• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • శభాష్ మౌనిక

    దివంగత ప్రధాని వాజ్ పేయి జీవితంపై నిర్వహించిన యూత్ పార్లమెంట్ కార్యక్రమంలో కామారెడ్డికి చెందిన మౌనిక అద్భుతంగా ప్రసంగించింది. దేశవ్యాప్తంగా 25 మందిని ఎంపిక చేయగా తెలుగు రాష్ట్రాల నుంచి ఆమెకు అవకాశం దక్కింది. బాన్సువాడ మండలం పోచారంకు చెందిన మౌనిక..ఆర్కే పీజీ కళాశాలలో చదువుతోంది. చదువుతో పాటు ప్రసంగాలతోనూ ఆమె ఆకట్టుకునేది. పార్లమెంట్ సెంట్రల్ హాల్ వేదికగా వాజ్ పేయి గురించి ఇచ్చిన [ప్రసంగం](url)పై ప్రశంసలు దక్కాయి తెలంగాణ రాష్ట్రం నుండి ఎంపికై నేడు ఢిల్లీ పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో అటల్ … Read more

    శ్మశానాల వద్ద బారులు

    చైనాలో కరోనా విలయ తాండవం చేస్తోంది. గత కొన్ని రోజులాగా వేలమంది చనిపోతున్నారనే వార్తలు కలవరపెడుతున్నాయి. శ్మశానవాటికల వద్ద భయానక పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తోంది. మృతదేహాలతో కుటుంబసభ్యులు వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చిందని సమాచారం. ఆస్పత్రి మార్చురీలు నిండిపోయి కారిడార్లలో వరుసగా మృతదేహాలు కనిపిస్తున్నాయట. ఇందుకు సంబంధించి అమెరికాకు చెందిన అంటువ్యాధి నిపుణులు ఎరిక్ ఫీగల్ డింగ్ షేర్ చేసిన [వీడియో](url)లా ఆందోళనకు గురిచేస్తున్నాయి. 35) Epic long lines at crematoriums… imagine having to not just wait for hours … Read more

    వెడ్డింగ్ ఫొటోషూట్ లో కోతి హంగామా

    ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది ఇటీవల సాధారణం అయ్యింది. అందమైన ప్రాంతాలకు వెళ్లి ఫొటోలు దిగుతుంటారు. ఇలాగే ఇద్దరి జంట ఫొటోలకు ఫోజులు ఇస్తుండగా ఓ కోతి తన బిడ్డతో పాటు వచ్చి [హంగామా ](url)చేసింది. వారి ఫోటోషూట్ ను చెడగొట్టింది. అంతేనా, అబ్బాయి మీదకు ఎక్కి ఫోజులిచ్చింది. మెుదట పెళ్లి కూతురు బయపడినప్పటికీ తర్వాత మళ్లీ వచ్చి వాటితో సరాదాగా గడిపింది. ఈ దృశ్యాలన్నింటినీ కెమెరామెన్ చిత్రీకరించారు. ఈ ఫొటోలతో పాటు కోతి హంగామా జీవితాంతం గుర్తుండిపోతుంది. View this post on … Read more

    హరిహర వీరమల్లులో బాలీవుడ్ స్టార్

    పవర్‌ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రంలోకి బాలీవుడ్‌ నటుడు ఎంట్రీ ఇచ్చాడు. ప్రముఖ స్టార్ యాక్టర్ బాబి డియోల్‌ నటిస్తున్నాడు. ఆయనకు స్వాగతం పలుకుతూ చిత్రబృందం వీడియోను రిలీజ్ చేసింది. దీనికి ఎం.ఎం. కీరవాణి అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్ అదిరిపోయింది. సినిమాకు క్రిష్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతోంది. నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఏఎం రత్నం చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    జెర్సీ కూడా తీసేయ్: కోహ్లీ

    విరాట్‌ కోహ్లీ ఫీల్డింగ్‌లో ఎంత దూకుడుగా ఉంటాడో మన అందరికీ తెలిసిందే. బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్ మ్యాచ్‌లో లైట్‌ పోతున్న వేళ బ్యాట్స్‌మెన్ సమయం వృథా చేస్తుంటే అసహనం వ్యక్తం చేశాడు. కొన్ని బంతులు మిగిలి ఉన్న సమయంలో నజ్ముల్ షాంటో షూ లేస్‌ కట్టుకునేందుకు ఆగుతాడు. దీంతో కోహ్లీ ఆగ్రహంతో నీ చొక్కా(జెర్సీ) కూడా తీసేయాల్సింది అంటూ వ్యాఖ్యానించాడు. దీనికి సంబంధించిన[ వీడియో](url) వైరల్ అయ్యింది. ఫీల్డ్‌లో కోహ్లీని ఎవరూ ఆపలేరంటూ ఫ్యాన్స్‌ కామెంట్స్ పెడుతున్నారు. pic.twitter.com/NklYyAlETu — Guess Karo (@KuchNahiUkhada) … Read more

    ప్రేమ దోమా ఏం లేదు. అంతా కెమికల్స్‌: పూరీ

    ప్రేమ అనేది ఒక డ్రగ్ లాంటిందని దర్శకుడు పూరీ జగన్నాథ్ అన్నారు. ఆ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదంటూ సలహా ఇచ్చారు. పూరీ మ్యూజింగ్స్‌లో ఈ సారి లవ్‌ డ్రగ్‌ గురించి మాట్లాడారు. మనలో ఎమోషన్స్, భావోద్వేగాలకు కారణం శరీరంలో విడుదలయ్యే కెమికల్స్. వీటివల్లే నవ్వు, ఆనందం, ప్రేమ, కన్నీళ్లు వంటివి వస్తాయి. యూత్‌కు వాడి ప్రేమ మాత్రం నిజం అనిపిస్తుంది. అద్భుతం, పవిత్రం అనుకుంటారు. కానీ, ప్రేమ, దోమ ఏం లేదు అది కేవలం ఓ డ్రగ్ అని అధ్యయనాల్లో తేలింది” అన్నారు.

    2022 తెలంగాణ ఓవరాల్ రౌండప్

    ఒమిక్రాన్ కలవరం కారణంగా మూతబడిన పాఠశాలలు. రెండేళ్లకోసారి దర్శనమిచ్చే సమ్మక్క, సారలమ్మ ఆశీర్వచనాలు. 216 అడుగుల రామానుజాచార్యుడి విగ్రహ ప్రారంభోత్సవం. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన ఘట్టం మల్లన్న సాగర్ ఆవిష్కరణ. 12 ఏళ్లకోసారి వచ్చే ప్రాణహిత పుష్కరాల సందడి ఇది తెలంగాణలో ఈ ఏడాది మెుదటి అర్థభాగం. అంకురాలకు నిలయంగా మారిన టీ హబ్ 2.0, బాక్సింగ్ ఛాంపియన్‌గా నిఖత్ జరీన్, ఉవ్వెత్తున ఎగిసిపడిన అగ్నిపథ్ సికింద్రాబాద్‌ అల్లర్లు, క్యాసినో, మద్యం కుంభకోణం, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాలు వంటి పంచాయితీలు…ఒక్కసారిగా మునుగోడు గెలుపుతో జాతీయ … Read more

    జీన్స్‌ ధర రూ. 94 లక్షలు

    పురాతన వస్తువులకు రేటు పలుకుతుందని మనకు తెలుసు. కానీ, ఓ పాత జీన్స్‌ పాయింట్‌ ఏకంగా రూ. 94 లక్షలకు అమ్ముడయ్యింది. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన తెల్లటిరంగులోని జీన్స్ అమెరికా నార్త్‌ కరోలినాలోని ఓడ శిథిలాల్లో దొరికింది. 1857 ఓడ మునిగిపోగా.అందులోని శిథిలాల్లో జీన్స్‌ కనుగొన్నారు. 165 ఏళ్లు కలిగిన జీన్స్‌ను ఓ వ్యక్తి వేలంలో రూ.94 లక్షలకు కొన్నాడు. దీనిని లెవీ స్ట్రాస్ అండ్ కో కంపెనీ తయారు చేసి ఉంటుందని భావిస్తున్నారు. జీన్స్‌లో మెుదటి తరానిది కావచ్చని అంచనా.

    షూతో దాడి హీరోకు చేదు అనుభవం

    కన్నడ హీరో దర్శన్‌కు ఘోర అవమానం జరిగింది. క్రాంతి సినిమా పాటల ఆవిష్కరణ కార్యక్రమంలో అతడిపైకి గుర్తు తెలియని వ్యక్తి షూ విసిరాడు. అది దర్శన్‌ ముఖానికి నేరుగా తగిలింది. ఇటీవల కొన్ని విషయాల్లో వివాదాస్పద కామెంట్లు చేసినందుకు అతడిపై విమర్శలు వచ్చాయి. అందువల్లే ఇలా [దాడి](url) చేశారని భావిస్తున్నారు. ఈ ఘటనను పలువురు సినీ ప్రముఖులు ఖండించారు. ఆవేదన వ్యక్తం చేసిన నటుడు శివరాజ్ కుమార్…అమానవీయ ఘటనలకు పాల్పడొద్దని కోరారు. Keeping all the hate things aside ?Chappali alli hodiddu … Read more

    అర్జెంటీనాలో ఫ్యాన్స్ హంగామా

    ఫ్రాన్స్‌పై అర్జెంటీనా ఘన విజయం సాధించడంతో ఆ దేశంలో సంబరాలు అంబరాన్నంటాయి. రాజధాని బ్యూనోస్ ఐరీస్‌లో ఫ్యాన్స్ రోడ్లపైకి పెద్ద సంఖ్యలో తరలివచ్చి హంగామా చేశారు. వీధులన్నీ జనాలతో కిక్కిరిసిపోయాయి. కొందరు చొక్కాలు చింపేసి దేశ జెండాను ప్రదర్శిస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. 36 ఏళ్ల తర్వాత మళ్లీ కల నెరవేరడంతో భావోద్వేగానికి గురయ్యారు. చిన్న పెద్దా తేడా లేకుండా వేడుకలు జరుపుకున్నారు. మెస్సీ తమ కలను సాకారం చేశాడని తెగ సంబరపడుతున్నారు.