Allu Arjun: బన్నీని చూసి విజయ్ దేవరకొండ ఎమోషనల్.. కానరాని మెగా హీరోలు!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Allu Arjun: బన్నీని చూసి విజయ్ దేవరకొండ ఎమోషనల్.. కానరాని మెగా హీరోలు!

    Allu Arjun: బన్నీని చూసి విజయ్ దేవరకొండ ఎమోషనల్.. కానరాని మెగా హీరోలు!

    December 14, 2024

    ‘పుష్ప 2’ (Pushpa 2) ప్రీమియర్స్‌ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో హీరో అల్లు అర్జున్‌ను పోలీసులు శుక్రవారం (డిసెంబర్‌ 13) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నాంపల్లి కోర్టు ‌అతడికి 14 రోజుల రిమాండ్‌ విధించగా హైకోర్టు మధ్యంతర బెయిల్‌ జారీ చేసింది. దీంతో శనివారం (డిసెంబర్‌ 14) ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి అల్లు అర్జున్‌ (Allu Arjun Release From Jail) విడుదలయ్యారు. ఇంటికి చేరుకున్న ఆయన్ను చూసేందుకు ప్రస్తుతం సెలబ్రిటీలు క్యూ కడుతున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, నాగ‌చైత‌న్య‌, రానా, వంశీపైడిప‌ల్లి, దిల్‌రాజు, కొర‌టాల శివ‌, హ‌రీష్ శంక‌ర్‌తో పాటు ప‌లువురు హీరోలు, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు అల్లు అర్జున్‌ ఇంటికి చేరుకొని కొద్దిసేపు ముచ్చటించారు. అయితే బన్నీ-రౌడీ భాయ్‌కు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

    బన్నీని హత్తుకున్న విజయ్‌..

    అల్లు అర్జున్‌ (Allu Arjun) జైలు నుంచి ఇంటికి చేరుకున్నారన్న వార్త వినగానే రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) ఆగమేఘాల మీద బన్నీ ఇంటికి వచ్చేశారు. శనివారం ఉదయం అల్లు అర్జున్ నివాసానికి హీరో విజయ్ దేవరకొండ తన సోదరుడు ఆనంద్ దేవరకొండతో కలిసి వెళ్లారు. ఆ సమయంలో బన్నీ ఫోన్‌లో మాట్లాడుతుండగా విజయ్‌కు నిర్మాత అల్లు అరవింద్ కరచలనంతో స్వాగతం పలికారు. అప్యాయంగా విజయ్‌ను కౌగిలించుకున్నారు. అటు అల్లుఅర్జున్‌ కూడా ఫోన్‌ కాల్‌ ఆపేసి విజయ్‌కు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చారు. ఆపై ఇద్దరు ఒకరినొకరు అప్యాయంగా హగ్‌ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. కష్టకాలంలో అల్లు అర్జున్‌కు అండగా నిలిచిన రౌడీ భాయ్‌ను బన్నీ ఫ్యాన్స్ అభినందిస్తున్నారు. 

    కంటతడి పెట్టిన సుక్కు

    ‘పుష్ప 2’ డైరెక్టర్‌ సుకుమార్‌ (Sukumar), నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాతలు నవీన్‌, రవిశంకర్‌ కూడా బన్నీని పలకరించేందుకు ఆయన ఇంటికి వెళ్లారు. బన్నీని చూడగానే డైరెక్టర్‌ సుకుమార్‌ చాలా ఎమోషనల్‌ అయ్యారు. కంటతడి పెట్టారు. దీంతో సుక్కును బాధపడవద్దని బన్నీ వారించారు. ప్రేమగా గుండెలకు హత్తుకొని ఓదార్చారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. సుకుమార్‌, బన్నీ బంధం ఎంత బలమైందో మరోమారు నిరూపితమైందని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ తర్వాత బన్నీతో పాటు పక్కనే ఉన్న సోఫాలో కూర్చున్న సుకుమార్‌, పుష్ప 2 నిర్మాతలు ఆయనతో కొద్దిసేపు ముచ్చటించారు. తాము ‌అండగా ఉన్నామని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. 

    మెగా హీరోలు ఎక్కడ?

    శుక్రవారం (డిసెంబర్‌ 13) అల్లు అర్జున్‌ అరెస్టు వార్త తెలిసిన వెంటనే మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) తన ‘విశ్వంభర’ (Viswambhara) షూటింగ్‌ను క్యాన్సిల్‌ చేసుకొని మరి బన్నీ ఇంటికి వెళ్లారు. భార్య సురేఖతో కలిసి వెళ్లి ఓదార్చారు. కొద్దిసేపటి తర్వాత సోదరుడు నాగబాబు (Naga Babu) సైతం బన్నీ ఇంటికి వెళ్లిన దృశ్యాలు మీడియాలో ప్రసారమయ్యాయి. అయితే శనివారం బన్నీ ఇంటికి వచ్చిన తర్వాత ఒక్క మెగా హీరో అతడ్ని పరామర్శించేందుకు వెళ్లకపోవడం చర్చనీయాంశంగా మారింది. చిరంజీవి భార్య సురేఖ (Surekha Konidela) ఒక్కరే బన్నీ ఇంటికి వెళ్లారు. అల్లుఅర్జున్‌ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. రామ్‌చరణ్‌, వరుణ్‌ తేజ్‌, సాయిధరమ్‌ తేజ్‌, పంజా వైష్ణవ్‌ తేజ్‌లలో ఎవరూ బన్నీని పలకరించడానికి వెళ్లలేదు. దీంతో మెగా వర్సెస్‌ అల్లు వివాదం మరోమారు సోషల్‌ మీడియాలో తెరపైకి వచ్చింది. 

    బన్నీకి ఎమోషనల్‌ స్వాగతం

    శనివారం (డిసెంబర్‌ 14) తెల్లవారుజామున చంచల్‌గూడ జైలు నుంచి పోలీసులు బన్నీని విడుదల చేశారు. దీంతో జైలు నుంచి నేరుగా తొలుత గీతా ఆర్ట్స్‌ కార్యాలయానికి అల్లు అర్జున్‌ వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత అక్కడి నుంచి నివాసానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఇంటికి వచ్చిన బన్నీకి కుటుంబల సభ్యులు దిష్టి తీసి స్వాగతం పలికారు. ఇంటికి వచ్చిన తండ్రిని చూసిన కుమారుడు అయాన్‌ పరిగెత్తుకొచ్చి హగ్‌ చేసుకున్న దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. తర్వాత సతీమణి స్నేహాను అప్యాయంగా కౌగిలించుకున్నారు. ఈ సందర్భంగా స్నేహా బావోద్వేగానికి గురయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సైతం ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 

    ‘ఆ ఘటనలో నా ప్రమేయం లేదు’

    ఇంటి వద్ద బన్నీ మీడియాతో మాట్లాడారు. కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి థ్యాంక్స్‌ చెప్పారు. సంధ్య థియేటర్‌ వద్ద చోటుచేసుకున్న ఘటన (Sandhya Theatre Incident) గురించి మాట్లాడుతూ ‘దురదృష్టకర ఘటన. ఆ కుటుంబానికి జరిగిన దానికి నేను ఎంతగానో చింతిస్తున్నా. అనుకోకుండా జరిగిన ఈ ఘటనలో నా ప్రమేయం లేదు. సుమారు 20 ఏళ్ల నుంచి ఆ థియేటర్‌కు నేను వెళ్తున్నా. దాదాపు 30 సార్లు అక్కడ సినిమా చూశా. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదు. త్వరలోనే ఆమె (చనిపోయిన రేవతి) కుటుంబాన్ని కలుస్తా. ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది. దీని గురించి మాట్లాడాలనుకోవడం లేదు’ అని అల్లు అర్జున్‌ అన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version