• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఏప్రిల్ 8 నుంచి తగ్గనున్న గ్యాస్‌ ధరలు

    దేశంలో PNG, CNG గ్యాస్ ధరలు తగ్గాయి. ధరల నిర్ణయంపై నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు కేంద్రం వీటి ధరలను 11 శాతం మేర తగ్గించింది. CNG గ్యాస్ కేజీ ధర ప్రస్తుతం రూ.92 ఉంటే అది దాదాపు రూ.83కు తగ్గింది. PNG గ్యాస్ కిలో రేటు రూ.57 నుంచి రూ.52కు తగ్గింది. ఈ ధరలు ONGC, OIL వంటి ప్రభుత్వరంగ సంస్థలు ఉత్పత్తి చేసిన సహజవాయువుకే వర్తించనున్నాయి. రిలయన్స్ కేజీ డీ6 వంటి ప్రైవేట్ సంస్థలు ఉత్పత్తి చేసే సహజవాయువుకు వర్తించవు. దేశ … Read more

    హిందీ బెల్టులోనూ దసరా కలెక్షన్ల జోరు

    నాని హీరోగా నటించిన దసరా మూవీ హిందీలో డిసెంట్ కలెక్షన్లు రాబడుతోంది. హిందీ రాష్ట్రాల్లో దసరా చిత్రం ఇప్పటివరకు రూ.3.5కోట్లు కొల్లగొట్టింది. నార్త్‌కు పెద్దగా పరిచయం లేనప్పటికీ నేచురల్ స్టార్‌ నానిని అక్కడి ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. కాగా ఈ సినిమా వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. ప్రేమ, స్నేహం ఇతివృత్తంతో వచ్చిన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోంది. సింగరేణి బ్యాక్‌డ్రాప్‌లో వీర్లపల్లి అనే గ్రామం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ‘ధరణి’ పాత్రలో నాని … Read more

    Hyderabad Rains: వడగండ్ల బీభత్సం… తెలంగాణకు ఆరెంజ్ అలెర్ట్ జారీ!

    హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం దంచి కొడుతోంది. ఈదురు గాలులతో భారీ వర్షం కురుస్తోంది. పంజాగుట్ట, సికింద్రాబాద్, నారాయణ గూడలో వాన కురిసింది. తెలంగాణలో పలు జిల్లాల్లో గంటకు 40 కి.మీ నుంచి 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. వర్షాల తీవ్రత దృష్ట్యా వాతావరణ శాఖ తెలంగాణకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. పిడుగులు పడే అవకాశం ఉండటంతో రైతులు పొలాల వద్ద చెట్ల కింద నిల్చోవద్దని సూచించింది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌, నాగోల్‌, ఎల్బీ నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, సరూర్‌నగర్‌, రామాంతపూర్‌, అంబర్‌పేట్‌, మలక్‌ … Read more

    పద్మశ్రీ అవార్డు అందుకున్న MM కీరవాణి

    స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి పద్మశ్రీ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులు మీదుగా అందుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరగిన కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా ఇతర కేంద్రమంత్రులు సైతం హాజరయ్యారు. కీరవాణితో పాటు SS రాజమౌళి కుటుంబం కూడా అవార్డుల కార్యక్రమంలో పాల్గొంది. కీరవాణితో పాటు బాలీవుడ్ నటి రవీనా టాండన్, ఇన్ఫోసిస్ అధినేత నారాయణ మూర్తి సతీమణి సూధామూర్తి.. పద్మా అవార్డులు అందుకున్నారు. #WATCH | Music composer MM Keeravani, who composed the song ‘Naatu Naatu’, … Read more

    సమంత నటన కిర్రాక్.. అదిరిపోయిన శాకుంతలం ట్రైలర్

    శాకుంతలం మూవీ రిలీజ్ ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. లేడి కళ్లు, నెమలి నడక, శివంగి నడుము అంటూ శకుంతల (సమంత) అందచందాలను దుష్యంతుడు వర్ణిస్తూ ట్రైలర్ స్టార్ట్ అయింది. మనసు వెళ్లే చోటకు మనము వెళ్లకూడదు అని ముని వాక్కు అంటూ సమంత క్యూట్‌గా డైలాగ్స్ పలికింది. భావోద్వేగం, పోరాట సన్నివేశాలతో ట్రైలర్ సాగింది. దుష్యంతుడి రోల్ చేస్తున్న దేవ్ మోహన్ లుక్స్ ఇంప్రెస్సివ్‌గా ఉన్నాయి. కాగా శాకుంతలం సినిమా ఏప్రిల్ 14న విడుదల కానుంది.

    ఫ్యాన్స్‌తో రవితేజ ఫన్నీ చిట్ చాట్

    మాస్ మహారాజా రవితేజ ‘రావణాసుర’ ప్రమోషన్‌ను వినూత్నంగా చేపట్టారు. మూవీ రిలీజ్‌కు మరో 3 రోజులే సమయం ఉండటంతో అభిమానులను #ASKRAVANASURA ట్యాగ్‌తో ట్విట్టర్‌లో పలకరించాడు. కాసేపు అభిమానులు అడిగిన ప్రశ్నలకు తనదైన రీతిలో సమాధానాలు చెప్పి అలరించాడు. ఓసారి ఫ్యాన్స్‌కు రవితేజ మధ్య జరిగిన చిట్ చాట్ పరిశీలిద్దాం. చాట్ చూసేందుకు పైన YouSay Webపై క్లిక్ చేయండి. ASK RAVANASURA: రావణాసుర సినిమాలో ఆ క్యారెక్టరే నా ఫెవరేట్… ఫ్యాన్స్‌తో రవితేజ ఫన్నీ చిట్‌ చాట్

    నాని కెరీర్‌లో బెస్ట్‌ ఫర్ఫామెన్స్ ఇదే: రాజమౌళి

    దసరా సినిమాపై స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు. ‘మాస్ పాత్రల మధ్య మనసుకు హత్తుకునే ప్రేమకథను తీయడంలో శ్రీకాంత్ ఓదెలా విజయం సాధించాడు. నాని తన నటజీవితంలోనే బెస్ట్‌ ఫర్ఫామెన్స్ ఇచ్చాడు. కీర్తి తన రోల్‌లో అద్భుతంగా నటన పండించింది. ప్రతి నటుడు తన క్యారెక్టర్‌లో ఇమిడిపోయారు. సినిమాటోగ్రఫి ఫస్ట్ క్లాస్‌గా ఉంది’ అంటూ చిత్ర బృందాన్ని అభినందించారు. Amidst the rugged landscape and raw characters, Srikanth Odela manages a tender heart touching lovestory. Career … Read more

    కోహ్లీ గిఫ్ట్ ఆంపియర్ ప్రైమస్ ప్రత్యేకతలు ఇవే!

    ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ మోస్ట్ ఎలక్ట్రిఫైయింగ్ ప్లేయర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. 49 బంతుల్లో 82 పరుగులు చేసిన కోహ్లీ Ampere primus ఎలక్ట్రిక్ స్కూటీని గిఫ్ట్‌గా అందుకున్నాడు. ప్రస్తుతం ఈ స్కూటీ గురించి నెటిజన్లు శోధిస్తున్నారు. దీనిని ఆంపియర్, గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ RCB భాగస్వామ్యంతో సంయుక్తంగా నిర్మించింది. రూ.499తో స్కూటీని బుక్ చేసుకోవచ్చు. ఇది 4.2 సెకన్స్‌లోనే 77Kmph స్పీడ్ అందుకుంటుంది. LFP బ్యాటరీ ప్యాక్‌తో వస్తున్న ఈ స్కూటీ లక్ష కిలోమీటర్ల లైఫ్‌ టైమ్‌ను … Read more

    వావ్.. నీతా అంబానీ ఇంత టాలెంటా?

    ప్రముఖ వ్యాపార దిగ్గజం ముఖేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ శాస్త్రీయ నృత్యంతో అలరించారు. ‘రఘుపతి రాఘవ రాజారాం పతితపావన సీతారాం’ పాటకు డ్యాన్స్ చేశారు. నీతా- ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్‌ సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆమె ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వైరల్‌గా మారింది. శాస్త్రియ నృత్యంపై ఆమెకున్న పట్టును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. వీడియో చూసేందుకు పైన Watch Onపై క్లిక్ చేయండి. #WATCH | Mumbai: Nita Ambani gracefully dances on 'Raghupati Raghava Raja … Read more

    తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర

    దేశవ్యాప్తంగా కమర్షియల్ సిలిండర్ ధరలను ఆయిల్ కంపెనీలు తగ్గించాయి. 19కేజీల కమర్షియల్ సిలిండర్‌పై రూ.91.50 తగ్గించాయి. తాజా తగ్గింపుతో గ్యాస్ బండ ధర రూ.2,233కు పడిపోయింది. మరోవైపు గృహ అవసరాలకు వాడే 14కేజీల సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం 14కిలోల సిలిండర్ రేటు హైదరాబాద్‌లో రూ.1150గా ఉంది. ప్రతి నెల ఒకటో తేదీన ఆయిల్ సంస్థలు రేట్లను సమీక్షిస్తుంటాయి. ప్రతీ ఆర్థిక సంవత్సరం తొలి రోజున చమురు సంస్థలు ఎల్‌పీజీ సిలిండర్ల ధరల్లో మార్పులు చేస్తుంటాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ, … Read more