యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరు డేటింగ్, డిన్నర్లు అంటూ తెగ తిరిగేస్తున్నారని పెద్ద ఎత్తువ కథనాలు సైతం వచ్చాయి. తాము కేవలం స్నేహితులమని ఇద్దరూ చెప్పినా తరచూ టూర్లు, రెస్టారెంట్స్‌లో దర్శనమివ్వడంతో ఎవరూ నమ్మడం లేదు. ఈ క్రమంలో తాజాగా నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ మాట్లాడారు. లవ్, డేటింగ్ అంటూ జరుగుతున్న ప్రచారాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘ఆ రోజున బయటపెడతా’
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పీకల్లోతూ ప్రేమలో ఉన్నట్లు తెలుగుతోపాటు నేషనల్ మీడియాలో సైతం వార్తలు వచ్చాయి. దీంతో మీరు రిలేషన్‌లో ఉన్నారా? అంటూ జాతీయ మీడియా ప్రతినిధి విజయ్ దేవరకొండను ప్రశ్నించారు. దీనిపై విజయ్ మాట్లాడుతూ ‘నేను సిద్ధంగా ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడతా. ప్రపంచం తెలుసుకోవాలి, అందరితో పంచుకోవాలని అనుకున్నప్పుడు తప్పకుండా ఆ విషయాన్ని బయటపెడతా. దానికంటూ ఒక ప్రత్యేక కారణం, సమయం ఉండాలి. కాబట్టి, అలాంటిరోజున సంతోషంగా నా వ్యక్తిగత జీవితం గురించి అందరితో పంచుకుంటా’ అని విజయ్ సమాధానం ఇచ్చాడు.
వ్యక్తిగత జీవితంపైనా..
వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ ప్రేమ వ్యవహారం తరుచూ వార్తల్లో నిలవడంపైనా విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) స్పందించాడు. ‘పబ్లిక్ ఫిగర్‌గా ఉన్నప్పుడు నా వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని అందరూ ఆసక్తి చూపిస్తుంటారు. అదీ వృత్తిలో భాగంగానే భావిస్తా. దానినుంచి ఎలాంటి ఒత్తిడి తీసుకోను. వార్తలను కేవలం వార్తలుగానే చూస్తా. ఒకే ఒక్కసారి అలాంటి వార్తలపై స్పందించా’ అని విజయ్ దేవరకొండ తెలిపాడు. మీడియా, సోషల్ మీడియాల్లో తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఏదీ మనసుకు తీసుకోనని పరోక్షంగా తెలియజేశాడు.
ప్రేమపై షాకింగ్ కామెంట్స్
‘హద్దులు లేని ప్రేమ’ అనే బంధంపై మీ అభిప్రాయం ఏంటని విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)ను మీడియా ప్రతినిధి ప్రశ్నించాడు. దీనిపై విజయ్ మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘అపరిమితమైన ప్రేమ అనేది ఉందో, లేదో నాకు తెలియదు. ఒకవేళ అదే ఉంటే దానితోపాటే బాధ కూడా ఉంటుంది. మీరు ఎవరైనా ఒక వ్యక్తిని అమితంగా ప్రేమిస్తే బాధను కూడా మోయాల్సి ఉంటుంది’ అని విజయ్ తెలిపాడు. దీంతో ఈ కామెంట్స్ రష్మికను ఉద్దేశించి చేశాడా? అని కూడా నెటిజన్లు చర్చించుకుంటున్నారు. రష్మికను అమితంగా ప్రేమించడం లేదా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
నాకు అలాంటివాడే కావాలి: రష్మిక
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన హీరోయిన్ రష్మిక కాబోయో వాడు ఎలా ఉండాలో స్పష్టం చేసింది. ‘నా భాగస్వామి నా జీవితంలోని ప్రతీ దశలోను తోడుండాలి. అన్నివేళలా భద్రతనివ్వాలి. కష్ట సమయంలో నాకు సపోర్ట్ చేయాలి. ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాలి. ఒకరిపై ఒకరు బాధ్యతగా ఉంటే జీవితమంతా కలిసిఉండొచ్చు’ అని తెలిపింది. అటు ప్రేమ గురించి సైతం మాట్లాడుతూ ‘నా దృష్టిలో ప్రేమలో ఉండడం అంటే భాగస్వామిని కలిగిఉండడమే. తోడు లేకపోతే జీవితానికి ప్రయోజనం ఉండదు. ఒడుదొడుకుల్లో మనతో ఉండి సపోర్ట్ చేసేవారు ఉండాలి’ అని రష్మిక చెప్పుకొచ్చింది.
వచ్చే ఏడాదే పెళ్లి!
‘పుష్ప 2’ రిలీజ్ తర్వాత విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న నిశ్చితార్థం (Vijay Devarakonda – Rashmika Mandanna Engagement) చేసుకోబోతున్నట్లు ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ నెలలో నిశ్చితార్థం నిర్వహించి వచ్చే ఏడాది ఆరంభంలోనే పెళ్లి (Vijay Devarakonda – Rashmika Mandanna Wedding) చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించినట్లు ప్రచారం జరిగింది. దీనిపై త్వరలోనే రష్మిక – విజయ్ దేవరకొండ జాయింట్‌గా ఓ అధికారిక ప్రకటన విడుదల చేసే ఛాన్స్ ఉందంటూ నెట్టింట పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. తాజా ఇంటర్వ్యూలో విజయ్ చెప్పిన సమయం అదే కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి