• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Naveen Polishetty Birthday Special: అనగనగా ఒక రాజు ప్రీవెడ్డింగ్‌ వీడియో రీలీజ్‌!

    కామెడీకి కొత్త దారులు చూపించిన యువ నటుడు నవీన్‌ పొలిశెట్టి. తన నటనతోనే కాకుండా, తన మాటలతో కూడా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. నవీన్‌ కామెడీ టైమింగ్‌.. ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. ఇవాళ అంటే డిసెంబర్‌ 26, నవీన్‌ పొలిశెట్టి పుట్టినరోజు సందర్భంగా, ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న అనగనగా ఒక రాజు చిత్రంలోని ప్రత్యేకమైన ప్రీవెడ్డింగ్‌ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.

    రాజుగారి పంచ్‌లు సూపర్‌ హిట్‌

    వీడియో ప్రారంభంలోనే విందు భోజనాలు బంగారు పళ్లెంలో వడ్డిస్తుండగా, మరోవైపు నవీన్‌ పొలిశెట్టి పాత్రలోని రాజు, ముకేశ్‌ అంబానీ తనయుడు అనంత్‌ అంబానీ పెళ్లి వీడియో చూస్తుంటాడు. ఈ సమయంలో ఫోన్‌లో “ముకేశ్‌ మామయ్య… నీకు వంద రీచార్జులు” అంటూ చెప్పే పంచ్‌ అభిమానులను కడుపుబ్బా నవ్వించింది. జస్టిన్‌ బీబర్‌, కిమ్‌ కర్దాషియన్‌, జాన్‌ సేనతో తన సంగీత్‌లో స్టెప్పులేయిస్తానంటూ చెప్పే రాజు మాటలు ప్రేక్షకులకు ఫుల్‌ ఎంటర్టైన్‌మెంట్‌ అందించాయి. చివర్లో పెళ్లికూతురు మీనాక్షి చౌదరితో కలిసి రాజుగారి ఫోటోషూట్‌ వీడియోను చూపించి అందరిని ఆకట్టుకున్నాడు.

    ఫుల్‌ కామెడీతో నిండిన ప్రీవెడ్డింగ్‌ వీడియో

    ఈ మూడు నిమిషాల వీడియోలో నవీన్‌ పంచ్‌లు, సీన్‌ డిజైన్‌ మరింత ఎంగేజింగ్‌గా ఉంది. ఈ వీడియో చూసిన అభిమానులు సినిమా ఏ రేంజ్‌ హిట్‌ అవుతుందోనని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    “అనగనగా ఒక రాజు” సినిమా విశేషాలు

    ఈ చిత్రంలో నవీన్‌ పొలిశెట్టి సరసన నటి మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. మారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్‌ సంగీతం అందిస్తున్నారు. తార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ మరియు ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య కలిసి ఈ సినిమాను నిర్మించారు.

    ఈ సినిమా నవీన్‌ పొలిశెట్టి మరోసారి తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను మెప్పించి, భారీ విజయాన్ని అందుకుంటాడని అందరూ ఆశిస్తున్నారు. “అనగనగా ఒక రాజు” ప్రీవెడ్డింగ్‌ వీడియోతో సినిమా మీద హైప్‌ మరింత పెరిగింది!

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv