• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Anasuya Bharadwaj: ‘మీరు చేసినట్లు మరెవ్వరూ చేయలేరు’.. అనసూయ పోస్ట్ వైరల్

    హాట్‌ యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌ (Anasuya Bharadwaj) మరోమారు తన అందచందాలతో సోషల్‌ మీడియాను తనవైపు తిప్పుకుంది. 

    తాజాగా సొగసైన చీరకట్టులో కనిపించిన అనసూయ.. మైకం తెప్పించే ఫొజులతో నెటిజన్లకు హాట్‌ ట్రీట్‌ ఇచ్చింది. 

    చీరకట్టులో పద్దతిగా కనిపిస్తూనే కుర్రకారు గుండెల్లో సెగలు రేపింది. చురకత్తి లాంటి చూపులతో నెటిజన్లను కట్టిపడేసింది. స్వయంగా అనసూయ షేర్‌ చేసిన ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. 

    ఫొటోలతో పాటు ఓ మెసేజ్‌ను కూడా అనసూయ (Anasuya Bharadwaj) షేర్‌ చేసింది. తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన విషయం అంటూ పోస్ట్ చేసింది. ‘మీరు చేసే పనిని.. మీరు చేసే విధంగా మరెవ్వరూ చేయలేరు. అదే మీ సూపర్‌ పవర్‌’ అంటూ అనసూయ రాసుకొచ్చింది.

    జబర్దస్త్‌ షో (Jabardasth Show) ద్వారా బుల్లితెరకు తొలిసారి అనసూయ పరిచయమైంది. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో కనిపించి కుర్రకారును తన మాయలో పడేసింది. 

    2012 – 2022 మధ్య  బుల్లితెర యాంకర్‌గా ‌కొనసాగిన అనసూయ.. మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. కేవలం యాంకర్‌గానే గాక గ్లామర్‌ బ్యూటీగానూ పేరు తెచ్చుకుంది. 

    యాంకర్‌ కాకముందు ప్రముఖ వార్త ఛానల్‌లో అనసూయ (Anasuya Bharadwaj) న్యూస్‌ రీడర్‌గా చేసింది. నటనపై ఉన్న మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

    తెలుగులో సోగ్గాడే చిన్ని నాయన (Soggade Chinni Nayana), క్షణం (Kshanam), విన్నర్‌ (Winner), గాయత్రి (Gayathri) సినిమాల్లో అనసూయ నటించింది. క్షణం చిత్రంలో ఆమె పోషించిన ప్రతినాయక పాత్రకు మంచి మార్కులే పడ్డాయి.

    రంగస్థలం (Rangasthalam) సినిమా అనసూయ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇందులో రంగమ్మత్త పాత్రలో అద్భుతంగా నటించింది. తన యాక్టింగ్‌తో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది. 

    రంగస్థలం తర్వాత వరుస సినిమా ఆఫర్లు అనసూయను చుట్టుముట్టాయి. మీకు మాత్రమే చెప్తా (Meku Matrame Chepta), కథనం (Kathanam), F2, చావు కబురు చల్లగా (Chavu Kaburu Challaga), థ్యాంక్‌ యూ బ్రదర్‌, కిలాడీ, వాంటెడ్ పండుగాడు సినిమాల్లో అనసూయ మెరిసింది. 

    సుకుమార్‌ తెరకెక్కించిన ‘పుష్ప’ (Pushpa) సినిమాలోనూ అనసూయ గోల్డెన్‌ ఛాన్స్‌ కొట్టేసింది. ఇందులో దాక్షయణి పాత్ర పోషించి అలరించింది.

    ఇటీవల పెదకాపు1 (PeddaKapu-1) అనే సినిమాలో అనసూయ కీలక పాత్రలో నటించింది. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.

    అలాగే విమానం (Vimanam) అనే మరో మూవీలోనూ అనసూయ నటించింది.  తెలంగాణ మాండలికం ఓన్ చేసుకుని చక్కగా నటించిందనే టాక్ వచ్చింది.

    ప్రస్తుతం అనసూయ చేతిలో చాలా సినిమాలున్నాయి. అల్లు అర్జున్ పుష్ప- 2 (Pushpa 2) మూవీలో ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. 

    పుష్ప-2తో పాటు పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో అనసూయ నటిస్తోంది. ప్రస్తుతం అనసూయ కాల్ షీట్స్ కోసం దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారని టాక్‌.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv