దేశంలో PNG, CNG గ్యాస్ ధరలు తగ్గాయి. ధరల నిర్ణయంపై నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు కేంద్రం వీటి ధరలను 11 శాతం మేర తగ్గించింది. CNG గ్యాస్ కేజీ ధర ప్రస్తుతం రూ.92 ఉంటే అది దాదాపు రూ.83కు తగ్గింది. PNG గ్యాస్ కిలో రేటు రూ.57 నుంచి రూ.52కు తగ్గింది. ఈ ధరలు ONGC, OIL వంటి ప్రభుత్వరంగ సంస్థలు ఉత్పత్తి చేసిన సహజవాయువుకే వర్తించనున్నాయి. రిలయన్స్ కేజీ డీ6 వంటి ప్రైవేట్ సంస్థలు ఉత్పత్తి చేసే సహజవాయువుకు వర్తించవు.
దేశ రాజధాని ఢిల్లీలో కిలో సీఎన్జీపై రూ.4 తగ్గిస్తున్నట్లు ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ ప్రకటించింది. నేటి నుంచే ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. దీంతో ఢిల్లీలో రూ.77.20గా ఉన్న కిలో సీఎన్జీ ధర రూ.73.59కి తగ్గింది. నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లో కూడా ఇదే ధరలు అమల్లో ఉండగా గురుగ్రామ్‌లో ఇది రూ.82.62గా ఉంది. ఢిల్లీలో గతేడాది డిసెంబర్‌లో సీఎన్జీ ధరలు పెరిగాయి. ఆ తర్వాత సీఎన్జీ ధర తగ్గడం ఇదే తొలిసారి. 2021-2022 డిసెంబర్ మధ్య సీఎన్జీ ధరలు 83 శాతం పెరిగాయి.
సీఎన్జీతోపాటు గృహావసరాలకు వినియోగించే పైపుడ్ నేచురల్ గ్యాస్ ధరను కూడా ఐజీఎల్ తగ్గించింది. ఢిల్లీలో ఇప్పటివరకు కిలో పీఎన్‌జీకి రూ.53.59గా ఉన్న ధర రూ.48.59కి దిగివచ్చింది.
Celebrities Featured Articles
Revanth Reddy: సీఎం రేవంత్‌పై విరుచుకుపడ్డ హీరోయిన్.. సినీ పెద్దల భేటిపై మరో నటి ఫైర్!