన్ ఐదో స్థానంలో నిలిచింది. తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం సంక్రాంతి బరిలో విడుదలై అనేక రికార్డులను తిరగరాసింది. ₹300 కోట్లకు పైగా వసూళ్లు చేసిన ఈ సూపర్ హీరో సినిమా, తెలుగు, హిందీ భాషల్లో కూడా ఘన విజయాన్ని అందుకుంది. 

    ఇక ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే…సౌరాష్ట్రలో ఉండే మైఖేల్‌ (వినయ్ రాయ్‌) చిన్నప్పటి నుంచి సూపర్‌ హీరో అవ్వాలని భావిస్తుంటాడు. ఇందుకు అడ్డు వస్తున్నారని తల్లిదండ్రులను కూడా మట్టు పెడతాడు. మరో పక్క అంజనాద్రి అనే గ్రామంలో దొంగతనాలు చేస్తూ కొంటె కుర్రాడిలా హనుమంతు (తేజ సజ్జ) తిరుగుతుంటాడు. కొన్ని పరిణామాల రీత్యా అతడు హనుమాన్ శక్తులని పొందుతాడు. ఈ శక్తి హనుమంతుకు ఎలా వచ్చింది? ఆ శక్తి భూమిపై ఎలా నిక్షిప్తం అయ్యింది? హనుమంతు పవర్స్‌ గురించి మైఖేల్ ఎలా తెలుసుకున్నాడు? మైఖేల్‌ నుంచి గ్రామస్తులకు ఏర్పడ్డ ముప్పును హనుంతు ఎలా తొలగించాడు? విభీషణుడు (సముద్రఖని), అంజమ్మ (వరలక్ష్మి) పాత్రల ప్రాధాన్యత ఏంటి? అన్నది కథ.

    Maharaja

    ఆరవ స్థానంలో విజయ్ సేతుపతి నటించిన తమిళ చిత్రం ‘మహారాజా, ఏడో స్థానంలో నిలిచింది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.

    ఇక ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే… మ‌హారాజా ఒక‌ ప్ర‌మాదంలో భార్య‌ను పోగొట్టుకొని ఊరి చివర కూతురితో జీవిస్తుంటాడు. ఒక రోజు మ‌హారాజా గాయాల‌తో పోలీస్‌స్టేష‌న్‌కు వెళ్తాడు. ఆగంత‌కులు త‌న ఇంట్లోకి చొర‌బ‌డి దాడి చేశార‌ని చెప్తాడు. త‌న బిడ్డను కాపాడిన ల‌క్ష్మిని ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేస్తాడు ఇంతకీ ఆ ల‌క్ష్మి ఎవ‌రు? మహారాజా కూతురికి జరిగిన అన్యాయం ఏంటి? విలన్లపై హీరో ఎలా రివేంజ్‌ తీర్చుకున్నాడు? అన్నది కథ.

    Manjummel Boys

    మలయాళ చిత్రం మంజుమ్మెల్ బాయ్స్‌’, ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఫ్రెండ్‌షిప్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయం సాధించింది.

    ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. కేర‌ళ‌ కొచ్చికి చెందిన కుట్ట‌న్, సుభాష్ స్నేహితులతో కలిసి కొడైకెనాల్ ట్రిప్‌లో భాగంగా గుణ కేవ్స్‌కు వెళ్తారు. అక్క‌డ సుభాష్ పొరపాటున 150 అడుగులకు పైగా లోతున్న డెవిల్స్ కిచెన్ లోయ‌లో ప‌డ‌తాడు. ఆ త‌ర్వాత ఏమైంది? పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వారికి ఎందుకు సహకరించలేదు? సుభాష్‌ను కాపాడి తీసుకురావ‌డానికి తోటి మిత్రులు ఏం చేశారు? అన్నది కథ.

    The Greatest of All Time

    తమిళ్ సూపర్ విజయ్ నటించిన గోట్‌  8వ స్థానంలో నిలిచింది. ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద విన్నర్‌గా నిలిచింది.

    ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే..గాంధీ (విజయ్) స్పెషల్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఆఫీసర్‌గా పనిచేస్తుంటాడు. ఓ మిషన్‌లో భాగంగా విదేశాలకు వెళ్లి కొడుకును పొగొట్టుకుంటాడు. దీంతో భార్య అను (స్నేహా) అతడ్ని దూరం పెడుతుంది. కొన్నేళ్ల తర్వాత మాస్కోకు వెళ్లిన గాంధీకి చనిపోయాడనుకుంటున్న కొడుకు జీవన్‌ (విజయ్‌) కనిపిస్తాడు. సంతోషంగా ఇంటికి తీసుకొస్తాడు. అప్పటినుంచి గాంధీకి సంబంధించిన వారు ఒక్కొక్కరుగా చనిపోతుంటారు. ఈ హత్యలకు కారణం ఎవరు? చనిపోయిన జీవన్‌ ఎలా తిరిగొచ్చాడు? అన్నది స్టోరీ.

    Salaar

    ప్రభాస్‌ నటించిన ‘సలార్‌’ తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఈ చిత్రం కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చి భారీ విజయం సాధించింది. 

    ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే………ఖాన్సార్‌ సామ్రాజ్యానికి రాజ మ‌న్నార్ (జ‌గ‌ప‌తిబాబు) రూలర్‌. సామ్రాజ్యంలోని ప్రాంతాలను దొరలు పాలిస్తుంటారు. ఖాన్సార్‌ పీఠం కోసం రాజ మన్నార్‌ను దొరలు సొంతంగా సైన్యం ఏర్పాటు చేసుకొని హత్య చేస్తారు. తండ్రి కోరిక మేరకు వ‌ర‌ద రాజమ‌న్నార్ (పృథ్వీరాజ్ సుకుమార‌న్‌) ఖాన్సార్‌కు రూలర్‌ అవ్వాలని భావిస్తాడు. ఇందుకోసం చిన్ననాటి స్నేహితుడు దేవా (ప్ర‌భాస్‌) సాయం కోరతాడు. ఆ ఒక్క‌డు అంత‌మంది దొరల సైన్యాన్ని ఎలా ఎదిరించాడు? అన్నది స్టోరీ.

    Aavesham

     మలయాళం నుంచి ఫహాద్ ఫాజిల్ నటించిన ‘ఆవేశం’ పదవ స్థానంలో నిలిచింది. ఈ చిత్రం మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలోని పలు సన్నివేశాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

    కల్కి 2898 AD మరియు హనుమాన్ వంటి తెలుగు చిత్రాలు టాప్‌ 10లో చోటు దక్కించుకోవడం ఆశ్చర్యకరం కాదు. ఈ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో సృష్టించిన హైప్‌ అలాంటిది. హనుమాన్ సంక్రాంతి సమయంలో విడుదలై పాత రికార్డులన్నీ బ్రేక్ చేస్తూ ₹300 కోట్లకు పైగా వసూలు చేసింది.

    మొత్తంగా గూగుల్ ట్రెండ్స్ జాబితాలో ఈ ఏడాది మూడు తెలుగు సినిమాలు, మూడు హిందీ చిత్రాలు, రెండు తమిళ సినిమాలు, రెండు మలయాళ చిత్రాలు చోటు దక్కించుకున్నాయి. 2024 సంవత్సరానికి మరింత ఆసక్తికరమైన సినిమాల జాబితా ప్రేక్షకులను ఆకర్షిస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv