ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్‌లో భాగంగా భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. తక్కువ ధరకే మెుబైల్స్, గ్యాడ్జెట్స్, ల్యాప్‌టాప్స్, ఇయర్ బడ్స్, ఎలక్ట్రానిక్ డివైజ్‌లను ఆఫర్ చేస్తోంది. వీటితో పాటు కారుకు సంబంధించిన పరికరాల పైనా అమెజాన్ ఊహించని రాయితీలను ప్రకటించింది. మీ కారుకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేసేందుకు ఇదే మంచి సమయం. కారు ఉపకరణాలపై అమెజాన్ ఇస్తోన్న బెస్ట్ డీల్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.
Woscher Car Vacuum Cleaner
కారును శుభ్రం చేసే వాక్యూమ్ క్లీనర్లు అమెజాన్‌లో భారీ రాయితీతో లభిస్తున్నాయి. ముఖ్యంగా Woscher Car Vacuum Cleaner 39% డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. దీనిని రూ.1,529లకు పొందవచ్చు. దీని సాయంతో కారు ఉపరితలం, సీట్లు, డిక్కీలను చాలా తేలిగ్గా శుభ్రం చేయవచ్చు.
Aegon Car Neck Rest Pillow
కారు సీటు కొంతమందికి సౌకర్యంగా అనిపించకపోవచ్చు. ముఖ్యంగా కారులో ఎక్కువ దూరం ప్రయాణించేటప్పుడు కొందరికి మెడ నొప్పి వస్తుంటుంది. దానికి నెక్ రెస్ట్ పిల్సోస్‌తో చెక్ పెట్టవచ్చు. అమెజాన్‌లో Aegon Car Neck Rest Pillowపై మంచి డిస్కౌంట్ ఉంది. దీనిని 40% రాయితీతో రూ.899లకు పొందవచ్చు. ఈ పిల్లోను సీటు పై భాగంలో సెట్ చేయడం ద్వారా మెడ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.
Sounce Charging Adapter
కారులో మెుబైల్ ఛార్జ్ పెట్టుకునేందుకు మల్టీపుల్ చార్జింగ్ స్లాట్స్ కోరుకునేవారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మెుత్తం నాలుగు 4.1A USB ports, 4 power పవర్ ఔట్‌లెట్స్, 220V AC సాకెట్స్‌తో రానుం ది. దీని అసలు ధర రూ.3,499. కానీ అమెజాన్ 49% డిస్కౌంట్‌తో రూ.1,799లకు ప్రొడక్ట్ ఆఫర్ చేస్తోంది.
Nebelr Car Air Purifier
ఈ పోర్టబుల్ ఎయిర్ ప్యూరిఫైయర్ ఇప్పుడు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ కింద రూ. 8,000కి బదులుగా రూ. 4,740కి కొనుగోలు చేయవచ్చు. దీన్ని కారులో ఉంచేలా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఇది కారులోని కలుషిత గాలిని తొలిగించి ఫ్రెష్ ఎయిర్‌ను అందిస్తుంది.
BROGBUS Steaering Desk
కారును నిలిపి ఉంచిన సందర్భంలో డ్రైవర్ సీటులో ఉన్న వ్యక్తి ఏదైనా తినాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అటువంటి సమస్య నుంచి BROGBUS Steaering Desk ఉపశమనం కలిగిస్తుంది. ఇందుకోసం స్టీరింగ్ కింది భాగంలో ఈ డెస్క్‌ను ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఆపై దానిపై ఎంచక్కా ఫుడ్ పెట్టుకొని తినవచ్చు. అలాగే ల్యాప్‌టాప్‌ను కూడా పెట్టుకోవచ్చు. అమెజాన్‌లో ఇది 41% డిస్కౌంట్‌తో రూ.704లకు లభిస్తోంది.
Wooden Beads Seat Cover
డ్రైవింగ్ సీటులో కూర్చునే వారికి గ్రిప్ చాలా ముఖ్యం. ఇందుకోసం Wooden Beads Seat Cover ఉపయోగపడుతుంది. ఇది పూర్తిగా చెక్కతో తయారు చేయబడిన సీట్ కవర్. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఎలాంటి కారుకైనా ఇది సరిపోతుంది. ఆఫీసు చైర్లకు కూడా దీన్ని వినియోగించవచ్చు. అమెజాన్‌లో ఇది రూ. 1,329లకు సేల్ అవుతోంది.
Appucoco Car Side Gap Organizer
స్పేస్ తక్కువ ఉండే కార్లకు ఈ సీటు పాకెట్ ఉపయోగకరంగా ఉంటుంది. ఫ్రంట్ వైపు ఉన్న సీట్లకు మధ్యలో ఈ పాకెట్‌ను ఈజీగా ఫిక్స్ చేయవచ్చు. ఇది మెుబైల్స్, గ్లాసెస్, వాలెట్స్, కాయిన్స్, తళాలు తదితర వస్తువులను పెట్టేందుకు ఉపయోగపడుతుంది. ఇది 72% రాయితీతో రూ.281లకు అమెజాన్‌లో లభిస్తోంది.
Car Bed Mattress
కారులో లాంగ్ జర్నీలు చేసే సమయంలో చాలా మంది అలిసిపోతుంటారు. కుర్చీలోనే ఎక్కువ సేపు విశ్రాంతి తీసుకోవడం వారికి కష్టంగా ఉంటుంది. అటువంటి సందర్భాల్లో Car Bed Mattress ప్రయోజనకరంగా ఉంటాయి. వెనుకవైపు సీట్లలో దీన్ని పరుచుకోవడం ద్వారా హాయిగా బెడ్‌పైనా పడుకున్న అనుభూతిని పొందవచ్చు. AllExtreme Car Bed Mattressను అమెజాన్ 23% డిస్కౌంట్‌తో రూ.1,699 అందిస్తోంది.
Celebrities Featured Articles
Revanth Reddy: సీఎం రేవంత్‌పై విరుచుకుపడ్డ హీరోయిన్.. సినీ పెద్దల భేటిపై మరో నటి ఫైర్!